Latest Updates
-
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం? -
రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు.. -
ఇంట్లో ఈ ఒక్కటి వాడకపోతే ఇన్ని తిప్పలా.. అరికాళ్ల నొప్పులకి ప్రధాన కారణమిదే.! -
ఆ భయంతో భార్యను దూరం పెడుతున్నారా.. పురుషులను ఇబ్బందికి గురిచేసే శృంగార సందేహాలివే.! -
చపాతీ, అన్నంలోకి అదిరిపోయే రుచితో పెరుగు బెండకాయ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షం పడేటప్పుడు వేడివేడిగా హెల్తీగా తినాలంటే.. ఐదే నిమిషాల్లో లెమన్ గార్లిక్ సోయా చంక్స్ రెడీ.! -
శుక్ర-శని సమసప్తక యోగం.. ఆగస్టు 1 నుండి ఈ రాశులకు ఊహించని కష్టాలు! -
90స్ కిడ్స్ ఫేవరెట్ పల్లి ఉండలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
అమృతం లాంటి సాంబార్ కేవలం 15 నిమిషాల్లోనే.. ఎలాగో చూసేయండి! -
సిగరెట్ ముట్టకపోయినా యువకులకు లంగ్ క్యాన్సర్..మీలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా?
కోపాన్ని కంట్రోల్ చేసుకోడానికి 5 టిప్స్..ఎదుటివాళ్లు ఎంత రెచ్చగొట్టినా నో ప్రాబ్లమ్
కోపం అనేది కొంపలు ముంచుతుంది అని మన పెద్దలు తరుచుగా చెబుతుంటారు. అనవసరమైన చోట్ల కోపం తెచ్చుకుంటే జరిగే అనర్థాల గురంచి మన పురాణాల్లో కూడా బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. కోపం మంచిదే కానీ అన్ని సమయాల్లో కాదు అని నిపుణులు కూడా తరచూ చెబుతుంటారు. అయితే ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలామంది చాలా చిన్న చిన్న విషయాలకే, అయినదానికి కానిదానికీ కోప్పడుతూ ఉంటారు. ఆ కోపంలో ఏది పడితే అది మాట్లాడటం వల్ల బంధాలు,బంధుత్వాలు కూడా దూరమైపోతాయి .
తరచుగా కోప్పడుతూ ఉండే వారికి ఏదైనా మంచి విషయం చెప్పాలన్నా కూడా ఎవరైనా వెనకుడుగు వేసే పరిస్థితి ఉంటుంది. అయితే మనిషికి ఉండే సహజ భావోద్వేగమైన కోపాన్ని అదుపులో ఎలా ఉంచుకోవాలి? కోపం వచ్చినప్పుడు 5 పనులు చేస్తే కోపం ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతుందని,ప్రశాంతత చేకూరుతుందని ఖమ్మంలోని ప్రసిద్ధ సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు చెందిన నియోనాటాలజిస్ట్ డాక్టర్ గౌతమ్..ఓ ఇన్ ప్టాగ్రామ్ వీడియో ద్వారా తెలియజేశారు.

కోపాన్ని కంట్రోల్ చేసే 5 చిట్కాలు ఇవే
10 సెకన్లు ఆగండి
సందర్భం ఏదైనా సరే కోపం రావడాన్ని మనం ఆపలేం కానీ కోపం ముంచుకొస్తున్నప్పుడు నోటికి వచ్చిన మాట అనేసే ముందు ఒక్క పది సెకన్లు ఆగండి. ఆ సమయంలో మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో ఆలోచించండి. ఈ చిన్న టైం గ్యాప్ మీ మెదడుకు ఆలోచించుకునే సమయాన్ని ఇస్తుంది. తీవ్రమైన భావోద్వేగాల నుండి బయటపడేలా చేస్తుంది. పది సెకన్ల మౌనం పది గంటల మనశ్శాంతిని ఇస్తుందని డాక్టర్ గౌతమ్ చెబుతున్నారు.
ప్లేస్ మారండి
గొడవ పెద్దదవుతున్నప్పుడు లేదా మీకు విపరీతమైన కోపం వస్తున్నప్పుడు వెంటనే అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోండి. పర్యావరణంలో మార్పు మన ఆలోచనా విధానంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని సైన్స్ చెబుతుంది. చోటు మారితే మూడ్ మారుతుంది. ఇది మిమ్మల్ని కోపానికి కారణమైన అంశం నుండి భౌతికంగా, మానసికంగా దూరం చేసి తిరిగి ప్రశాంతంగా ఆలోచించేందుకు హెల్ప్ చేస్తుంది.
లోతుగా ఊపిరి పీల్చుకోండి
కోపం మన శరీరంలో ఒత్తిడిని పెంచుతుంది. దాన్ని తగ్గించడానికి శ్వాస ఒక అద్భుతమైన సాధనం. కోపంగా అనిపించినప్పుడు కళ్ళు మూసుకుని నెమ్మదిగా, లోతుగా ఊపిరి పీల్చుకోండి. గాలిని పీలుస్తున్నప్పుడు ప్రశాంతత లోపలికి వెళ్తున్నట్టు, వదులుతున్నప్పుడు మీలోని కోపం, ఒత్తిడి బయటకు వెళ్లిపోతున్నట్టు భావించాలని డాక్టర్ గౌతమ్ సూచిస్తున్నారు.
చల్లటి నీరు
కోపం వచ్చిన సమయంలో వెంటనే ఒక గ్లాసు చల్లని నీరు తాగాలని డాక్టర్ గౌతమ్ సూచిస్తున్నారు. ఎందుకంటే చల్లనీరు తాగడం వల్ల గొంతు చల్లబడుతుంది. గొంతు చల్లబడితే మనసు కూడా చల్లబడుతుంది. ఇది మీ శరీరాన్ని, మనసును వెంటనే తేలికపరుస్తుంది. దీంతో మీ కోపమనే అగ్ని ఆ చల్లదనంలో చల్లారిపోతుంది.
నడకతో కోపాన్ని కరిగించండి
శరీరానికి కొద్దిపాటి శ్రమను కలిగించడం ద్వారా మానసిక ఒత్తిడిని సులభంగా జయించవచ్చు. కోపం వస్తున్నప్పుడు కనీసం 10 నిమిషాలు వేగంగా నడవడం మంచిదని డాక్టర్ గౌతమ్ సూచిస్తున్నారు. ఈ చిన్నపాటి ఎక్సర్ సైజ్ మీ శరీరంలో ఎండార్ఫిన్లు అనే సంతోషకరమైన హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఇది కోపాన్ని కలిగించే ఆడ్రినలిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. కొద్దిపాటి ఎక్సర్ సైజ్ మీలోని కోపాన్ని కరిగించి, మిమ్మల్ని తిరిగి మామూలు స్థితికి తీసుకువస్తుంది.
ఈ చిట్కాలన్నీ కోపాన్ని తాత్కాలికంగా నియంత్రించేవే కానీ జీవితంలో శాశ్వతమైన ఆనందం కావాలంటే.. క్షమించు, మర్చిపో, ముందుకు సాగు అనే సూత్రాన్ని ఫాలో అవ్వాలని డాక్టర్ గౌతమ్ తెలిపారు.



Click it and Unblock the Notifications