Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
టొమాటో : పుదీనా చట్నీ
చట్నీ లేదా పచ్చడి పాపులర్ ఇండియన్ సైడ్ డిష్. పచ్చడి లేని భోజనం... చేవచచ్చిన జీవితం. అంటుంటారు. ఎందకంటే మనిషన్నాక ఉప్పకారం తినాలి అంటారు అందుకు. ఉప్పు, కారం, పులుపు బాగా పట్టించి తయారు చేసే ఈ పచ్చళ్ళు రుచితో పాటు రంగు, వాసనలు కూడా అద్భుతంగా ఉంటాయి.
పచ్చళ్ళు రోటి, రైస్, చాట్స్, స్నాక్స్ వంటివాటికి చక్కటి కాంబినేషన్. అంతే కాదు... బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... దేనిలోనైనా సరే పచ్చడే విన్నర్. తెలుగువారు కోరుకునే పచ్చళ్లల్లో ముఖ్యమైనది కొత్తిమీర, పుదీనా, టమోటో పచ్చడి. కొత్తిమీర టమోటో లేదా పుదీనా టమోటో కాంబినేషన్లో చట్నీ చేస్తే చాలా రుచికంగా ఉంటుంది.ఈ రెండింటితో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం...
కావలసిన పదార్థాలు:
పుదీనా ఆకులు: 1/2cup
టొమాటోలు : 6(బాగా పండినవి/మీడియం సైజువి)
ఉల్లిపాయ తరుగు: 1/2cup
పుట్నాలపప్పు : 1/2cup
ఎండుమిర్చి : 6-8
ఇంగువ : 1/2tsp
నూనె : తగినంత
ఆవాలు : 1/2tsp
మినప్పప్పు : 1/2tsp
ఉప్పు : రుచికి తగినంత

తయారు చేయు విధానం :
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి, కాగాక ఆవాలు, మినప్పప్పు, ఇంగువ వేసి వేయించి, పక్కన ఉంచాలి
2. తర్వాత అదే పాన్ లో ఉల్లితరుగు వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి, ఎండుమిర్చి, టొమాటో ముక్కలు వేసి మెత్తబడేవరకు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
3. ఆ తర్వాత పుదీనా ఆకులు జత చేసి మూడు నిమిషాలు వాటితో పాటు ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి.
4. పుదీనా మెత్తబడ్డాక అందులో పుట్నాలపప్పు, ఉప్పు వేసి బాగా కలిపి క్రిందికి దించుకోవాలి.
5. ఈ మొత్తం మిశ్రమం చల్లారే వరకూ అలాగే ఉంచి, తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. (నీళ్ళు కలకపకుండా ఉంటే త్వరగా చెడిపోకుండా ఉంటుంది).



Click it and Unblock the Notifications