Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
చిట్టి దమ్ ఆలు--కొంచెం హాటు కొంచెం స్వీటు
లుగడ్డలు కనిపించగానే కరకరలాడే చిప్స్ కళ్లముందు మెదులుతుంటాయి. లేదంటే కమ్మటి వేపుడు గుర్తుకొస్తుంది. టమోట, వంకాయ కూరల్లో రెండు ఆలుగడ్డలు వేసుకోవడం కూడా రొటీనే. ఇంకా ఏం చేసుకోవచ్చు అంటారా... కొంచెం కొత్తగా, వెరైటీగా ఉండే ఆలుగడ్డ వంటల్ని .
ఇండియన్ వంటల్లో బాగా ప్రసిద్ది చెందిన వంటకాల్లో ఈ ఆలూ దమ్ కూడా ఒకటి. ఈ ఆలూ దమ్ ను ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా తయారు చేస్తుంటారు. ఉదాహరణకు పశ్చిమబెంగాల్ లో పోస్టో ఉపయోగించి గ్రేవి చిక్కగా తయారు చేసి ఆలూ దమ్ చేస్తారు. అదే సౌత్ లో గ్రేవీకి కొబ్బరి తురుము ఉపయోగించి తయారు చేస్తారు. ఇక రెస్టారెంట్లలో ఐతే ఇండియన్ మసాలా ధినుసులు, కొబ్బరి తురుము, టమోటో కెచప్ తో ఘాటుగా తయారు చేస్తారు.
చాలా మంది ఇంట్లో తయారు చేసేటప్పుడు, టమోటో కెచప్ కు బదులు, టమోటో గుజ్జును ఉపయోగిస్తారు. టమోటో కెచప్ చేర్చడం వల్ల కొద్దిగా తియ్యగా.. ఇండియన్ మసాలలు చేర్చడం వల్ల కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్ రోటీకు చాలా ఫర్ఫెక్ట్ కాంబినేషన్..మరి ఆలూ దమ్ ఎలా తయారు చేస్తారా చూద్దాం రండి....

కావలసిన పదార్థాలు:
చిన్నసైజు బంగాళదుంపలు: 8-10
జీడిపప్పు పలుకులు: 10
ఉల్లిపాయలు: 2
టమోట: 1
అల్లం వెల్లుల్లి ముద్ద: 1tsp
పసుపు: చిటికెడు
కారం: 2tsp
జీలకర్ర పొడి: 1tsp
ధనియాల పొడి: 1tsp
కరివేపాకు: రెండు రెబ్బలు
ఆవాలు, జీలకర్ర: 1tsp
కొత్తిమీర: ఒక కట్ట
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తరువాత ఉల్లిపాయ ముక్కల్ని , జీడిపప్పుని నూనె వేసి విడివిడిగా వేగించుకోవాలి. రెండూ కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగించాలి.
4. తరువాత ఉడికించి పెట్టుకున్న బంగాళ దుంపల్ని వేసి ఎర్రగా అయ్యేవరకూ వేగించాలి.
5. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపిన తరువాత ఉల్లిపాయ గుజ్జు వేయాలి.
6. ఉప్పు, కారం, పసుపు కూడా వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి సన్నని మంటపై మగ్గనివ్వాలి. దించేముందు కొత్తిమీర తురుము వేసుకోవాలి. అంతే దమ్ బేబి పొటాటో రిసిపి రెడీ.



Click it and Unblock the Notifications