Latest Updates
-
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే..
మనిషి తన జీవితంలో ఎన్నిసార్లు ప్రేమలో పడతారో తెలుసా?
మనం సినిమాల్లో, నవలల్లో చూసినట్లుగా ఒక వ్యక్తి పదే పదే ప్రేమలో పడతారా? లేక నిజమైన ప్రేమకు ఏదైనా నిర్దిష్టమైన పరిమితి ఉందా? ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రేమ గురించి మనం ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటాం.
కానీ ఒక మనిషి తన జీవితకాలంలో అసలు ఎన్నిసార్లు గాఢంగా ప్రేమలో పడతారు అనే ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలిందా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నపైనే ప్రఖ్యాత కిన్సే ఇన్‌స్టిట్యూట్ ఒక సంచలన అధ్యయనం చేసింది. ఆ పరిశోధనలో తేలిన వాస్తవాలు మన ఊహలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

పరిశోధనలో వెలుగుచూసిన సంచలన నిజాలు
కిన్సే ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ అమండా గెస్సెల్‌మాన్ బృందం దీనిపై ఒక భారీ సర్వే నిర్వహించింది. 18- 99 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏకంగా 10,036 మందిని ఒకే ఒక్క ప్రశ్న అడిగారు.. మీ జీవితంలో మీరు ఎన్నిసార్లు నిజంగా, గాఢంగా ప్రేమలో పడ్డారు? అని. దీనికి వచ్చిన సమాధానాలు విశ్లేషించగా ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. సగటున ఒక వ్యక్తి తన జీవితకాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే నిజమైన ప్రేమలో పడతాడట.
గణాంకాలను నిశితంగా గమనిస్తే.. 30 శాతం మంది తమ జీవితంలో రెండుసార్లు ప్రేమలో పడగా, 28 శాతం మంది కేవలం ఒక్కసారి మాత్రమే ఆ మధురానుభూతిని పొందారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..సర్వేలో పాల్గొన్న వారిలో 14 శాతం మంది తాము ఇప్పటివరకు ఎవరినీ ప్రేమించలేదని, ఆ భావనే తమకు కలగలేదని కుండబద్దలు కొట్టారు.
ప్రేమకు వయసు, జెండర్ భేదం ఉండదు!
ప్రేమ ఎవరి పట్లా వివక్ష చూపదని ఈ సర్వే మరోసారి నిరూపించింది. మీరు అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ప్రేమించే తీరు, పొందే అనుభూతి ఒకేలా ఉంటుంది. అయితే మహిళల కంటే పురుషులే కొద్దిగా ఎక్కువగా ప్రేమలో పడతారని నివేదికలో తేలడం విశేషం. అలాగే ప్రేమ విషయంలో వృద్ధులు కూడా ఏమాత్రం వెనుకబడలేదని, ప్రేమకు వయసుతో పనేలేదని స్పష్టమైంది.
సినిమా ప్రపంచం వేరు.. వాస్తవం వేరు
నేటి డిజిటల్ యుగంలో సినిమాలు, సోషల్ మీడియా ప్రేమపై అవాస్తవికమైన అంచనాలను పెంచేస్తున్నాయి. తెరపై కనిపించే అద్భుతమైన ప్రేమకథలను చూసి, దాదాపు 73 శాతం మంది తమ భాగస్వామి కూడా సినిమాల్లోని హీరో లేదా హీరోయిన్ లాగే ఉండాలని పగటి కలలు కంటున్నారట.
ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో కనిపించే పర్ఫెక్ట్ కపుల్స్ ను చూసి నిజమైన ప్రేమ గురించి యువత గందరగోళానికి గురవుతోంది. కానీ, వాస్తవం దానికి ఆమడ దూరంలో ఉంటుందని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది.



Click it and Unblock the Notifications
