చలికాలంలో అందరూ తప్పక తినాల్సిన లడ్డు ఇదే..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా..

Posted By:

చలికాలం వచ్చిందంటే చాలు శరీరం బద్ధకంగా, త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా, రోజంతా ఉత్సాహంగా ఉంచుకోవడానికి ఖర్జూరం డ్రై ఫ్రూట్ లడ్డూలు బెస్ట్ ఆప్షన్. చక్కెర లేకుండా సహజ సిద్ధమైన తీపితో తయారయ్యే ఈ లడ్డూలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, అవసరమైన ఖనిజాలు శరీరానికి పుష్కలమైన పోషణను ఇస్తాయి. రోజూ ఒక్క లడ్డూ తింటే చాలు, నీరసం ఇట్టే మాయమై శరీరం ఫ్రెష్ గా మారుతుంది. ఇంట్లోనే ఎంతో సులభంగా ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు

గింజలు తీసిన మెత్తని ఖర్జూరాలు: 2 కప్పులు
సన్నగా తరిగిన బాదం: అర కప్పు
సన్నగా తరిగిన వాల్‌నట్స్: అర కప్పు
సన్నగా తరిగిన జీడిపప్పు, పిస్తా: అర కప్పు
గుమ్మడి లేదా పొద్దుతిరుగుడు గింజలు: 2 టేబుల్ స్పూన్లు
తెల్ల నువ్వులు లేదా గసగసాలు: 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి: 1 టేబుల్ స్పూన్
యాలకుల పొడి: అర టీస్పూన్

Winter Special Dates Dry Fruit Laddoo Recipe in Telugu Sugar Free Healthy Laddu

తయారీ విధానం

-ముందుగా ఒక బాండీలో కొద్దిగా నెయ్యి వేడి చేసి, సన్నగా తరిగిన బాదం, వాల్‌ నట్స్, జీడిపప్పు, పిస్తా, గుమ్మడికాయ లేదా పొద్దుతిరుగుడు గింజలను తక్కువ మంట మీద 2-3 నిమిషాల పాటు దోరగా వేయించండి. అలాగే నువ్వులు లేదా గసగసాలను విడిగా తేలికగా వేయించి ఒక ప్లేట్‌ లోకి తీసుకోండి.

-తర్వాత, గింజలు తీసిన ఖర్జూరాలను మిక్సర్‌ లో కచ్చాపచ్చాగా రుబ్బుకోండి లేదా కత్తితో సన్నగా తరిగి సిద్ధంగా ఉంచుకోండి.

-ఇప్పుడు అదే బాండీలో మిగిలిన నెయ్యి వేసి, ఖర్జూరాలను తక్కువ మంటపై 2-3 నిమిషాలు మెత్తగా,మెరిసేలా అయ్యే వరకు వేయించండి. మంటను ఆపివేసి లేదా చాలా సన్నని మంటపై ఉంచి, ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్, గింజలు, మంచి సువాసన కోసం యాలకుల పొడిని వేసి అన్నీ కలిసేలా బాగా కలపండి.

-తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా గోరువెచ్చగా అవ్వనిచ్చి, అరచేతులకు కొంచెం నెయ్యి రాసుకుని, మీకు కావలసిన పరిమాణంలో గుండ్రని లడ్డూలుగా ఒత్తుకోండి. వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే శీతాకాలమంతా ఆస్వాదించవచ్చు.

ఆరోగ్యం, రుచి కలగలిసిన చలికాలం స్పెషల్..బీట్‌ రూట్ లడ్డూ ఇలా ఈజీగా చేసేయండి!

శీతాకాలంలో ఈ లడ్డు ఎందుకు ప్రత్యేకం?

శరీరానికి వెచ్చదనం: ఖర్జూరాలు, బాదం, వాల్‌ నట్స్, నువ్వులలో సహజంగానే వేడిని కలిగించే గుణం ఉంటుంది. ఇవి చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచి చలి నుండి రక్షిస్తాయి.

తక్షణ, దీర్ఘకాలిక శక్తి: ఖర్జూరంలో ఉండే సహజ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ తక్షణ శక్తిని అందిస్తాయి. అదే సమయంలో డ్రై ఫ్రూట్స్‌లోని ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు రోజంతా అలసట రాకుండా దీర్ఘకాలిక బలాన్ని ఇస్తాయి.

[ of 5 - Users]
Story first published: Saturday, November 28, 2026, 9:58 [IST]
Desktop Bottom Promotion