Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని తెలిపే సంకేతాలు..!
ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు మనస్తత్వాలు, వేర్వేరు ఫ్యామిలీల నుంచి, వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఇద్దరు కలిసి ఉండటం, ఇద్దరి లైఫ్ స్టైల్స్, అలవాట్లు, ఐడియాలు, ఆలోచనలు వేరుగా ఉన్నవాళ్లు కలిసి హ్యాపీగా ఉండటం అనేది అంత తేలికైన విషయం కాదు. ఇద్దరి మధ్య సఖ్యత కుదరడం కూడా అంత సులభం కాదు.
వేర్వేరు వ్యక్తులైనా.. ఇద్దరూ హ్యాపీగా ఉంటున్నారు అంటే అది మిరాకిలే. అంటే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అర్ధం. ఏ రిలేషన్ కూడా పర్ఫెక్ట్ కాదు. మీ భాగస్వామి ఇష్టాలను గౌవరిస్తున్నారు, అంగీకరిస్తున్నారు.. అలాగే వాళ్లు కూడా మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారంటే.. మీ ఇద్దరి ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని సంకేతం.
భార్యా, భర్త ఇద్దరూ టీం మెంబర్స్ లాంటివాళ్లు. ఇద్దరూ కష్టపడటం వల్ల తమ జీవిత లక్ష్యాలను చేరుకోగలుగుతారు. సొంతిళ్లు, పిల్లలను పెంచడం వంటి బాధ్యతలు నెరవేరుస్తారు. ఒకవేళ అంగీకారతత్వం లేకపోతే.. వైవాహిక బంధం ఎక్కువకాలం ఉండలేదు. చాలావేగంగా బంధం బలహీనమవుతుంది. కాబట్టి.. మీ ఇద్దరి బంధం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుందని తెలిపే సంకేతాలు తెలుసుకోండి.

సంకేతం 1
ఎలాంటి దాపరికం లేకుండా.. అన్ని విషయాలు మీ భర్తతో వివరిస్తారు. అలా చేస్తే.. మీరు ఖచ్చితంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకవేళ అసహ్యకరమైన విషయాలను దాచిపెడుతున్నారంటే.. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకోరు.

సంకేతం 2
అతన్ని పెళ్లి చేసుకోవడానికి అందరితో పోట్లాడారు. అవరోధాలు తొలగిపోయాయి అని మీరు భావిస్తే.. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాలేరు.

సంకేతం 3
తన ఫ్యామిలీని కలవాలని.. అతను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం, మీరు దానికి గొప్పగా ఫీలవుతారు. మీరు కూడా అతన్ని మీ ఇంటికి తీసుకెళ్లాలి. అప్పుడు మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకవేళ అతని ఎఫైర్ గురించి మీతో దాచిపెట్టారు అంటే.. ఒక్కసారి ఆలోచించాలి.

సంకేతం 4
మీ ఇద్దరి కంపెనీతో ఎప్పుడూ.. మీరిద్దరూ బోర్ గా ఫీలవడం లేదంటే.. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతారు. కొన్నిసార్లు మీరు మాట్లాడతారు, నవ్వుతారు, కొన్నిసార్లు మీరు సైలెంట్ గా ఉన్నా కూడా.. ఇద్దరూ బోర్ గా ఏమాత్రం ఫీలవరు.

సంకేతం 5
రోజులో సగభాగం.. అతనితో మీ భవిష్యత్ ఎలా ఉంటుందనే ఆలోచిస్తుంటారు. అలా అయితే.. మీరు ఖచ్చితంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకవేళ అతనితో ఫ్యూచర్ గురించి ఎలాంటి ఆలోచనలు రావడం లేదంటే.. ఆ రిలేషన్ ని వదిలిపెట్టడం మంచిది.

సంకేతం 6
అతనితో వాదించాలని మీరు ఎప్పుడూ ఫీలవలేదు. మీరు కరెక్టే అయినా.. అతనితో వాదించడానికి ఇష్టపడరు. అతను కూడా తను తప్పు అని తెలుసుకుని.. 5నిమిషాల్లోనే సారీ చెప్పేస్తారు. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. ప్రతిరోజూ ముగింపులేని వాదనలు మీ ఇద్దరి మధ్య జరుగుతున్నాయంటే.. మీరు ఏమాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు.

సంకేతం 7
అతను మీకు చాలా ఫ్రీడం ఇస్తారు. ఎప్పుడు నిబంధనలు పెట్టరు. మీరు కూడా అలానే ఉంటారు. అయితే.. ఖచ్చితంగా మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్.

సంకేతం 8
అతనికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. కానీ.. అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు. అలాగే.. అతను కూడా కొన్ని విషయాలను మీ విషయంలో నచ్చదు. కానీ.. మిమ్మల్ని గౌరవిస్తారు. అంటే.. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ని సంకేతం.



Click it and Unblock the Notifications
