Latest Updates
-
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే..
పర్యావరణ ప్రేమి మానెకా గాంధీ!

1977 లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పొందినపుడు ఆమె వ్యవస్ధాపక ఎడిటర్ గా సూర్య అనే రాజకీయ మాసవారీ వార్తా పత్రిక నడిపింది. తన పత్రికలో భర్త సంజయ్ గాంధీ, అత్తమ్మ ఇందిరా గాంధీల రాజకీయప్రయోజనాలకు తీవ్ర కృషి చేసింది. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె కోర్టులలో సైతం వ్యక్తిగత హక్కులకు పోరాడింది. ఈమె సహాయ సహకారాలతో సంజయ్ గాంధీ కాంగ్రెస్ ను సుమారు మూడు సంవత్సరాల కాలంలో మరోమారు అధికారానికి తెచ్చాడు. వీరికి కలిగిన బిడ్డకు ఫిరోజ్ అని నామకరణం చేశారు. ఇందిరా గాంధీ ఆ పేరుకు వరుణ్ అనే పేరు కలిపింది. మానెకకు 23 వ ఏట ఆమె కుమారుడుకు 100 రోజుల వయసు వున్నపుడే సంజయ్ గాంధీ ఒక విమాన దుర్ఘటనలో మరణించాడు.
మానెకా గాంధీ పర్యావరణ ప్రేమి. జంతువుల హక్కులగురించి పోరాడేది. 1995 వ సంవత్సరంలో ఆమె యానిమల్స్ ఎక్స్ పెరిమెంట్స్, సూపర్ విజన్ అండ్ కంట్రోల్ అనే కమిటీకి ఛైర్ వుమన్ గా నియామకం పొందింది. పీపుల్ ఫర్ యానిమల్స్ అనే సంస్ధను ఆమె 1992 లో నెలకొల్పింది. భారత దేశంలోని జంతువుల హక్కులు సంక్షేమం కొరకు ఈ సంస్ద చట్టపరంగా అనేక పోరాటాలు సాగించింది. మానెకా జంతువుల సంబంధంగా టెలివిజన్ ఛానెల్ లో కొన్ని కార్యక్రమాలను సైతం నిర్వహించి దేశంలోని ప్రజలకు జంతువుల రక్షణ సమాచారం పట్ల ఆసక్తి కల్పించింది. ఆమె శాఖాహారి. శాఖాహార జీవన విధానాలను బలపరచింది. జంతువుల రక్షణపై ఆమె కొన్ని రచనలు చేసింది.
ఆమె ఒక జర్నలిస్టుగా ఎన్నో సాహస కార్యాలకు ఒడిగట్టింది. అప్పటి ప్రభుత్వ అరాచకాలను తన పత్రిక ద్వారా బయటపెట్టింది. 1983 లో రాష్ట్రీయ సంజయ్ మంచ్ అనే రాజకీయ పార్టీని పెట్టి యువకుల సాధికారత, ఉద్యోగాలకు పాటుపడింది. 1984 లో ఎన్నికల ప్రచారం పూర్తి స్ధాయిలో వుండగా తన అత్తమ్మ ఇందిరాగాంధీ స్వంత బాడీ గార్డుల దురాగతాలకు బలైపోవడంతో ఆ సంఘటనను తీవ్రంగా ఖండించింది.
తదనంతర పరిస్ధితులలో ఎన్నికలలో ఓటమి పాలైన ఆమె తన రాష్ట్రీయ సంజయ్ మంచ్ పార్టీని ప్రతిపక్ష పార్టీ జనత దళ్ లో కలిపేసి దానికి జనరల్ సెక్రటరీగా పదవి చేపట్టింది. పార్టీ సార్వత్రిక ఎన్నికలలో విజయం పొందటంతో మానెకా గాంధీ అతి చిన్న వయసులోనే మంత్రిగా అధికారాన్ని చేపట్టింది.
ఆమె వరుసగా పాలనకు వచ్చిన రెండు ప్రభుత్వాలలో పర్యావరణ మరియు అడవుల మంత్రిగా పదవి నిర్వహించింది. ఈ శాఖకు సంబంధించి అనేక చారిత్రాత్మక మార్పులు చేర్పులు చట్టపరంగా చేసింది. 2004 సంవత్సరంలో 14వ లోక్ సభకు (5వ పదవీకాలం) మెంబర్, కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖకు నియామకం చేయబడింది. 2009 లో అనోలా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యురాలుగా పదవి చేపట్టింది.



Click it and Unblock the Notifications
