Latest Updates
-
బరువు తగ్గించి, రక్తాన్ని పెంచే పనస గింజల లడ్డూ.. ఈ స్వీట్ తింటే ఎముకలు దృఢంగా, కంటిచూపు మెరుగ్గా! -
వందల రోగాలను నయం చేసే మునగాకుతో టేస్టీ పూరీ..ఎలా చేసుకోవాలంటే.. -
దోశ, రైస్, చపాతీలోకి కిర్రాక్ అనిపించే చికెన్ చాప్స్..ఈ ఆదివారం స్పెషల్ గా మారిపోతుంది -
టిఫిన్స్ లోకి ఈ వెల్లుల్లి చట్నీ చేస్తే..రోజూ తినేదాని కన్నా ఎక్కువ తినేస్తారు! -
ఆదివాసీ ఫిష్ ఫ్రై..గారెల్లా కరకరలాడుతూ భలే రుచిగా -
అయ్యయ్యో పాపం తాత..75 ఏళ్ల వ్యక్తితో 30 ఏళ్ల యువతి పెళ్లి వ్యవహారంలో భారీ ట్విస్ట్..వీడియో చూడండి -
చపాతీ, పూరీల్లోకి అదిరిపోయే శరవణ భవన్ స్టైల్ క్యాలీఫ్లవర్ కుర్మా..ఈజీగా చేసుకోండిలా.. -
అమృతం రుచిని తలపించేలా వంకాయ పచ్చడి..ఇలా చేస్తే 2 నెలలు నిల్వ -
ఆడవారిలో రక్తం బాగా పెరగాలంటే..తరచూ వీటిని తినండి -
నోట్లో పెట్టుకుంటే జారిపోయే పచ్చికొబ్బరి హల్వా..చక్కెర లేకుండానే 10 నిమిషాల్లోనే చేసుకోండిలా..
శృంగారంతో బహు ఆరోగ్య ప్రయోజనాలు..!
చాలామంది జంటలు వివాహమైన కొత్తల్లో మినహా మిగిలిన రోజుల్లో శృంగారంలో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల అనేక లాభాలు ఉంటాయని సెక్స్ నిపుణులతో పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా.. ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనేందుకు కూడా 7 రకాల ఉపయోగాలు ఉంటాయని పేర్కొంటున్నారు.
శృంగారం మీ భాగస్వామిని దగ్గర చేసి, మీకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా, ఇది కింద తెల్పిన కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిఉంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది
శృంగారం అధిక ఒత్తిడిని తగ్గించి మన భావోద్వేగ, మానసిక ఆరోగ్యం మధ్య సమతుల్యాన్ని సృష్టించడానికి దోహదపడుతుంది. శృంగారం తరువాత, మెదడు విడుదలచేసే ఎండార్ఫిన్లు ఒత్తిడిని తగ్గి౦చి, ఒక వ్యక్తిలో ఆనందపు స్థితిని కలిగిస్తాయి.

రోగనిరోధక వ్యవస్థను అభివృద్ది పరుస్తుంది
ప్రతిరోజూ ప్రేమను పొందడం వల్ల, మన శరీరంలో రసాయనలపై పోరాడే వైరస్ లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఇటీవలి పరిశోధనలో రోజువారీ శృంగారం వల్ల వ్యాధికి వ్యతిరేకంగా రక్షించబడే ప్రతిరోధకాలను అధికస్తాయిలో నిర్వహిస్తుంది.

నిద్రని మెరుగుపరుస్తుంది
మీరు నిద్రలేమితో బాధపడుతున్నపుడు, మీరు పడుకునే ముందు శృంగారానికి ప్రయత్నిస్తే అది మీ నిద్రను ప్రేరేపిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది
శృంగారం చెయ్యని వారితో పోలిస్తే, వారానికి రెండుసార్ల కంటే ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనే పురుషులలో గుండె జబ్బులు తక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇటీవలి అధ్యయనాల ద్వారా తెలిసింది.

హార్మోన్ల స్థాయిని సమతౌల్యం చేస్తుంది
మీ ఋతు చక్రంలో సమస్యలు ఉన్నాయా? ఉంటే, మీ భాగస్వామితో ప్రేమను పంచుకోండి, ఇది మీ ఋతు క్రమ చక్రాన్ని నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది, శృంగారం సమతౌల్య హార్మోన్లను నియంత్రించడానికి సహాయపడి, తిమ్మిరులను కూడా తగ్గిస్తుంది.

కటి కండరాలను శక్తివంతం చేస్తుంది
శృంగారం అనేక కండరాలకు ఉపయోగంగా ఉంటుంది; అయితే, ఇది కటి కండరాల గట్టితనం పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. శృంగారం మీ చట్రము, హృదయము, వీపు పైభాగం బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

అందంగా కనిపిస్తారు
శృంగారం ఆడవాళ్లకు ఒక అందమైన చికిత్స, ఇంటర్ కోర్స్ చేసినపుడు ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగి, జుట్టు కాంతివంతంగా, చర్మం మృదువుగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications
