టమోటో - దోసకాయ కర్రీ చపాతి సూపర్ కాంబినేషన్

Tomato - Cucumber Curry
కావలసిన పదార్థాలు :
దోసకాయలు: 2
టొమోటోలు: 4
ఉల్లిపాయ: 2
నూనె: సరిపడా
కరివేపాకు: 2రెమ్మలు
జీలకర్ర, ఆవాలు: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
పసుపు: చిటికెడు
పచ్చిమిర్చి: 2-4
కారం: సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
ధనియాలపొడి: 1tsp
ఎండుకొబ్బరిపొడి: 1 tsp
కొత్తిమీర తరుగు: 1tbsp

తయారు చేయు విధానం :
1. ముందుగా దోసకాయల్ని చెక్కుతీసి ముక్కలుగా చేసుకోవాలి.
2. తర్వాతపాత్రలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఉల్లిపాయల్ని వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి.
3. వెంటనే పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తరువాత ఒకటి వేసి అర నిమిషంపాటు వేయించాలి.
4. టొమోటో ముక్కల్ని జతచేసి పది నిమిషాలు వేయించాలి. వేగుతున్న టొమోటో మిశ్రమంలో దోసకాయ ముక్కల్ని వేసి కలియబెట్టాలి.
5. పదినిమిషాలు అలాగే వేగిన తరువాత ఉప్పు, కారం, ధనియాలపొడి వేసి కలిపి, మరో పది నిమిషాలు వేయించాలి. దోస ముక్కలు మెత్తబడ్డాక కొబ్బరిపొడి వేసి కలిపి దించేయాలి. చివర్లో కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే సరి. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి వడ్డిస్తే భలే రుచిగా ఉంటుంది.

Story first published: Thursday, August 16, 2012, 8:55 [IST]
Desktop Bottom Promotion