కొన్ని వందల సార్లు సెక్స్ చేసినా పొందలేని సంతోషాన్నిపొందుతున్నా - My Story #86

Written By:
Subscribe to Boldsky

నా ఫస్ట్ లవ్ నా స్కూల్ లైఫ్ లోనే మొదలైంది. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు ఇంకో స్కూల్ లోకి మారాను. అప్పుడు నాకు పరిచయం అయిన అబ్బాయి ధరమ్. అతని ఇళ్లు మా ఇంటి పక్కనే ఉంటుంది. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ లో చదివాం. దీంతో ఈజీగా క్లోజ్ అయిపోయాం. ధరమ్ కు నేనంటే అంటే చాలా ఇష్టం. ధరమ్ మా బంధువులబ్బాయి కాకపోయినా నన్ను చాలా ప్రేమించేవాడు.

ఏదైనా చేసేవాడు

ఏదైనా చేసేవాడు

ధరమ్ నన్ను సొంత మనిషిలా చూసుకునేవాడు. నా కోసం ఏదైనా చేసేవాడు. నాకు కూడా చిన్నప్పటి నుంచి ధరమ్ అంటే చాలా ఇష్టం. అతను ఒక్కరోజు స్కూల్ కు రాకున్నా నాకు ఏదో వెలితిగా ఉండేది.

ధరమ్ ని కొట్టేవారు

ధరమ్ ని కొట్టేవారు

సూల్లో మా సారోళ్లు వారు చెప్పింది నేర్చుకుని రానప్పుడు ధరమ్ ని కొట్టేవారు. అప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చేది. అయినా ధరమ్ ఏవి పట్టించుకునేవాడు కాదు. రోజూ ఫుల్ హ్యాపీగా ఉండేవాడు.

ధరమ్ మా ఇంటికి వచ్చేవాడు

ధరమ్ మా ఇంటికి వచ్చేవాడు

నేను ఒక రోజు స్కూల్ కు వెళ్లలేదు. నేను ఎప్పుడు స్కూల్ కు వెళ్లకున్నా కూడా ధరమ్ టెన్షన్ పడేవాడు. నాకు జ్వరం వచ్చినప్పుడు మాత్రమే నేను స్కూల్ కు వెళ్లేదాన్ని కాదు. అప్పుడు స్కూల్ నుంచి సాయంత్రం నేరుగా ధరమ్ మా ఇంటికి వచ్చేవాడు.

ఆంటీ.. పుష్పకు ఏమైంది

ఆంటీ.. పుష్పకు ఏమైంది

నాకు జ్వరం తగ్గిందా లేదా అని మా అమ్మను అడిగేవాడు. అలాగే ఆ రోజు కూడా సాయంత్రం స్కూల్ అయిపోగానే నేరుగా ఇంటికొచ్చాడు. ఆంటీ.. పుష్పకు ఏమైంది ఈ రోజు స్కూల్ కు రాలేదని అడిగాడు. దానికి హెల్త్ బాగాలేదు కొన్ని రోజులు స్కూల్ కు రాదు అని మా అమ్మ చెప్పింది.

పుష్పవతిని అయ్యాను

పుష్పవతిని అయ్యాను

కానీ ధరమ్ నన్ను చూడాలని పట్టుబట్టాడు. అయితే నేను ఆ రోజు పుష్పవతిని అయ్యాను. అందుకే స్కూల్ కు వెళ్లలేదు. రజస్వల అయ్యాక రెండుమూడు రోజుల్లో ఇంట్లో ఏవేవో సంప్రదాయాలు పాటిస్తుంటారు కదా అలాగే మా ఇంట్లో కూడా నన్ను ఒక చోట కూర్చొబెట్టారు.

మినీ యుద్ధమే చేశాడు

మినీ యుద్ధమే చేశాడు

నాకు ధరమ్ మాటలు వినపడుతున్నాయి. నన్ను చూడాలని తను మా మమ్మీతో మినీ యుద్ధమే చేశాడు. చివరకు మా అమ్మ ధరమ్ వాళ్ల అమ్మను కేక వేసి పిలిస్తే వచ్చింది. ధరమ్ వాళ్ల అమ్మకు అసలు విషయం తెలుసు. దాంతో ధరమ్ ను చివరకు వాళ్ల అమ్మ నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లింది.

ఒక్క క్షణం కనిపించకుంటే

ఒక్క క్షణం కనిపించకుంటే

ఆ రోజు నాపై ధరమ్ చూపిన ప్రేమ నాకు ఇప్పటికీ గుర్తుంది. నేనంటే అంత ఇష్టం వాడికి. ధరమ్ కు మూడు రోజుల వరకు నరకం కనిపించింది. నేను ఒక్క క్షణం కనిపించకుండా ఉంటానే విలవిలలాడిపోతాడు. అలాంటిది మూడు రోజుల అనేసరికి ధరమ్ మూడేళ్ల మాదిరిగా అనిపించింది అట.

ఆ ఫంక్షన్ కు ధరమ్ కూడా వచ్చాడు

ఆ ఫంక్షన్ కు ధరమ్ కూడా వచ్చాడు

నా పుష్పవతి ఫంక్షన్ మా వాళ్లు గ్రాండ్ గా చేశారు. ఆ ఫంక్షన్ కు ధరమ్ కూడా వచ్చాడు. నాతో పాటు నిల్చొని ఫొటోలు కూడా దిగాడు. నేను మళ్లీ స్కూల్ కు బయల్దేరాను. ఏంటి పుష్ప ఈ ఫంక్షన్.. అసలు నీకు ఏమైంది నాకు ఎవ్వరూ కూడా సరిగ్గా చెప్పలేదు అన్నాడు.

వాళ్ల సైడ్ ఇలాంటి ఫంక్షన్స్ లేవంట

వాళ్ల సైడ్ ఇలాంటి ఫంక్షన్స్ లేవంట

ధరమ్ వాలింట్లో ఎవరూ ఆడపిల్లలు లేరు. ధరమ్ వాళ్లది రాయలసీమ. వాళ్ల సైడ్ ఇలాంటి ఫంక్షన్స్ కూడా జరుపుకోరంట. దీంతో ధరమ్ కు పుష్పవతి అంటే ఏమిటి.. ఈ ఫంక్షన్ ఎందుకు చేస్తారనే విషయాలు అతనికి తెలియవు.

ధరమ్ కు అన్నీ చెప్పేశాను

ధరమ్ కు అన్నీ చెప్పేశాను

నేను ధరమ్ కు అన్నీ వివరించాను. పూస గుచ్చినట్లుగా చెప్పాను. ఏ ఆడపిల్ల అలా అబ్బాయి ఆ ఏజ్ లో దాని గురించి వివరించదేమో కానీ నేను మాత్రం ధరమ్ కు అన్నీ చెప్పేశాను. ఇంకో విషయం ఏమిటంటే నా పేరు కూడా పుష్ప కాబట్టి నేను పెద్దమనిషి అయ్యాక నా పేరు పుష్పవతిగా మారిందనుకున్నాడు ధరమ్.

ఫేర్ వెల్ పార్టీ

ఫేర్ వెల్ పార్టీ

నా పేరుకు ఆ ఫంక్షన్ కు సంబంధం లేదని ధరమ్ కు వివరించాను. మేము టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఫేర్ వెల్ పార్టీ జరిగింది. ఫంక్షన్ లో అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. స్టేజీపై మా ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తున్నారు. అందరూ డ్యాన్స్ చూస్తున్నారు.

ధరమ్ చూపులు గుచ్చుకున్నాయి

ధరమ్ చూపులు గుచ్చుకున్నాయి

చుట్టూ డీజే మోగిపోతుంది. కానీ నాకు ధరమ్ చూపులు వెనుకా నుంచి గుచ్చుకున్నాయి. తను తన ఫ్రెండ్ పై చెయ్యేసి నా వైపే చూస్తున్నాడు. కళ్లతో సైగలు చేశాడు. కంటి చూపులతోనే ఇద్దరం కొద్ది సేపు మాట్లాడుకున్నాం. ధరమ్ నాకు అంతకు ముందు కేవలం ఫ్రెండ్ మాత్రమే.

కను బొమ్మలను తిప్పాడు

కను బొమ్మలను తిప్పాడు

కానీ ఫేర్ వెల్ డే న మాత్రం నాకు ఎందుకో మొట్టమొదటి సారిగా ధరమ్ పై చాలా ఫీలింగ్స్ కలిగాయి. అప్పటికే మా ఫ్రెండ్స్ అందరికీ లవర్స్ ఉన్నారు. ధరమ్ నా వైపు చూస్తూ కను బొమ్మలను తిప్పాడు. నేను కనుబొమ్మలను పైకి ఎగిరేశాను.

కన్ను కొట్టాను

కన్ను కొట్టాను

ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. అతను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కు నేను ఫిదా అయిపోయాను. తర్వాత అతని వైపు చూస్తూ కాస్త స్మైల్ ఇస్తూ కన్ను కొట్టాను. దెబ్బకు విలవిలలాడిపోయాడు ధరమ్. తన పక్కనున్ను ఫ్రెండ్ ని కౌగిలించుకుంటూ అనందంలో మునిగిపోయాడు.

వాళ్ల మాటల్ని నిజం చేద్దాం

వాళ్ల మాటల్ని నిజం చేద్దాం

ఫంక్షన్ అయిపోయాక ఇంటికి వెళ్లేటప్పుడు ధరమ్ ప్రపోజ్ చేశాడు. స్కూల్ మొత్తం మనం ఇద్దరం లవర్స్ అని అనుకుంటూ ఉన్నారు అన్నాడు. ఇప్పటికైనా వాళ్ల మాటల్ని నిజం చేద్దాం అన్నాడు. ఒకే అన్నాను.

పరీక్షలు జరిగనన్నీ రోజులు

పరీక్షలు జరిగనన్నీ రోజులు

పదో తరగతి పబ్లిక్ పరీక్షలప్పుడు తనే సైకిల్ పై ఎగ్జామ్ సెంటర్ కు తీసుకెళ్లేవాడు. పరీక్షలు జరిగనన్నీ రోజులు ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేశాం. పరీక్ష పూర్తి అయి సైకిల్ పై ఇంటికి వచ్చేటప్పుడు రోడ్డు పక్కన సైకిల్ ఆపి ముద్దులు పెట్టుకునేవాళ్లం.

ఒక్క ముద్దు కోసం

ఒక్క ముద్దు కోసం

అప్పుడు ఒక్క ముద్దు పెట్టుకున్నప్పుడు వచ్చిన కిక్ జీవితంలో ఇంకెందులోనూ రాదేమో. ఒక్క ముద్దు కోసం మేము అప్పుడు పడ్డ అగచాట్లు నాకు, ధరమ్ కు మాత్రమే తెలుసు. మా ఇద్దరిదీ స్వార్థం లేని ప్రేమ. కానీ మా ఇంట్లో వాళ్లకు మా ప్రేమ నచ్చలేదు.

బలవంతంగా పెళ్లి

బలవంతంగా పెళ్లి

నాకు చదవాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. కానీ నాకు పదో తరగతి పూర్తవ్వగానే మా ఇంట్లో వాళ్లు ధరమ్ విషయం తెలిసి బలవంతంగా పెళ్లి చేశారు. ఇప్పటికీ నేను మా పుట్టింటికి వెళ్లినప్పుడల్లా ధరమ్ గుర్తొస్తుంటాడు. అతన్ని చూస్తే నాకు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి.

సెక్స్ లో పాల్గొంటే ఐదు నిమిషాలే సంతోషం

సెక్స్ లో పాల్గొంటే ఐదు నిమిషాలే సంతోషం

వాటిని తలచుకుంటే నాకు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. మా మధ్య శృంగారం లేదు. కానీ స్వచ్ఛమైన ప్రేమ ఉంది. సెక్స్ లో పాల్గొంటే ఐదు నిమిషాలు సంతోషంగా ఉంటారేమో నిజమైన ప్రేమ మనస్సులో ఉన్నప్పుడు కొన్ని వందల సార్లు సెక్స్ చేసిన కూడా పొందలేని ఆనందాన్ని పొందొచ్చు.

English summary

i met my first love when i changed my school in the third standard

People say that one can’t forget his first love- that’s how beautiful it is. I met my first love when I changed my school in the third standard. That’s when it all started. In the beginning, it was tough- new school, new environment and no friends. I kind of felt lonely. I became friends with this guy from my school who also happened to be my classmate. And soon this friendship turned to love (my first childhood love).