Latest Updates
-
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
క్రంచీ, టేస్టీ జీడిపప్పు పకోడి..మస్త్ కిక్కిచ్చే స్నాక్ ఈజీగా చేసుకోండిలా.. -
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ ! -
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ -
వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే! -
తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి -
భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ..స్వర్గానికి బెత్తెడే దూరం! -
పండుగ రోజే దారుణం..భర్త డోర్ ఓపెన్ చేయగానే ప్రియుడితో సరసాలాడుతూ భార్య..రెండ్ హ్యాండెడ్ గా దొరకడంతో..
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.?
మొదటి సంతానం అందేవరకు భార్యాభర్తలకు ప్రైవసీ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వారికంటూ ఏకాంత సమయం ఉంటుంది. ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. కానీ ఆ తర్వాత ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు తదుపరి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం సవాలుగా ఉంటుంది. ఈ క్రమంలో మరో సంతానం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దంపతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వైద్య నిపుణుల సలహాలు చూద్దాం..

చిన్న పిల్లలు సమాజంలో ఎలా ఉంటున్నారనేది డిసైడ్ చేసేది ముందు వారి ఇంటి పరిస్థితులు, వాతావరణమే. అందుకే పిల్లల ముందు తల్లిదండ్రులు మాట్లాడే విధానం నుంచి చేసే పనుల వరకూ ప్రతిదీ ఒక పద్ధతిగా ఉండాలి. వారు చూడలేని దృశ్యాలు, వినకూడని మాటలు వారి దాకా చేరకూడదు. ఈ క్రమంలో రెండు లేదా మూడో సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి.
నిద్రపోయాకే
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వారు గాఢంగా నిద్రపోయిన తర్వాత దంపతులు కలవాలి. వాళ్లను ఉయ్యాలలో పడుకోబెట్టిన తర్వాత వారు ఏకాంత సమయాన్ని కేటాయించుకోవాలి.
ఈ వయసు పిల్లలు ఉంటే
మీ ఇంట్లో 1 నుంచి మూడేళ్ల లోపు పిల్లలు ఉన్నట్లయితే భార్యాభర్తలు అప్రమత్తంగా ఉండాలి. వారు ఏ సమయంలోనైనా నిద్ర లేచే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన టైం మీ కలయిక కోసం ఎంచుకోవాలి.
ఈ ఏజ్‌లో జాగ్రత్త
4 నుంచి ఏడేళ్ల లోపు పిల్లలు ఉన్నట్లయితే తల్లిదండ్రులు అలర్ట్‌గా ఉండాలి. ఈ వయసులో పిల్లలు వారి చుట్టూ జరుగుతున్న విషయాలను, పరిసరాలను గమనిస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఈ వయసు లోపు పిల్లలు ఉన్నప్పుడు భార్యాభర్తలు ఏకాంతం కోసం వేరే గది ఉపయోగించుకోవడం మంచిది.

ప్రైవసీ
ఏడేళ్లు దాటిన పిల్లలు ఉన్నప్పుడు వారిని సెపరేట్‌గా వేరే గదిలో పడుకోబెట్టడం శ్రేయస్కరం. ప్రైవసీ గురించి వారి వయసుకి తగినట్లుగా సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పడం ద్వారా ఎలాంటి మనస్పర్థలు ఉండవు.
పిల్లల ముందు తల్లిదండ్రులు ఫిజికల్ అఫెక్షన్ లేకుండా చూసుకోవాలి. దంపతులు ప్రేమగా ఉంటూనే ఆరోగ్యకరమైన బౌండరీలు పాటించడం ద్వారా పిల్లల మానసిక పరిస్థితిపై దుష్ప్రభావం పడదు. రెండో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు భార్యాభర్తలిద్దరికీ ప్రైవసీ, కంఫర్ట్ ఉండే సమయాన్ని ఎంచుకోవాలని గమనించాలి. పిల్లల వయసుకి తగినట్లుగా కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ తదుపరి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రశాంతంగా సాగుతుందని గుర్తుంచుకోవడం ముఖ్యం.



Click it and Unblock the Notifications
