For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఓవర్ ప్రొటెక్టివ్ బాయ్ ఫ్రెండ్ యొక్క 10 లక్షణాలను మీరు తప్పక తెలుసుకోవాలి

  |

  మీ బాయ్ ఫ్రెండ్ ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ కలిగిన వ్యక్తా? ఈ హేబిట్ అతన్ని డామినేట్ చేస్తోందా? మీ భాగస్వామి ఓవర్ ప్రొటెక్టివ్ అవునో కాదో తెలుకోవడమెలా? ఈ అలవాట్లు మీ రిలేషన్ షిప్ ను దెబ్బతీస్తున్నాయా?

  అయితే, ఒక విషయం మాత్రం నిజం. అతను, మీపై గాఢమైన ప్రేమను పెంచుకున్నాడు. అందువలన, అతను మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. మీకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని తాపత్రయపడతాడు.

  అయితే, ఇది మీకు ఇష్టమేనా? అతని గుచ్చి గుచ్చి అడిగే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పవలసి వస్తోందా? ప్రతి చిన్న విషయంలో అతని సలహాలను పాటించవలసి వస్తోందా?

  10 SIGNS OF AN OVERPROTECTIVE BOYFRIEND YOU NEED TO KNOW

  ఇటువంటి ప్రవర్తన వలన రిలేషన్స్ షిప్స్ అనేవి పూర్తిగా దెబ్బతింటాయి.అంతులేని ప్రేమను పంచడానికి అలాగే అభద్రతా భావంతో అతిజాగ్రత్తను తీసుకోవడానికి చాలా చిన్న గ్యాప్ ఉంది.ఈ చిన్నపాటి గ్యాప్ ను దాటి తన గర్ల్ ఫ్రెండ్ జీవితంతో ఆటలాడటం స్టార్ట్ చేస్తాడు బాయ్ ఫ్రెండ్.

  అమ్మాయిలు తమకు దగ్గరైన వాళ్ళ దగ్గర నుంచి భద్రతను కోరుకోవడం సహజమే. అయితే, ఏదైనా మితిమీరితే సమస్యలు ఎదురవక తప్పవు. ఒక బాటిల్ లో అంచుల వరకు నీటిని నింపవచ్చు. ఆ తరువాత ఒక చుక్క ఎక్కువ అయినా కూడా నీళ్లు నేలపాలవుతాయి.

  కొన్ని లక్షణాలను గమనించడం ద్వారా మీరు ఓవర్ ప్రొటక్టివ్ బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలను పరిశీలించడం ద్వారా మీ బాయ్ ఫ్రెండ్ ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ కలిగిన వ్యక్తో కాదో తెలుసుకోవచ్చు.

  1. ఆజ్ఞాపిస్తాడు:

  1. ఆజ్ఞాపిస్తాడు:

  తన మాటే మీరు ఎల్లప్పుడూ వినాలని కోరుకుంటాడు. ఆటను మాట్లాడేటప్పుడు మీరు అస్సలు మాట్లాడకూడదు. ఆటను చెబుతున్నది మీరు వినాలి. మీ డే ను ఎలా ప్లాన్ చేయాలో అతడే చెప్తాడు. మీరేం చేయాలో అతడే చెప్తాడు. మీరు వినకపోతే అతను తన అగ్రెస్సివ్ మరియు డామినెన్స్ ను చూపించి మిమ్మల్ని వివిధ రకాలుగా భయపెట్టడానికి చూస్తాడు.

  2. మీ సంభాషణను రహస్యంగా వింటాడు:

  2. మీ సంభాషణను రహస్యంగా వింటాడు:

  మీ ప్రతి ఫోన్ కాల్ ని రహస్యంగా వినేందుకు ప్రయత్నిస్తాడు. మీకు కనబడకుండా దాక్కుని మీ ఫోన్ కాల్స్ ని వినేందుకు ఆసక్తి కనబరుస్తారు. కొన్ని సార్లు మీ మెసేజెస్ ను మరియు మీ సోషల్ మీడియా ఎకౌంట్స్ ను పరిశీలించి మీరెవరెవరితో మాట్లాడారో తెలుసుకుంటారు.

  3. మీరే డ్రెస్ వేసుకోవాలో నిర్ణయిస్తాడు

  3. మీరే డ్రెస్ వేసుకోవాలో నిర్ణయిస్తాడు

  ఈ విషయం మీ బాయ్ ఫ్రెండ్ ఓవర్ ప్రొటెక్టివ్ అన్న విషయాన్ని నిర్దారిస్తుంది. మీరు ఏ ఏ సందర్భాలకు ఏ దుస్తులను ధరిస్తున్నారో గమనిస్తూ ఉంటాడు. కొంతకాలం తరువాత, మీరు ఎటువంటి దుస్తులు ధరించాలో నిర్ణయిస్తాడు. ఇది మీ పెర్సనల్ స్పేస్ ను మాయం చేస్తుంది. మీకు నచ్చే విధంగా డ్రెసింగ్ చేసుకునే అవకాశం మీరు పోగొట్టుకుంటారు.

  4. అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరనుకునేలా చేస్తాడు:

  4. అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరనుకునేలా చేస్తాడు:

  మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తాడు. అయితే, ప్రేమతో చెప్పకుండా రాంగ్ వేలో చెప్తాడు. ప్రేమను అగ్రెసివ్ మరియు ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ ద్వారా తెలియచేస్తాడు. అతని టాక్సిక్ బిహేవియర్ ను మీరతని దృష్టిలోకి తెచ్చినా అదంతా ప్రేమనే అంటాడు. ఆ నేచర్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని గ్రహించడు, గుర్తించడానికి ఇష్టపడడు.

  5. మీరు చెప్పే వాటికి అగ్రెసివ్ గా మారిపోతాడు:

  5. మీరు చెప్పే వాటికి అగ్రెసివ్ గా మారిపోతాడు:

  మీరేం చెప్పినా అతను అగ్రెసివ్ గా మారిపోతాడు. కొన్నాళ్ళకు, ఇది సాధారణ రియాక్షన్ గా తయారవుతుంది. తన ఓవర్ ప్రొటెక్టివ్ యాటిట్యూడ్ ని అలాగే పోసేసివ్ నెస్ ను చూపిస్తుంది ఈ బిహేవియర్. మీరు మృదువుగా మాట్లాడినా, తన నుంచి అగ్రెసివ్ రెస్పాన్స్ మాత్రమే మీకు వస్తుంది.

  6. ఎల్లప్పుడూ తనే కరెక్ట్ అన్న విషయాన్ని చెప్తూ ఉంటాడు:

  6. ఎల్లప్పుడూ తనే కరెక్ట్ అన్న విషయాన్ని చెప్తూ ఉంటాడు:

  ఓవర్ ప్రొటెక్టివ్ బాయ్ ఫ్రెండ్ కి చెందిన ముఖ్య లక్షణం ఇది. తాను ఎల్లప్పుడూ రైట్ అని మీరు రాంగ్ అని తెలియచేయడానికి ప్రతి అవకాశాన్ని వదలడు. తద్వారా, మిమ్మల్ని ఇంఫీరియారిర్టీకి గురిచేస్తాడు. ఈ విషయాన్ని నిర్దారించడానికి తను ఎంతటి దూరమైనా వెళ్తాడు. తనని ప్రూవ్ చేసుకోవడమే అతని లక్ష్యం.

  7. నరనరాల్లో జెలసీ అనేది తిష్ట వేసుకుని కూర్చుంది:

  7. నరనరాల్లో జెలసీ అనేది తిష్ట వేసుకుని కూర్చుంది:

  అతను ఎక్కువగా అసూయ కలిగిన వాడు. తనెంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో వివిధ రకాలుగా తెలియచేస్తాడు. మీరు అతన్ని ఎంత బ్యాడ్ గా ట్రీట్ చేసారో చెప్తాడు. మీరు అతన్ని బ్యాడ్ గా ట్రీట్ చేయకపోయినా అతన్ని మీరు బ్యాడ్ గా ట్రీట్ చేశారని చెప్తూ మిమ్మల్ని బాధ పెడతాడు. అతని ప్రేమతో మీ ప్రేమను కంపేర్ చేస్తాడు. అతను ఆశించినంత ప్రేమను మీరు అందించట్లేదని బాధపడతాడు.

  8. ఇతరులను పొగిడితే తట్టుకోలేడు:

  8. ఇతరులను పొగిడితే తట్టుకోలేడు:

  తమ ప్రేమికురాలు ఇతరులను అతిగా పొగడటాన్ని ఓవర్ ప్రొటెక్టివ్ బాయ్ ఫ్రెండ్స్ తట్టుకోలేరు. మీరు ఎవరినైతే పొగుడుతారో వారిపై ద్వేషాన్ని పెంచుకుంటారు. ఇలా వారి లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది.

   9. అతని చుట్టూనే మీ జీవితం రివాల్వ్ అవ్వాలని కోరుకుంటాడు:

  9. అతని చుట్టూనే మీ జీవితం రివాల్వ్ అవ్వాలని కోరుకుంటాడు:

  అతని చుట్టూనే మీ జీవితం మొత్తం రివాల్వ్ అవ్వాలని కోరుకుంటాడు. అతని అవసరాలను అలాగే డిమాండ్స్ బట్టి మీ జీవిత లక్ష్యాలు అతనిచే నిర్దేశింపబడతాయి. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు మెసేజెస్ ఇస్తూ ఉంటాడు. అతనికి రిప్లై ఇస్తూ మీరు బిజీగా ఉండాలని ఆశిస్తాడు. మీరెంత ముఖ్యమైన పనిలో ఉన్నా అతనికి అనవసరం. అతనికి, క్విక్ రిప్లై మీ నుంచి అవసరం. అలాగే అతని కాల్స్ ను మీరు అవాయిడ్ చేయకుండా అటెండ్ చేయాల్సిందే.

  10. ప్రతిదానికీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తాడు:

  10. ప్రతిదానికీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తాడు:

  మీరు చేసే ప్రతి పనిలో తప్పులను వెతుకుతాడు. అతనికి తెలిసే ఈ విధంగా ప్రవర్తిస్తాడు. తద్వారా, మిమ్మల్ని ఎప్పుడూ కింది స్థాయిలో ఉంచాలని భావిస్తాడు. ఎవరైనా తెలియని వారు మీకు కాల్ చేసినా టెక్స్ట్ చేసినా మిమ్మల్ని బ్లేమ్ చేస్తాడు. లేదా తెలిసినవారు ఏదైనా విషయాన్ని మీతో ప్రస్తావించినా కూడా ఇదే విధంగా రియాక్ట్ అవుతాడు. అపోజిట్ సెక్స్ కి చెందిన వ్యక్తి మీకు కొత్తగా పరిచయమవటం అతనికి నచ్చదు.

  ఈ 10 లక్షణాలు మీ బాయ్ ఫ్రెండ్ ఓవర్ ప్రొటెక్టివ్ అని నిర్థారిస్తాయి. ఈ రిలేషన్ షిప్ పై మీరు మంచి నిర్ణయం తీసుకోవటం మంచిది. లేదంటే, మానసిక అలాగే శారీరక టార్చర్ కి గురవవలసి రావచ్చు.

  English summary

  10 SIGNS OF AN OVERPROTECTIVE BOYFRIEND YOU NEED TO KNOW

  One thing is certain, he is madly in love with you and cares a lot about you and is highly concerned about your whereabouts. But is it okay for you to answer his every query and abide by all of his advice? There are relationships which crumble because of such acts. Boyfriends often cross this thin gap and start strangulating the life of their girlfriend.
  Story first published: Friday, April 13, 2018, 20:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more