Latest Updates
-
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్‌కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.!
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.!
అర్ధరాత్రి 12 దాటింది. భార్యభర్తల మధ్య వాదన ముగిసింది. కానీ ఆ గొడవకి సంబంధించిన విషయాలు మాత్రం ఇద్దరూ మనసులో పదే పదే గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఎడ మొహం, పెడ మొహంగా పడుకుని ఉన్నా.. మైండ్ మాత్రం నిద్రపోవడం లేదు. భాగస్వామి మాట్లాడిన తీరు, గొడవలో కొన్ని అర్థం కాని వాక్యాలు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలోనే మీరు వ్యక్తి గాని వ్యక్తిపై ఆధారపడతారు.

భాగస్వామితో గొడవ జరిగాక వాగ్వాదంలో మీ వాదన సరైనదేనా అనే ప్రశ్న పదే పదే మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. అప్పుడే స్మార్ట్ ఫోన్ తీసి ఏఐ చాట్‌బాట్ తెరిచి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. సమాధానం కోసం సలహాలను కోరతారు. “నేను చెప్పిన సమాధానం సరైనదేనా లేక నేను అతిగా స్పందిస్తున్నానా? తాను అన్న దానికి నేను ఏం చెప్పాలి? వారు మాట్లాడిన మాటల ద్వారా వారి ఉద్దేశ్యం ఏమిటి?” ఇలా టైప్ చేసి సమాధానం కోసం చూస్తుంటారు.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక.. రిలేషన్‌షిప్ సలహాలకి సంబంధించి ఎన్నో సందేహాలు, సలహాల కోసం చాట్‌బాట్‌ను ఆశ్రయిస్తున్నారు ఈ కాలం జంటలు. అనుబంధం, భావోద్వేగ నియంత్రణ ఇలా పలు అంశాలకు సంబంధించి క్లారిటీ కోసం ఏఐ సలహా కోరుతున్నారు. ఆ సమయంలో ఏఐ అందించే భరోసా, త్వరితగతిన సమాధానం.. బంధాలు బలపడటానికి దోహదపడుతోందని పరిశోధనలు చెబుతున్నాయి.
ముఖ్యంగా వ్యక్తిగతంగా గోప్యతకి సంబంధించి స్నేహితులు, కుటుంబీకులతో చర్చించుకోలేని విషయాలను సైతం ఏఐ చాట్‌బాట్‌తో పంచుకుని సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. కౌన్సిలింగ్‌కి సమయం, డబ్బు వెచ్చించలేని వాళ్లకి ఈ థెరపీ తక్షణ సహాయం అందించడంతో ఈ కాలం జంటలను ఏఐ సహాయం ఆకట్టుకుంటోంది.
ఆధునిక కాలం జంటలు ఏఐ చాట్‌బాట్‌లతో జరిపిన చాటింగ్‌కి సంబంధించి పరిశోధనల్లో ఏఐతో సాన్నిహిత్యాన్ని వారు ఎంతగానో అనుభవిస్తున్నారని వెల్లడైంది. ఏఐ సలహాలతో సంతృప్తి చెందడంతో ఏ సమస్య వచ్చినా, ఏ సందేహం కలిగినా మళ్లీ చాట్‌బాట్‌ను ఉపయోగించాలనే తాపత్రయం వారిలో పెరుగుతోంది. ఇది క్రమంగా ఒక అలవాటుగా మారిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లో ఎక్కువగా ఆందోళనకి గురయ్యే వ్యక్తులే భావోద్వేగపరంగా ఏఐతో ఆధారపడుతున్నాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి.

అయితే చాట్‌బాట్‌లు రాకముందు రెడ్డిట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో రిలేషన్‌షిప్ సందేహాలను, అనుభవాలను వ్యక్తపరిచేవారు. అంతేకాకుండా అక్కడ ఒక సమూహం నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. మీ గురించి గోప్యంగా ఉంచుతూనే మీ భావోద్వేగాలను వ్యక్తపరుచుకోవచ్చు. ఇతర వ్యక్తుల నుంచి సలహాలను తీసుకోవచ్చు. దీంతో మీరు ఒంటరిగానే ఉన్నారనే ఫీలింగ్ పోతుంది. దానికి కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఏఐ చాట్‌బాట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీ భావాలను సులభంగా వ్యక్తపరచవచ్చు. సమాధానం కోసం చాలా సమయం వేచి ఉండాల్సిన పని కూడా ఉండదు. తక్కువ సమయంలోనే మీ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.
ఇక చాలా మంది ఏఐ చాట్‌బాట్‌లను కేవలం గొడవకి సంబంధించిన విషయాలకే కాకుండా ఇతర అంశాల కోసమూ ఉపయోగిస్తున్నారు. సింపుల్‌గా ఒక కమ్యూనికేషన్ కోచ్‌గా ఉపయోగిస్తారని చెప్పవచ్చు. భాగస్వామితో వివాదం తర్వాత వారిని ఆకట్టుకోవడానికి ఎలా మెసేజ్ చేయాలి.. ఎలా మాట్లాడాలి వంటి సలహాలను తీసుకుంటున్నారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇంకా డేటింగ్, సెలబ్రేషన్స్, వెకేషన్స్ వంటి వాటిపై సూచనలూ తీసుకుంటున్నారు.
అంతేకాకుండా ఏఐ చాట్‌బాట్ సంభాషణలపై జరిగిన పరిశోధనల్లో మరికొన్ని అడ్వాన్స్‌డ్ ప్రశ్నలు కూడా అడిగినట్లు వెల్లడైంది. పెళ్లికి ముందే శృంగారాన్ని ప్లాన్ చేసుకుంటే కలిగి ప్రయోజనాలు, లైంగిక అంశాలకు సంబంధించినవి వంటి వాటినీ అడుగుతున్నారు. ఇలాంటి సందేహాలను ఇతరులతో చర్చించడం కష్టంగా అనిపించడంతో చాట్‌బాట్ ద్వారా సమాధానం తెలుసుకుంటున్నారు.
అయితే ఏఐ ఆలోచనలు కేవలం ఇద్దరి మధ్య సంభాషణలకి మాత్రమే సహాయం చేయగలదు. కానీ ఒక బంధం బలపడాలంటే ఒకరి అభిప్రాయాలు, నిర్ణయాలను మరొకరు గౌరవించుకోవాలి. రియల్ టైంలో ఇది సాధ్యమైతేనే ఆ సంభాషణలకి అర్థం ఉంటుందని సైకాలజిస్ట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వ్యక్తిగత గోప్యతకి సంబంధించి అంశాలను ఏఐ చాట్‌బాట్‌లో లేవనెత్తినప్పుడు డేటా వ్యవస్థ సరిగా ఉందా లేదా అని సరిచూసుకోవడం మంచిది. లేదంటే ప్రైవసీ ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.



Click it and Unblock the Notifications
