బంపర్ ఆఫర్ అంటే ఇదే.. రీఛార్జ్‌ తో పాటు ఫ్రీగా రూ.1 లక్ష ఇన్స్యూరెన్స్ ఇస్తున్న BSNL

ప్రతి నెలా లేదా రెండు మూడు నెలలకోసారి మొబైల్ రీఛార్జ్ చేయించుకోవడం చాలామందికి పెద్ద తలనొప్పిగా మారుతోంది. జియో, ఎయిర్‌ టెల్ , వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థల రీఛార్జ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న టైంలో, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) తన వినియోగదారులకు ఒక అద్భుతమైన ఆఫర్‌ ను తీసుకొచ్చింది. సాధారణ రీఛార్జ్ ప్లాన్‌ లలో ఎక్కడా కనిపించని విధంగా దీర్ఘకాలిక వ్యాలిడిటీతో పాటు, అదనపు రోజుల ప్రయోజనం, ఒక ముఖ్యమైన మరో ప్రయోజనాన్ని కూడా ఈ ప్రత్యేక ప్యాకేజీలో అందిస్తోంది.

380 రోజుల వ్యాలిడిటీ ప్రయోజనాలు

BSNL ప్రత్యేక ఆఫర్ ప్రకారం రూ. 2449 తో రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల అంటే ఒక సంవత్సరం వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే నవంబర్ 30, 2026 లోపు రీఛార్జ్ చేసుకుంటే 15 రోజుల అదనపు వ్యాలిడిటీ ఉచితంగా వస్తది,మొత్తం 380 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో అన్‌ లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ యతో పాటు రోజూ 2GB హై స్పీడ్ డేటా వస్తుంది. ఒకవేళ ఏదైనా రోజున 2GB డేటా పరిమితి ముగిసినా ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు. 40 Kbps వేగంతో కొనసాగుతుంది. దీనివల్ల ముఖ్యమైన మెసేజ్‌ లు లేదా చిన్నపాటి పనులు నిరంతరాయంగా చేసుకోవచ్చు.

BSNL Special Offer Free Accidental Death Insurance 380 Days Validity at Rs 2449

రూ. 1 లక్ష ఉచిత ప్రమాద బీమా

ఈ రీఛార్జ్ ప్లాన్‌ లో ప్రధాన ఆకర్షణ ఇందులో లభించే రూ. 1 లక్ష ఉచిత ప్రమాదవశాత్తు మరణ బీమా. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) భాగస్వామ్యంతో BSNL ఈ బీమా సౌకర్యాన్ని అందిస్తోంది. దీని కింద రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదంలో కాలిపోవడం, పాము కాటు, పిడుగుపాటు, కరెంట్ షాక్ వంటి దురదృష్టకర ఘటనలకు కవరేజీ ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక బీమా ఫారాలు నింపకుండా, అదనపు ప్రీమియం కట్టకుండానే ఇది లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం లేదా ప్రయాణాల నిమిత్తం ఎక్కువగా బయట ఉండే వారికి, సామాన్య కుటుంబాలకు ఇది అదనపు భద్రతను ఇస్తుంది.

చలికాలంలో వెచ్చని వాతావరణం కోరుకుంటున్నారా? భారత్‌ లో తప్పక చూడాల్సిన 5 బెస్ట్ ప్రదేశాలివే!చలికాలంలో వెచ్చని వాతావరణం కోరుకుంటున్నారా? భారత్‌ లో తప్పక చూడాల్సిన 5 బెస్ట్ ప్రదేశాలివే!

పూర్తి వివరాలు ఎక్కడ తెలుసుకోవాలి?

ఈ ఆఫర్ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే BSNL యొక్క AI ఆధారిత అసిస్టెంట్ BRex (BSNL Recharge Expert) సహాయం తీసుకోవచ్చు. ఇది మీకు సరైన ప్లాన్ సూచించి సమయాన్ని ఆదా చేస్తుంది. అలాగే BSNL అధికారిక వెబ్‌ సైట్ www.bsnl.co.in, BSNL Selfcare యాప్ లేదా టోల్ ఫ్రీ హెల్ప్‌ లైన్ 18001801503 ద్వారా కూడా సమాచారం పొందవచ్చు.

Story first published: Friday, November 20, 2026, 16:48 [IST]
Desktop Bottom Promotion