Latest Updates
-
అన్నమయ్య ఆలయంలో నేటికీ జరిగే అద్భుత సంఘటన కళ్ళతో చూసినవారు చెప్పిన కథ -
మిథున సంక్రాంతి: సూర్యుడి రాశి మార్పుతో ఈ రాశుల వారికి అదృష్టం, కెరీర్లో భారీ మార్పులు! -
మిథునం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 15 జూన్ 2026 -
మీ బంధం కలకాలం నిలవాలంటే... ఒకరినొకరు ఈ 5 మాటలు ఎన్నటికీ అనుకోకండి! -
నిద్ర అంటే రెస్ట్ కాదు..నిద్ర గురించి 90 శాతం మందికి తెలియని నిజాలివే! -
మీది స్ట్రాంగ్ మైండ్ సెట్టా? లేక ఇన్సెక్యూర్ మైండా? ఇలా టెస్ట్ చేసుకోండి -
రాత్రి పూట ఈ పనులు చేస్తే అశుభం -
నోట్లో వేసుకోగానే కరిగిపోయే అరటిపండు మాల్పువా.. ఈ సీక్రెట్ తో చేస్తే రుచి అద్భుతం! -
వర్షాకాలంలో బట్టలు ఆరట్లేదా? ఈ చిన్న ట్రిక్స్ ట్రై చేయండి! -
బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే.. రుచి అదుర్స్!
ఇంటిలోనే తయారయ్యే టీనేజ్ నేరస్తులు!

టీనేజ్ పిల్లలు వారు చేసే నేరాలకు ప్రణాళిక వేయటం, ఆ మేరకు నేరాలు తమ స్వంత కుటుంబ సభ్యులపై చేయటం తరచుగా జరిగిపోతోంది. ఇటువంటి సంఘటనలు అనేకం దినపత్రికలలో వస్తున్నాయి. వీరు తమ ఇంటిలో విద్యావంతులైన టీనేజర్లు కావచ్చు. మంచి స్కూల్ కు వెళ్ళి చదువుతూండవచ్చు, రోజువారీ పాకెట్ మని పొందుతూండవచ్చు లేదా చెడు స్నేహాలుకల టీనేజ్ ఫ్యాక్టరీ కార్మికుడు లేదా ఉద్యోగి కావచ్చు. 2011 సెప్టెంబర్ లో ముంబైలోని ఒక మంచి స్కూలులో ఒక విద్యార్ధి తన స్నేహితుడితో కలసి అతని నాయనమ్మను చంపేందుకు ఏ రుజువులు దొరకని విధంగా ఒక హత్యా ప్రణాళిక వేశాడు. పోలీసులను కూడా తప్పుదోవ పట్టించాడు. అది ఒక బందిపోటు దొంగతనంగా చిత్రీకరించాడు. మరో సంఘటనలో ఏప్రిల్, 2012 లో 16 సంవత్సరాల వయసున్న పిల్లవాడు, తన మేనత్తను కత్తెరతో గొంతి కోసి చంపాడు.
నేరపూరిత ప్రవర్తనకల పిల్లలు ఇంటిలో రూ. 50 నుండి ఒక కారు కొనటం వరకు కూడా సొమ్ము దొంగిలించి కుటుంబ సభ్యులను చంపటానికి సైతం వెనుకాడటం లేదు. మన దేశంలో కుటుంబ వ్యవస్ధకు వున్నంత విలువ మరే దేశంలోను లేదు. కాని నేడు ఆధునికంగా ఈ వయసు వారు నేరస్తులుగా తయారవుతున్నట్లు నేటి రోజులలోనే మనం చూస్తున్నాము. పది సంవత్సరాల వయసుకల పిల్లలు సైతం నేరాలు చేస్తున్నారు.
ఏప్రిల్ 26, 2012 - ఫాహీం ఖురేషి అనే టీనేజ్ పిల్లవాడు తన 46 ఏల్ళ తల్లిని ఒక మెటల్ పాత్రతో మోది చంపేసినట్లు అతనిని పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా వార్త వచ్చింది. అతను తన తల్లిని ఆల్కహాల్ కొనుగోలుకు సొమ్ము కోరటం ఆమె తిరస్కరించటంతో ఆమెను పాత్రతో మోది చంపేశాడు.
ఏప్రిల్ 23, 2012 నాడు ఒక పిల్లవాడు తన మేనత్తనుమరియు ఇద్దరు మహిళలను ఒక కత్తెరతో చంపాడు. దానికి కారణం అతను దొంగతనం చేసినట్లు ఆమె అతని తల్లికి తెలుపటం నేరంగా అతను భావించాడు.
సెప్టెంబర్ 16 2011 నాడు ఒక టీనేజర్ తనబాల్య స్నేహితుడితో కలసి, తన 68 సంవత్సరాల వయసున్న గ్రాండ్ మదర్ ను చంపి, బంగారు ఆభరణాలు, విదేశీ కరెన్సీ షుమారు రూ.5.14 లక్షలతో పరారైనట్లు విన్నాము.
ఈ రకంగా నేడు సమాజంలో టీనేజ్ నేరస్తుల సంఖ్య పెరిగిపోతోంది. వీరు బయటివారిపై కూడా కాకుండా, తమ స్వంత కుటుంబ సభ్యులపై నేరాలు చేసి పారిపోవటం లేదా అరెస్టులు కావటం జరిగిపోతోంది. దానికి కారణం వారి సహజ ప్రవర్తనా ? లేక, తల్లి తండ్రులనుండి వారికి సరైన ఆదరణ లభించకా? వారి ఆశలు, ఆశయాలు తీరకా? సరైన పెంపకం లేకపోవటం వలనా అనే కారణాలు ఎన్నో కనపడుతున్నాయి. నేటి సమాజంలో మనదేశంలో పిల్లల ఈ పోకడకు ప్రధానంగా వారు చూస్తున్న టి.వి. ఛానెళ్ళు, సినిమాల ప్రభావం కారణంగా చెప్పవచ్చు.
పరిస్ధితి మారాలి? పెద్దలు, తమ పిల్లల పట్ల అధికమైన ఆదరణ కలిగి, వారిని సత్ప్రవర్తనలో పెరిగేలా చేయాలి. వీలైనంతవరకు టి.వి.లను, ఇతర సాధనాలను వారికి అందుబాటులో లేకుండా చేయాలి. క్రమశిక్షణ కలిగించాలి. నేడు ఆధునికంగా వస్తున్న ఎలక్ట్రానిక్ పరికరాలను పిల్లల అభివృధ్ధి కొరకు ఉపయోగించాలి. పెరిగే పిల్లలకు కుటుంబ విలువలు నేర్పించి వారు కుటుంబంలో మంచి సంబంధాలు కలిగేలా నేర్పించాలి. కుటుంబంలో మంచి సంబంధాలు కలిగిన టీనేజ్ యువకుడు, సమాజంలో ఇతరులతో కూడా మంచి సంబంధం కలిగి సరైన విలువలు కలిగి వుంటాడు.



Click it and Unblock the Notifications