For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడకగదిలో ఆ పని చేయాలంటే భయమేస్తోందా... అయితే ఇలా ట్రై చేయండి...

|

పెళ్లికి ముందు శృంగారంలో ఎప్పుడెప్పుడు పాల్గొందామా.. పడకగదిలో పార్ట్ నర్ తో ఎలా ఎంజాయ్ చేద్దామా అని.. ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు చాలా మంది యువత. అయితే బెడ్ రూమ్ లో మంచం దగ్గరకు చేరుకోగానే కొందరికి ఎక్కడ లేని ఆందోళన మొదలవుతుంది.

తాము తమ పార్ట్ నర్ ను సుఖపెడతామా లేదా అనే భయం వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి మానసిక సమస్యలే ఆ కార్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో వాటిని ఎలా అధిగమించాలో.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతుంటారు కొందరు జంటలు.

అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే.. ఎలాంటి మెడిసిన్ మరియు హార్మోన్ల ఇంజక్షన్ల అవసరం లేకుండానే.. ఈ సమస్యకు సింపుల్ గా చెక్ పెట్టేయ్యొచ్చు. ఇంతకీ అవెంటో మీరే చూసెయ్యండి. మీ భాగస్వామితో బంధాన్ని మరింత బలంగా మార్చుకోండి...

'నా భర్త చేసేది నచ్చట్లేదు.. తనకు దూరంగా వెళ్దామనుకుంటున్నా... కానీ'

ఎంత ఎక్కువ మాట్లాడితే..

ఎంత ఎక్కువ మాట్లాడితే..

మీరు పడకగదిలో మీ భాగస్వామితో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత మంచిది. మీకు ఆ కార్యంలో ఉన్న ఆందోళనలను అధిగమించడానికి.. మీకు ఉన్న సందేహాల గురించి మీ భాగస్వామితో షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇలాంటి విషయాల గురించి మీ పార్ట్నర్ తో చెప్పుకోకపోతే.. మీరు చాలా కాలం బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి మీ పార్ట్నర్ తో వీలైనంత ఎక్కువ ఓపెన్ గా ఉండండి. మీ సమస్యలను, బాధలను, సంతోషాలన్నింటినీ పంచుకోండి. అంతేగానీ మీరు ఎక్కువగా నిశ్శబ్దంగా, మౌనంగా ఉండకండి. ఎందుకంటే ఏ విషయమైనా చెబితేనే పూర్తిగా తెలిసేది. కాబట్టి మీ సమస్యలన్నింటినీ వారితో పంచుకోండి. దీని వల్ల మీకు మంచి పరిష్కారం లభిస్తుంది.

కలిసి స్నానం చేయడం..

కలిసి స్నానం చేయడం..

మీ భాగస్వామి మసాజ్ వంటివి ఇష్టం లేకపోతే.. మీరిద్దరూ కలిసి స్నానం చేయడం వంటివి చేయండి. దీని వల్ల మీలో కోరికలు కచ్చితంగా రెట్టింపు అవుతాయి. మీకు రొమాంటిక్ ఫీల్ ఇవ్వడమే కాదు.. మీరు ఆ కార్యంలో రెచ్చిపోయేలా చేస్తాయి. అయితే ఇవన్నీ మీ ఇద్దరికీ ఒకే అనుకున్నప్పుడే చేయాలి. ఇలా చేస్తే మీరు పడకగదిలో పంజా విసరొచ్చు.

బెడ్ రూమ్ లో ఇలా చేయండి..

బెడ్ రూమ్ లో ఇలా చేయండి..

మీ ఇద్దరికీ పడకగదిలో మూడ్ రావాలంటే.. మంచి రొమాంటిక్ వీడియోలను చూడండి. అందులోనూ మంచి ప్రేమ కథా చిత్రాలను కలిసి చూడండి. దీని వల్ల మీ పార్ట్నర్ సినిమా వారి ప్లేసులో మిమ్మల్ని ఊహించుకోవచ్చు. మీరు కూడా అలాగే చేస్తే.. మీ ఇద్దరి మధ్య సంబంధం మరింత సాన్నిహిత్యంగా మారిపోతుంది.

నిపుణుల సహాయం..

నిపుణుల సహాయం..

పైన తెలిపిన చిట్కాలతో బెడ్ రూమ్ లో మీరు ఈ సమస్యను అధిగమించకపోతే.. మీరు ఏ మాత్రం మొహమాటపడకుండా నిపుణుల సహాయం తీసుకోండి. ఎందుకంటే ఇది రహస్యమైన విషయమేమీ కాదు. ఇలాంటి సమస్యలను మీరు ఆరోగ్య, మానసిక నిపుణులతో ఎంత ఓపెన్ గా చెబితే.. అంత మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఏ మాత్రం భయం పెట్టుకోకుండా.. మీ సమస్యను వారికి చెబితే.. వారు మీకు కచ్చితంగా పరిష్కారం చూపొచ్చు.

పెళ్లికి ముందు ‘ఆ'విషయాల గురించి అడగడం అస్సలు మరువకండి...!

థెరపీకి వెళ్లొచ్చు..

థెరపీకి వెళ్లొచ్చు..

మీరు బెడ్ రూమ్ లో ఆందోళనను తగ్గించుకునేందుకు థెరపీ సహాయం కూడా తీసుకోవచ్చు. దీని వల్ల మీ ఒత్తిడికి సంబంధించిన సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. అలాగే పడకగదిలో మీ పర్మార్ఫెన్స్ మరింత పెరుగుతుంది. కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు అపాయిట్మెంట్ తీసుకుని వారి వద్దకు వెళ్లండి.

అనేక ప్రయోజనాలు..

అనేక ప్రయోజనాలు..

పైన చెప్పిన చిట్కాలను ఫాలో అయితే మీకు అనేక ప్రయోజనాలు దక్కుతాయి. అంతేకాదు పడకగదిలో మీరు ఏమైతే చేయాలని ఊహించుకుంటారో.. అవన్నీ చాలా సులభంగా చేసేయొచ్చు.

లైంగిక జీవితం ఆనందంగా..

లైంగిక జీవితం ఆనందంగా..

ఒకవేళ మీరు ఇలాంటి చిన్న విషయాలను వదిలేస్తే మీరు భారీగా నష్టపోతారు. కాబట్టి మీలో మీరు మదనపడకుండా ఈ ప్రయత్నాలను చేసి చూడండి. సాధారణంగా జాబ్ లో ఉండే ఒత్తిడి, ఆర్థిక సమస్యలు ఇతర కారణాల ఆ కార్యంలో పాల్గొనేందుకు ఆందోళన పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన సూచనలను పాటించండి. ఇలా చేస్తే మీ సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది. మీ లైంగిక జీవితాన్ని హాయిగా గడపొచ్చు.

గమనిక : పైన తెలిపిన సమాచారం మొత్తం మానసిక నిపుణులు, పలు అధ్యయనాల ప్రకారమే మీకు అందించాం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసమే. కాబట్టి మీ లైంగిక ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా మంచి వైద్యులను సంప్రదించడం మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోగలరు.

English summary

How to Handle Relationship Anxiety in Telugu

Here we are talking about the how to handle relationship anxiety in Telugu. Have a look
Story first published: Tuesday, May 11, 2021, 9:40 [IST]