ఏడడుగుల బంధాన్ని ఏడేళ్లలో ముగించింది.. అయితే కొడుకు ఎదుటే రెండోపెళ్లి చేసుకుందీ స్టార్ హీరో కూతురు..

తొలిసారి వివాహం అనంతరం విడాకులు తీసుకున్నాక రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట. విడాకుల గురించి ఇలా చెప్పింది.

భారతదేశంలోని సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురెవరో చాలా మందికి బాగానే తెలుసు. ఆమె ఎవరో కాదు సౌందర్య రజనీకాంత్. ఈ అమ్మడు రజనీకాంత్ కూతురుగానే కాదు. ఇంకా ఎన్ని మల్టీ టాలెంట్స్ ఉన్న లేడీ. గ్రాఫిక్ డిజైనర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా మంచి ప్రతిభను కనబరించింది.

Soundarya Rajanikanth

రజనీకాంత్ కూతురు అన్న పేరుకంటే సొంతంగానే పేరు తెచ్చుకోవడంలో వంద శాతం సఫలమయ్యిందనే చెప్పాలి. అయితే రజనీకాంత్ కూతురు తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా పెళ్లి విషయంలో వివాదస్పదమైన నిర్ణయాలు తీసుకుంది.

Soundarya Rajanikanth

రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు అని నిరూపించే ప్రయత్నం చేసింది. ఇటీవలే తన రెండో పెళ్లి వివాహ వార్షికోత్సవాన్ని సైతం విదేశాలలో జరుపుకుంది. అందుకు సంబంధించిన చిత్రాలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Soundarya Rajanikanth

అంతేకాదు తన వ్యక్తిగత జీవిత విషయాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా సౌందర్య రజనీ కాంత్ రెండో పెళ్లి గురించి ఏయే విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకుందో ఈ స్టోరీలో చూడండి...

ఏడడుగుల బంధానికి..

ఏడడుగుల బంధానికి..

సౌందర్య రజనీకాంత్, అశ్విన్ రామ్ కుమార్ తో కలిసి 2010 సంవత్సరంలో ఏడడుగులు వేసి.. మూడు ముళ్లు వేసుకుంది. అయితే ఏడేళ్ల తర్వాత అంటే 2017లో తన వివాహ బంధానికి ముగింపు పలికింది. దీంతో అందరినీ షాక్ కు గురి చేసింది.

విడాకుల తర్వాత..

విడాకుల తర్వాత..

అయితే తొలిసారి వివాహం అనంతరం విడాకులు తీసుకున్నాక రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట. విడాకుల గురించి ఇలా చెప్పింది. ‘తన జీవితంలో విడాకులు అనేవి సంతోషానికి స్వస్తి పలికే అవకాశమే లేదని, మొదటి వివాహంలో తనకు ప్రిన్స్ దొరకపోతేనేం.. మరోసారి తప్పక దొరుకుతాడు‘‘ అని చెప్పింది.

రెండోసారి వివాహం..

రెండోసారి వివాహం..

అందుకే రెండోసారి కూడా వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుందట. అంతేకాదు రెండోసారి నటుడు, ఫార్మా కంపెనీ యజమాని అయిన విశాగన్ వనంగమూడిని నిర్ణయం తీసేసుకుందట. అదీ కూడా అందరికీ తెలిసేలా ఘనంగా జరుపుకోవాలని ఆలోచించిదంట. ఇలా రెండో పెళ్లి చేసుకోవడం అసలు తప్పు కాదు అని భావించిందట.

రెండో భర్త గురించి..

రెండో భర్త గురించి..

తన భర్త రెండో భర్త విశాగన్ మంచితనం గురించి ఓ ఇంటర్వ్యూలో ఎంతో చక్కగా వివరించింది సౌందర్య రజనీకాంత్. అంతేకాదు తన కుమారుడు వేద్ తో విశాగన్ కు ఉన్న బంధం గురించి చెప్పింది రజనీ కూతురు.

కొడుకు అనుమతి..

కొడుకు అనుమతి..

తన రెండో పెళ్లికి సంబంధించి తన కుమారుడు వేద్ అనుమతి కూడా తీసుకుందట సౌందర్య రజనీకాంత్. ‘తనను చూడగానే వేద్ చాలా ఇష్టపడ్డాడు. విశాగన్ తో మాట్లాడిన తర్వాత వారిద్దరూ నాకంటే బాాగా కలిసిపోయారు. ఆయన వేద్ తో చాలా సన్నిహితంగా, ప్రశాంతంగా ఉంటారు‘ అని చెప్పుకొచ్చింది సౌందర్య.

విశాగన్ దగ్గరే ఫ్రీగా..

విశాగన్ దగ్గరే ఫ్రీగా..

'తన కుమారుడు తన వద్ద ఉండటం కంటే విశాగన్ దగ్గర ఉండేందుకు ఎక్కువ కంఫార్ట్ గా ఫీలవుతాడంట. ఒక అమ్మగా తనకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది? అంతేకాదు.. విశాగన్ నన్ను పెళ్లి చేసుకోవడానికి వేద్ అనుమతి కూడా అడిగాడు. నేను మీ మమ్మీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. నీకు నేను నాన్నగా ఓకేనా? అని అడిగాడు. ఇలా అడిగినప్పుడు నేను వీడియో కూడా తీశాను. ఆ వీడియోను వేద్ పెద్దయ్యాక చూపించాలనుకుంటున్నా‘‘ అంటూ నవ్వుతూ చెప్పింది.

ఆ పెళ్లిలో అందరికీ టెన్షన్..

ఆ పెళ్లిలో అందరికీ టెన్షన్..

అంతేకాదు.. తమ పెళ్లి సమయంలో అందరూ ఓ విషయం గురించి ఆందోళన చెందారట. అదేంటంటే..‘‘ మా పెళ్లికి సమయానికి మేమంతా ముహుర్తం సమయానికి మండపానికి వెళ్లిపోయాం. కానీ నా కుమారుడు వేద్ రావడం ఆలస్యమైంది. అయితే విశాగన్ మాత్రం ముహుర్తంతో సంబంధం లేకుండా వేద్ వచ్చేంతవరకూ వేచి చూశాడు. తను వచ్చే వరకూ తాళి కట్టను అని చెప్పేశాడు‘‘. దీంతో అందరూ కాసేపు ఆందోళన పడినట్లు చెప్పింది సౌందర్య.

ఎవ్వరి మాట వినలేదు..

ఎవ్వరి మాట వినలేదు..

‘ఆ సమయంలో తన మెడలో తాళి కట్టమని ఎంతమంది బలవంతం చేసినా ఎవ్వరి మాట వినలేదు. అప్పుడు నా వైపు తిరిగి ముహుర్తం ఉణ్నా లేకపోయినా నేను నీ మెడలో తాళిక కడతాను. కాకపోతే వేద్ వచ్చిన తర్వాతే‘‘ అని చెప్పాడు. వేద్ ఈ వేడుకను చూసి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలని మేమంతా కోరుకున్నాం అని తెలిపింది. అయితే లక్కీగా మేము అనుకున్నట్టుగానే అదే జరిగింది.

చాలా క్లోజ్ గా ఉంటాడు..

చాలా క్లోజ్ గా ఉంటాడు..

తన రెండో భర్త విశాగన్ గురించి సౌందర్య ఇంకా ఈ విషయాలను చెప్పింది. ‘‘నేను తనని తొలిసారి కలుసుకున్నప్పుడు తను చాలా సైలెంట్ గా ఉన్నాడు. అందుకే అతనితో కలుసుకోవడం నాకు చాలా సులభమైంది. అంతేకాదు తను నాతో చాలా క్లోజ్ గా ఉంటాడు‘ అని చెప్పింది.

నాలో ఆనందం..

నాలో ఆనందం..

‘వేద్ విశాగన్ ను నాన్నా అని పిలుస్తున్నడు నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అంతేకాదు ఒక రెస్పాన్సుబుల్ ఫీలింగ్ కూడా వస్తుందని‘‘ చెప్పింది.

ఇదే నెలలో..

ఇదే నెలలో..

సౌందర్య రజనీకాంత్ మొదటి వివాహం ఇదే నెలలో జరిగింది. అశ్విన్, సౌందర్యకు పుట్టిన బిడ్డే వేద్ క్రిష్ణ. వీరిద్దరూ మనస్పర్దలు రావడంతో 2017లో విడిపోయారు.

విదేశాలో వివాహ వార్షికోత్సం..

విదేశాలో వివాహ వార్షికోత్సం..

అయితే రెండో పెళ్లి చేసుకుని ఏడాది పూర్తయిన సందర్భంగా.. వివాహ వార్షికోత్సవం కోసం విదేశాలకు వెళ్లింది సౌందర్య రజనీకాంత్. తన భర్త విశాగన్ తో కలిసి ప్యారిస్ లో దిగిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

All Images Credit to Twitter/Soundarya RajaniKant

Desktop Bottom Promotion