Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
తీపి తినాలనిపిస్తోందా? కానీ బరువు పెరుగుతామనో, ఆరోగ్యం పాడవుతుందనే భయమో మిమ్మల్ని వేధిస్తోందా? అయితే మీకోసం ఒక అద్భుతమైన స్వీట్ రెసిపీ చనా-బెల్లం చిక్కి. ఇది కేవలం రుచికరమైన స్వీట్ మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ పవర్ హౌస్ అని చెప్పవచ్చు.
బజార్లో దొరికే చక్కెర, ప్రిజర్వేటివ్స్ నిండిన స్వీట్లకు బదులుగా, ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకోగలిగే ఈ న్యాచురల్ ప్రోటీన్ బార్ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలైనా, పెద్దలైనా ఇష్టంగా తినే ఈ అద్భుతమైన చిక్కిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
వేయించిన శనగలు (పుట్నాలు): 1 కప్పు
దంచిన బెల్లం: 1 కప్పు
నెయ్యి: కొద్దిగా
నువ్వులు: కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా వేయించిన శనగలపై ఉండే పొట్టును పూర్తిగా తీసేసి, శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఒక అడుగు మందంగా ఉన్న పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయండి.
-నెయ్యి కరిగాక, మంటను పూర్తిగా సిమ్ లో ఉంచి, అందులో ముందుగా మెత్తగా పొడి చేసి పెట్టుకున్న బెల్లం వేయండి. బెల్లం నెమ్మదిగా కరుగుతూ పాకంలా మారుతుంది. బెల్లం పూర్తిగా కరిగి, చిన్నచిన్న బుడగలు రావడం మొదలవ్వగానే అందులో కొద్దిగా నువ్వులు చల్లండి. ఈ నువ్వులు చిక్కికి మంచి క్రంచీ టేస్ట్ ను ఇస్తాయి.
-ఇప్పుడు ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న శనగలను కరుగుతున్న బెల్లంలో వేసి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా గరిటెతో వేగంగా కలపండి. బెల్లాన్ని మరీ ఎక్కువగా ఉడికించకండి. అలా చేస్తే చిక్కి బాగా గట్టిపడిపోయి పంటికి కొరకడానికి కష్టంగా మారుతుంది. అంతా బాగా కలిసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి.
-ఆ మిశ్రమాన్ని బట్టర్ పేపర్ పైన గానీ, లేదా నెయ్యి రాసిన ప్లేట్‌పైన గానీ వేసి పలచగా అద్దుకోవాలి. చపాతీ కర్రకు కాస్త నెయ్యి రాసి పామితే చిక్కి సమానంగా వస్తుంది.
-ఒక 5 నుండి 7 నిమిషాల పాటు దానిని అలాగే గాలికి వదిలేయండి. అంతే నిమిషాల్లోనే కరకరలాడే, నోరూరించే ప్రోటీన్ చిక్కి గట్టిపడుతుంది. దాన్ని మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోండి.
-ఇది మీ పిల్లల స్నాక్ బాక్స్ లో పెట్టి పంపితే ఇష్టంగా తినడమే కాదు, రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు..
ఈ చిక్కి ఎందుకు తినాలి?
ఈ చిక్కిలో వాడిన శనగలు శరీరానికి కావాల్సిన పుష్కలమైన
ప్రోటీన్ ను అందిస్తాయి. కండరాల పుష్టికి, అలసట తగ్గడానికి
ఇది ఎంతో మంచిది. ఇక బెల్లంలో ఐరన్ ఉంటుంది, ఇది రక్తహీనతను
దరిచేరనివ్వదు. నువ్వులు, నెయ్యి వల్ల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా
చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
