ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.?

భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న కలహాలు సాధారణం. అలా అని వారి మధ్య ప్రేమ లేదని అనుకోవద్దు. అలకలు, చిరుకోపాలు, ఆ కాసేపటికే కవ్వింతలు, కబుర్లు, బాధ్యతలు, బంధాలు ఇలా ఎన్నో ఉంటాయి. కానీ ఏ భర్తకి అయినా కుటుంబం అన్నాక కొన్ని బలాలు, బలహీనతలు, లక్షణాలు ఉంటాయి. అయితే మీ భర్తకి కనుక ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. మరి ఆ లక్షణాలు ఏంటి.. నిపుణుల సలహాలు చూద్దాం..

If your husband has these five qualities he is a gem check these

మంచి భర్తకి ఉండాల్సిన లక్షణాలు

బాధ్యతలు పంచుకోవడం..

సంపాదన పరంగా, కుటుంబ పెద్దగా భర్త ఎన్ని బాధ్యతలు తీసుకున్నా.. ఇంటి వ్యవహారాలు, పిల్లల పెంపకంలో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇల్లు, సంసారం, పిల్లలు.. దంపతుల ఇద్దరి బాధ్యత అని భావిస్తారు. ఇలాంటి లక్షణం ఉన్న భర్త దొరకడం గొప్ప వరం.

తప్పుంటే క్షమాపణలు అడగడం

దంపతుల మధ్య చిన్న గొడవైనా తన తప్పు ఉంటే భర్త ఖచ్చితంగా క్షమాపణలు చెబుతారు. నేనెందుకు చెప్పాలనే పురుషాహంకారం ప్రదర్శించరు. దాంపత్యంలో ఈగో కంటే రిలేషన్‌షిప్‌కే ప్రాధాన్యత ఇస్తారు. మీ భర్తకి ఇలాంటి లక్షణం ఉంటే మీరు లక్కీనే..

If your husband has these five qualities he is a gem check these

ఎనలేని కేరింగ్‌

కాస్ట్లీ గిఫ్ట్‌లు ఇచ్చినా సంతోషంగా ఫీల్‌ అవ్వని ఆడవారు.. చిన్న సానుభూతి, మెచ్చుకోలు చూపించడం, పరామర్శలకి పొంగిపోతుంటారు. భర్త చిన్న చిన్న విషయాలకే కేర్‌ చూపిస్తే చాలు తెగ సంతోషపడిపోతారు. తిన్నావా, అలసిపోయావా, రెస్ట్‌ తీసుకుంటావా, ఏమైనా కావాలా అనే చిన్న మాటల్లో వారు ఎంతో ప్రేమను చూస్తారు. మీకు ఇలాంటి భర్త ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు.

కోపంలోనూ సహనం

సాధారణంగా దంపతుల మధ్య గొడవ వచ్చినప్పుడు ఒకరి గురించి ఒకరు హేళన చేసి మాట్లాడటం లేదా ఇరు వైపులా కుటుంబీకుల గురించి చులకనగా మాట్లాడటం, లోపాలను ఎత్తిచూపడం లాంటివి చేస్తారు. కానీ మంచి భార్యాభర్తల బంధంలో ఇలాంటివి ఉండవు. భర్త ఎంత కోపంలో ఉన్నా హద్దులు దాటి ప్రవర్తించడు. అవమానకర వ్యాఖ్యలు చేయరు. మీ భర్తలో ఈ గుణం ఉంటే మీది అన్యోన్య దాంపత్యమే..

మీ కన్నీళ్లకి విలువ

భార్య ఏడుస్తూ ఉన్నా, ఏ మాత్రం బాధగా ఉన్నట్లు అనిపించినా భర్త దానిని లైట్‌ తీసుకోకూడదు. మీ బాధకి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని ఓదారుస్తారు. మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు. తన జీవితంలోకి ప్రవేశించిన భాగస్వామి కన్నీళ్లు పెట్టకుండా చూసుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తారు. ఇంత మంచి లక్షణం ఉన్న వ్యక్తి మీ జీవిత భాగస్వామి అయితే ఎడారిలోనూ మీరు సంతోషంగా బతకవచ్చు.

Story first published: Tuesday, September 1, 2026, 8:05 [IST]
Desktop Bottom Promotion