Latest Updates
-
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు!
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!
వీకెండ్ వచ్చిందంటే చాలు.. ముక్క లేనిదే చాలామందికి ముద్ద దిగదు. మార్కెట్ నుంచి చికెన్ తీసుకురాగానే రోటీన్ గా ఫ్రై, పులుసు, గ్రేవీ కర్రీ లేదా బిర్యానీ చేసేస్తుంటాం. ఇవి ఎంత ఇష్టమైనా.. ప్రతి వారం అవే రుచులు తింటే ఎవరికైనా బోర్ కొట్టడం ఖాయం.
ఈ వీకెండ్ లో మీ భోజనానికి మరింత స్పెషల్ కిక్ ఇచ్చేందుకు నార్త్ ఇండియాలో, ముఖ్యంగా ఢిల్లీ వీధుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న చికెన్ చంగేజీ ట్రై చేయండి. రొటీన్ చికెన్ కూరలకు భిన్నంగా కాస్త స్పైసీగా, క్రీమీగా ఉండే ఈ కర్రీని.. నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్ లేదా వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే ఆ మజాయే వేరు.
చికెన్ చంగేజీ తయారీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ - 1 కేజీ
పెరుగు - ఒక కప్పు
ఉల్లిపాయలు - 6
టమాటా ప్యూరీ - 2 కప్పులు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
కారం - 3 టీస్పూన్లు
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
జీలకర్ర పొడి - 2 టీస్పూన్లు
గరం మసాలా - 1 టీస్పూన్
పసుపు - 1 టీస్పూన్
నూనె - 6-7 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు పేస్ట్ - 6 టేబుల్ స్పూన్లు
ఫ్రెష్ క్రీమ్- 4 టేబుల్ స్పూన్లు
కసూరీ మేతి - 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - రెండు గుప్పెళ్లు
చికెన్ చంగేజీ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో శుభ్రం చేసిన చికెన్ ముక్కలను తీసుకోవాలి. అందులో పెరుగు, కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టించాలి. దీనిని కనీసం అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయిలో నూనె వేడి చేయాలి. నూనె కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీని వేసి బాగా కలపాలి. మూతపెట్టి నూనె పైకి తేలే వరకు రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
-ఆయిల్ సెపరేట్ అవుతున్న సమయంలో మ్యారినేట్ చేసుకున్న చికెన్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి తగినంత కారం వేసి కలిపి మూతపెట్టి మీడియం మంట మీద ఉడికించాలి.
-చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో జీడిపప్పు పేస్ట్, గ్రేవీకి తగినట్లుగా కొద్దిగా వేడి నీళ్లు పోసి కలపాలి. ఈ దశలో ఉప్పు సరిచూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి.
-గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు గరం మసాలా, రెండు చేతుల మధ్య నలిపిన కసూరీ మేతి, ఫ్రెష్ క్రీమ్ వేసి నెమ్మదిగా కలపాలి. మూతపెట్టి సన్నని మంటపై మరో రెండు మూడు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను చల్లుకోవాలి. అంతే ఘుమఘుమలాడే ఢిల్లీ స్పెషల్ చికెన్ చంగేజీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












