Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
టమోటో ఆనియన్ గ్రేవీ రిసిపి
టమోటో ఉల్లిపాయ గ్రేవీ రిసిపి చాలా సులభమైనటువంటి వంట. చాలా త్వరగా మరియు చాలా సింపుల్ గా తయారుచేయవచ్చు. ఈ సౌత్ ఇండియన్ స్పెషల్ టమోటో ఆనియన్ గ్రేవీ రిసిపి చపాతీ, పూరి, దోస, ఇడ్లీకి సైడ్ డిష్ గా చాలా గ్రేట్ గా ఉంటుంది.
టమోటో ఆనియన్ గ్రేవీ రిసిపి చాలా సింపుల్ గా తయారుచేయవచ్చు. ఈ రిసిపికి ప్రధానంగా బాగా పండిన టమోటోలు, మరియు ఉల్లిపాయ ఎక్కువగా అవసరం అవుతుంది . మరి ఈ సింపుల్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దామా...
కావల్సిన పదార్థాలు:
టమోటో: 8
ఉల్లిపాయలు: 4
కారం: 3tsp
పసుపు: 1/2tsp
ఆవాలు: 1tsp
కరివేపాకు: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: సరిపడా
నీళ్ళు సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
2. తర్వాత వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరేకు వేగించుకోవాలి.
3. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకూ వేగించుకొని, తర్వాత అందులో కారం, పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేయాలి.
4. రెండు నిముషాల తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న టమోటోముక్కలను కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసి, మూత పెట్టి మంటను పూర్తిగా తగ్గించి అరగంట సేపు ఉడికించుకోవాలి.
5. అరగంట తర్వాత మూత తీసి కొద్దిగా నీళ్ళు పోసి తిరిగి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే టమోటో ఆనియన్ గ్రేవీ రిసిపి రెడీ. ఇది చపాతి, పూరి, ఇడ్లీ, దోసలలకో బాగుటుంది. రైస్ కు సైడ్ డిష్ గా కూడా టేస్టీగా ఉంటుంది.



Click it and Unblock the Notifications