Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
మంచి భాగస్వామికి ఉండవలసిన 7 మంచి లక్షణాలు
భాగస్వామి ని ఎంచుకునేటప్పుడు చాలా మంది చేసే తప్పు వారి బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూడటం. వారి అంతర్సౌందర్యాన్ని అంచనా వెయ్యలేకపోవడం ఎక్కువ మంది చేసే పొరపాటు.
ఒక వ్యక్తిని అంచనా వెయ్యడానికి బాహ్య సౌందర్యం తో పాటు అంతర్సౌందర్యం కూడా చూడాలి. ఈ కింద చెప్పబడిన పద్దతుల ద్వారా ఒక వ్యక్తి యొక్క లక్షణాలు తెలుసుకోవచ్చు.
మంచి భాగస్వామి కి ఉండవలసిన ఏడు లక్షణాలు

మిమ్మల్ని మీ లాగే అంగీకరిస్తారు
మిమ్మల్ని మీ లాగే అంగీకరించడం మంచి భాగస్వామి కి ఉండవలసిన ముఖ్య లక్షణం. ఎందుకంటే కోంత మంది అంతా సవ్యంగా ఉన్నప్పుడే భాగస్వామి ని ఇష్టపడతారు. మీలో ఉన్న అన్ని కోణాలని ఇష్టపడే వారే మంచి భాగస్వామి. మీ లో ఉన్న బలహీనతలను కూడా ఇష్టపడాలి.

మాట నిలబెట్టుకుంటారు
తన భాగస్వామి యొక్క అవసరాలను అర్ధం చేసుకుంటారు. వినయం, విధేయత, గౌరవం వంటి వాటితో భాగస్వామి ని ఆకర్షిస్తారు. క్లిష్ట పరిస్తితులను తప్పించుకోవాలనుకోకుండా వాటిని కూడా జాగ్రత్తగా డీల్ చెయ్యగలుగుతారు. ఒక వేళ తన మాటను నిలబెట్టుకోలేకపోతే అందుకు తగిన కారణాలను వివరిస్తారు.

మద్దతునిస్తారు
భాగస్వామి యొక్క వ్యక్తిగత ఉన్నతి ముఖ్యమైనది గా గుర్తించి అందుకు తగిన మద్దతునివ్వడం మంచి భాగస్వామి యొక్క ముఖ్య లక్షణం. తన భాగస్వామి యొక్క విజయం కోసమే అహర్నిశలు ప్రయత్నిస్తారు. అన్నిరకాల పరిస్థితుల లో ను ధైర్యాన్ని నూరిపోసి అండగా ఉంటారు. ఎదుగుదలకు తగిన ప్రోత్సాహం అందిస్తారు.

ప్రేమ ని వ్యక్తపరుస్తారు
ప్రేమ ని వ్యక్తపరచడానికి మంచి భాగస్వామికి ప్రత్యేకించి ఒక సందర్భం లేక సమయం అవసరం లేదు. సహజంగా తన ప్రేమను వ్యక్తం చేస్తారు. తమ భాగస్వామే తమ కు లోకం అనేలా ప్రవర్తిస్తారు. వేరే అందగత్తెలు లేదా అందగాళ్ళు తన దృష్టిని ఆకర్షించినా తమ మనసు నిండా భాగస్వామి నే నింపుకుని ఉంటారు.

మంచి భాగస్వామికి ఉండవలసిన 7 లక్షణాలు
నిజమైన భాగస్వామి తమతోతే మీరు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకోరు. అటువంటి పనులు చెయ్యరు. మీ ఆనందమే వారి ఆనందంగా భావిస్తారు.

మంచి భాగస్వామికి ఉండవలసిన 7 లక్షణాలు
తప్పులని ఒప్పుకుంటారు - మంచి భాగస్వామి తను చేసిన తప్పులను ఒప్పుకుంటారు. పరిస్థితుల పై తొయ్యకుండా చేసిన తప్పులు ఒప్పుకుంటారు. ఒక వేళ, మీ భాగస్వామి ప్రతి సారి తమ తప్పులు మీ పై తోసే వారు అయితే మీరు వారిని మార్చే ప్రయత్నం చెయ్యాలి.

ఎల్లప్పుడూ మీ కోసం వారి వద్ద సమయం ఉంటుంది
మీ కోసం ఎంత బిజీ గా ఉన్న సమయం కేటాయించడానికి సిద్దం గా ఉంటారు. మంచి భాగస్వామి యొక్క ముఖ్య లక్షణం "సారి, నేను కొంచెం బిజీ గా ఉన్నాను" అనే మాటలు చెప్పరు. ఎందుకంటే, మీతో ఉండాలి అనుకుంటే సప్తసముద్రాలు దాటాదనికైన ఖండాంతరాలు వెళ్లడానికైనా సిద్దం గా ఉండాలి. ఇది నిజం.



Click it and Unblock the Notifications
