Latest Updates
-
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.!
పెళ్లికి ముందు ప్రతి అబ్బాయి కాబోయే భార్యకు చేయాల్సిన వాగ్దానాలు
పెళ్లంటే చాలా మంది అబ్బాయిలు మంచి అందమైన అమ్మాయిని వెతికి భాగస్వామిని చేసుకోవడం అనుకుంటారు. మరికొందరు పెళ్లి చేసుకుంటే.. జీవితంలో ఓ పనైపోతుంది అనుకుంటారు. మరికొందరు పెళ్లి చేసుకోవడంతో.. వాళ్ల లైఫ్ సెటిల్ అవుతుందని భావిస్తారు.
కుటుంబంలో సంతోషమైనా, బాధ కలిగినా, మనస్పర్దలు వచ్చినా.. ఆడవాళ్లే కారణమని చాలా మంచి అపోహ పడతారు. కానీ.. కుటుంబంలో సంతోషం తీసుకొచ్చే బాధ్యత కేవలం ఆడవాళ్లది మాత్రమే కాదు. అలాగే భార్య అంటే వంట గదికే పరిమితం అని భావిస్తారు చాలామంది. కానీ పెళ్లంటే.. ఇద్దరు వ్యక్తుల ఐకమత్యం. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉండాలి. అప్పుడే వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుంది.
కాబట్టి.. ఇలాంటి ఆలోచనలన్నీ.. ఒకప్పటివి. కాలం మారింది. అమ్మాయిలు స్వతంత్రను సాధించుకుంటున్నారు. కాబట్టి.. ఇద్దరి మధ్య పోట్లాటలు, మనస్పర్ధలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే.. పెళ్లికి ముందు అబ్బాయిలు కొన్ని వాగ్దానాలు చేయాలి. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఈ విషయాలను.. అమ్మాయిలకు చెప్పడం వల్ల.. ఆమె చాలా సంతోషపడుతుంది. పెళ్లికి ముందు అబ్బాయిలు తీసుకోవాల్సిన 10 వాగ్దానాలేంటో చూద్దామా..

గౌరవం
రిలేషన్ షిప్ లో రెస్పెక్ట్ చాలా ముఖ్యమైనది. ఇద్దరి మధ్య ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి.. మీ భాగస్వామిని గౌరవిస్తానని మాట ఇవ్వండి. ఆమె ఆలోచనలకు విలువనిస్తూ.. ఆమెను అర్థం చేసుకుంటానని వివరించండి.

ఫోకస్
ఇంటి పనులకు దూరంగా ఉండకూడదు. తమ లక్ష్యాలు నెరవేర్చుకుంటూనే.. తమ భాగస్వామికి తోడుగా ఉండాలి. ఆమెకు సహాయపడాలి.

కేరింగ్
మీరు ఎల్లప్పుడూ ఆమె కొంగు పట్టుకుని తిరగాల్సిన పనిలేదు. కానీ.. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు భర్త పక్కనే ఉండి చూసుకోవాలి. అప్పుడే అండర్ స్టాండింగ్ పెరుగుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ రెట్టింపు అవుతుంది.

ఇన్స్పిరేషన్
లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి మీ భాగస్వామికి సపోర్ట్ గా ఉండాలి. ఆమెను ప్రోత్సహించాలి.

ఇష్టాయిష్టాలు
కొంతమంది అబ్బాయిలు తమకు ముఖ్యమైనది కాకపోతే.. నిర్లక్ష్యం చేస్తారు. కానీ.. తమ భాగస్వామి ఇష్టాయిష్టాలను కూడా గౌరవించి.. ఆమెకు నచ్చిన విషయంపై స్పందించాలి.

నమ్మకం
నమ్మకం అనేది పెళ్లికి పునాది లాంటిది. కాబట్టి.. మీ భాగస్వామిని మీరు నమ్మాలి. నమ్మకం ఉంచాలి. అబ్బాయిలు అమ్మాయిలపై నమ్మకం పెడితే.. అమ్మాయిలు కూడా అలానే నమ్ముతారు. కాబట్టి.. వైవాహిక జీవితంలో నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది.

సెక్యూర్
అబ్బాయిలు ఖచ్చితంగా అమ్బాయిలకు సెక్యూర్ గా ఉన్నామన్న భావనను కలిగించాలి.

కమ్యునికేషన్
ఎలాంటి బాధ కలిగినా.. తనను ఓదార్చడానికి నేనున్నాని ప్రామిస్ చేయాలి అబ్బాయిలు. ఎలాంటి మనస్పర్దలు వచ్చినా.. కమ్యునికేషన్ ఉంటేనే సమస్య నుంచి బయటపడవచ్చు. కాబట్టి.. కమ్యునికేషన్ అనేది.. ఇద్దరి మధ్య చాలా ఇంపార్టెంట్.



Click it and Unblock the Notifications