చలికాలంలో వెచ్చని వాతావరణం కోరుకుంటున్నారా? భారత్‌ లో తప్పక చూడాల్సిన 5 బెస్ట్ ప్రదేశాలివే!

చలికాలం రాగానే చాలామంది మంచు కురిసే కొండ ప్రాంతాలను ఆస్వాదించడానికి వెళ్తుంటారు. అయితే అందరూ చలిని ఇష్టపడరు. అలాంటి వారు చలికాలంలో వెచ్చని, ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా ఈ శీతాకాలంలో ప్రకాశవంతమైన సూర్యరశ్మిని, సముద్రపు ప్రశాంతతను ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే అందమైన బీచ్‌ ల నుండి చారిత్రక భవనాలు, అద్భుతమైన దృశ్యాల వరకు అన్నీ అందించే భారతదేశంలోని ఐదు బెస్ట్ ప్లేస్ ల గురించి ఇక్కడ చూడండి.

గోవా

చలికాలంలో వెచ్చని వాతావరణం, సముద్రపు అలలు, బీచ్‌ లో సన్ బాత్ ఆస్వాదించాలంటే గోవా బెస్ట్. అక్టోబర్ నుండి మార్చి వరకు ఇక్కడ వాతావరణం బెస్ట్ గా ఉంటుంది, ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో మరింత ప్రత్యేకంగా మారుతుంది. బాగా, కలంగుట్, అంజునా, పలోలెం వంటి ప్రసిద్ధ బీచ్‌ లలో రోజంతా గడపవచ్చు. బీచ్ వాకింగ్, వాటర్ స్పోర్ట్స్, సన్ సెట్ వ్యూ, బైక్ రైడ్‌ లను ఆస్వాదించవచ్చు. అదనంగా పోర్చుగీస్ వాస్తుశిల్పం, పురాతన చర్చిలు, అందమైన కేఫ్‌ లు, స్థానిక మార్కెట్లను అన్వేషించవచ్చు.

Best Warm Places to Visit in India During Winter to Escape the Cold

వర్కల, కేరళ

సముద్ర తీరంలో ప్రశాంతత, వెచ్చదనం రెండింటినీ కోరుకునే వారికి కేరళలోని వర్కల ఒక గొప్ప ప్రదేశం. ఎత్తైన కొండచరియలు, అందమైన కేఫ్‌ లు, విశాలమైన నీలి జలాలతో ఈ తీరం అలరారుతుంది. ఇక్కడి శీతాకాలాలు ఎంతో ఆహ్లాదకరంగా, వెచ్చగా ఉంటాయి. వర్కల బీచ్‌ తో పాటు నార్త్ క్లిఫ్, సౌత్ క్లిఫ్ కూడా సందర్శించదగినవే. బీచ్‌ లో కూర్చుని సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ, కొండచరియపై నడుస్తూ అందమైన సూర్యాస్తమయాన్ని చూడవచ్చు. అక్కడి కేఫ్‌ లలో రుచికరమైన వంటకాలను ఆస్వాదించవచ్చు.

అండమాన్ నికోబార్ దీవులు

నీలిరంగు జలాలు, తెల్లని ఇసుక, వెచ్చని సూర్యరశ్మి.. ఇక్కడ శీతాకాలంలో వాతావరణం వెచ్చగా ఉంటుంది. హేవ్‌ లాక్ దీవి, నీల్ దీవి, రాధానగర్ బీచ్ అనేక రకాల కార్యకలాపాలను అందించే అందమైన ప్రదేశాలు ఇక్కడున్నాయి.

చలికాలం స్పెషల్ బ్రేక్‌ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా..చలికాలం స్పెషల్ బ్రేక్‌ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా..

హంపి

చరిత్ర, సాహసాలను ఇష్టపడే వారికి కర్ణాటకలోని హంపి బెస్ట్. ఆహ్లాదకరమైన శీతాకాలపు ఎండలో పగటిపూట చారిత్రక కట్టడాలను సందర్శించడం మర్చిపోలేని అనుభూతినిస్తుంది. ప్రాచీన దేవాలయాలు, విశిష్టమైన రాతి వాస్తుశిల్పానికి హంపి ప్రసిద్ధి. విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం, రాతి రథం, మాతంగ కొండ వంటి ప్రదేశాలను తప్పక చూడండి. అక్కడి ప్రకృతి అందాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.

పుదుచ్చేరి

వెచ్చని సూర్యరశ్మి, ప్రశాంతమైన వాతావరణంతో పాండిచ్చేరి కూడా శీతాకాలపు యాత్రకు మంచి ప్లేస్. ఇక్కడి ఫ్రెంచ్ వాస్తుశిల్పం, రంగురంగుల వీధులు, సముద్రతీర కేఫ్‌ లు, అందమైన బీచ్‌ లు ప్రత్యేకమైన ప్రయాణ అనుభవాన్ని ఇస్తాయి. ప్రోమనేడ్ బీచ్‌ లో ఉదయపు నడకతో పాటు ప్యారడైజ్ బీచ్, సెరెనిటీ బీచ్‌ లను చూడవచ్చు. ఫ్రెంచ్ కాలనీలోని పసుపు, తెలుపు రంగు భవనాలు, ఆరోవిల్ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Story first published: Friday, November 20, 2026, 15:52 [IST]
Desktop Bottom Promotion