Latest Updates
-
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.!
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి?
మన ముందు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ, వెనక్కి తిరగ్గానే మనపైనే బురద జల్లే తేనె పూసిన కత్తులు మన చుట్టూ చాలామందే ఉంటారు. అందరినీ గౌరవించాలి, మంచిగా ఉండాలి అని చిన్నప్పటి నుంచి మనకు నేర్పుతారు. కానీ ఆ మాటలను మనసులో పెట్టుకుని జీవించే వారు కొందరైతే, సమాజంలో కేవలం మంచివాళ్లు అనిపించుకోవడానికి నటిస్తున్న వారు ఎందరో. మరి మీ చుట్టూ ఉన్న అలాంటి విషపూరిత వ్యక్తులను గుర్తించడం ఎలాగో ఇక్కడ చూడండి.

గాయపరిచే మాటలు
కొందరు ఎప్పుడూ ఇతరులలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటారు. పరిస్థితుల గురించి ఆలోచించకుండానే ఎదుటివారిపై ఒక అంచనాకు వచ్చేస్తారు. వీరి మాటలు ఎంత కఠినంగా ఉంటాయంటే, అవి ఎదుటివారి మనసును తీవ్రంగా గాయపరుస్తాయి.
ఇతరులదే నింద
తమ తప్పులను అంగీకరించే కనీస నిజాయితీ వీరికి ఉండదు. ఏదైనా సమస్య వస్తే వెంటనే ఇతరులపై నెపం నెట్టేస్తారు. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా, తాము చెప్పిందే వేదవాక్కు అని నిరూపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు.
హద్దులు మీరడం
ఇతరుల వ్యక్తిగత హద్దులను వీరు ఏమాత్రం గౌరవించరు. ఎదుటివారికి ఇబ్బందిగా ఉన్నా పట్టించుకోరు. ప్రతి విషయంలోనూ నాకేంటి? అనే స్వార్థపూరిత ఆలోచనే వీరి ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది.
కృతజ్ఞత శూన్యం
వీరి డిక్షనరీలో కృతజ్ఞత అనే పదానికి చోటు లేదు. జీవితంలో ఎంత మంచి జరిగినా దానిని వదిలేసి, ప్రతికూల విషయాలపైనే దృష్టి పెడతారు. ప్రతీ దానికి కుంకటి ఏడుపు ఏడుస్తూ, ఏదో ఒక లోపాన్ని వెతుకుతూ ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు.
నమ్మకద్రోహం
నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో వీరు ఎప్పుడూ విఫలమవుతారు. అవసరమైనప్పుడు కొండంత అండగా ఉంటామని పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు. కానీ తీరా సమయం వచ్చేసరికి మొహం చాటేస్తారు.
హాస్యం ముసుగులో పైశాచిక ఆనందం
జోకులు వేస్తున్నాం అనే నెపంతో ఇతరులను కించపరచడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఎదుటివారి లోపాలను పదే పదే నలుగురిలో ఎత్తిచూపుతూ పైశాచిక ఆనందం పొందుతారు. వీరి నవ్వు వెనుక ఉన్న క్రూరత్వాన్ని దీని ద్వారా పసిగట్టవచ్చు.
ఆధిపత్య ధోరణి
తమను తాము మేధావులుగా, ఇతరుల కంటే అధికులుగా భావించుకుంటూ, పక్కవారిని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అలాగే క్షమాగుణం వీరికి అస్సలు తెలియదు. ఎప్పుడో జరిగిన చిన్న పొరపాట్లను మనసులో పెట్టుకుని, పాత పగలను రగులుస్తూనే ఉంటారు.
పుకార్లు
వీరితో స్నేహం ఎప్పుడూ ఏకపక్షంగానే ఉంటుంది. తమ అవసరాలకు ఇతరులను వాడుకుంటారు కానీ ఎదుటివారికి సహాయం చేయాల్సి వస్తే మాత్రం పత్తా లేకుండా పోతారు. ఇతరుల వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచలేరు. పుకార్లు సృష్టించడం, అబద్ధాలు చెప్పడం వీరికి కాలక్షేపం లాంటిది.



Click it and Unblock the Notifications
