For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. కరోనా కాలంలో తను నాతో మళ్లీ కలవాలంటోంది..’

పెళ్లి తర్వాత మాజీ ప్రియుడితో అలా చేయొచ్చా...

|

వారిద్దరూ ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే మనం చూసే సినిమాల్లో మాదిరిగానే వీరి ప్రేమ కథకు పెద్దలు ఒప్పుకోలేదు. ఇంతలో ఇద్దరిలో ఒకరికి విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు మంచి అవకాశం వచ్చింది.

Is it wrong to be in contact with an ex-boyfriend after marriage?

ఇంతలో తనకు తల్లిదండ్రులు బలవంతపు వివాహం చేశారు. అయితే తన మనసులో ఉన్న ప్రియురాలిని తను మరచిపోలేదు. ఇప్పుడు కరోనా పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వడంతో ఇంటికొచ్చాడు.

Is it wrong to be in contact with an ex-boyfriend after marriage?

ఈ విషయం తెలుసుకున్న తన ప్రియురాలు కూడా పెళ్లైనప్పటికీ తనను చూడటానికి ఆనందంతో తన దగ్గరికి వచ్చింది. అయితే వారిద్దరూ కలిసిన వెంటనే పాతక్షణాలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. అంతే తనకు పెళ్లి జరిగి పిల్లలున్నారన్న సంగతిని కూడా మరిచిపోయి.. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో.. తనతో చెట్టపట్టాలేసుకుని తిరిగింది.

Is it wrong to be in contact with an ex-boyfriend after marriage?

అంతేకాదు తన ప్రస్తుత భాగస్వామికి విడాకులిచ్చి తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తుంది. ఈ సందర్భంగా వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోనని భయపడుతూ వారి వివరాలను వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పడు తెలుసుకుందాం...

తాళి కట్టినవాడితో రొమాన్స్ చేయలేకపోతున్నా.. కానీ కడుపు వచ్చింది.. ఇప్పుడేం చేయను..తాళి కట్టినవాడితో రొమాన్స్ చేయలేకపోతున్నా.. కానీ కడుపు వచ్చింది.. ఇప్పుడేం చేయను..

ఓ కుర్రాడితో..

ఓ కుర్రాడితో..

హాయ్.. నా వయసు 26 ఏళ్లు. నేను రెండు సంవత్సరాల నుండి ఒకరితో రిలేషన్ షిప్ లో ఉన్నాను. తను నా కంటే రెండేళ్లు పెద్ద. మేమిద్దరం కాలేజీలో చదువుకునే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

విదేశాలకు..

విదేశాలకు..

అయితే కాలేజీ చదువులు ముగిసిన వెంటనే ఫారిన్ లో జాబ్ చేసే ఛాన్స్ రావడంతో కొన్నిరోజులు విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అయితే, నేను తనతో నిత్యం ఫోన్ లో టచ్ లోనే ఉండేదాన్ని. అయితే నేను రావడం ఆలస్యం కావడంతో తన తల్లిదండ్రులు తనకు బలవంతపు వివాహం చేశారు. దీంతో మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

ప్రేమ తగ్గలేదు..

ప్రేమ తగ్గలేదు..

అయితే తనకు పెళ్లి అయినప్పటికీ.. మా ఇద్దరి మధ్య దూరం పెరిగినప్పటికీ.. ప్రేమ అనేది ఏ మాత్రం తగ్గలేదు. తన పెళ్లి తర్వాత నేను చాలా రోజులు తీవ్ర ఒత్తిడిలో పడిపోయాను. ఇటీవలే నార్మల్ లైఫ్ లోకి వచ్చాను.

పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఆ క్షణాలను హాయిగా ఆస్వాదించొచ్చా...పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఆ క్షణాలను హాయిగా ఆస్వాదించొచ్చా...

ఈ లాక్ డౌన్ టైమ్ లో..

ఈ లాక్ డౌన్ టైమ్ లో..

కరోనా కారణంగా నేను కూడా ఇండియా వచ్చి.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్న సమయంలో తను సడన్ గా కాల్ చేయడంతో నా మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. అయితే తను మాత్రం ఆ పెళ్లంటే తనకు ఇష్టం లేదని.. తన ప్రస్తుత భాగస్వామిని వదిలి మళ్లీ నన్ను వివాహమాడతానని చెబుతున్నాడు.

తనంటే ఇష్టమే..

తనంటే ఇష్టమే..

నాకు కూడా తనంటే ఇష్టమే. కానీ తను ఇప్పుడు వేరొకరికి లైఫ్ పార్ట్ నర్ గా ఉన్నాడు. అంతేకాదు ఇద్దరు పిల్లలకు తండ్రిగా ఉన్నాడు. దీంతో నాకు గందరగోళంగా ఉంది. వారి లైఫ్ లో నేను చిచ్చు పెట్టుకోవాలనుకోవడం లేదు. ఈ విషయాన్ని నేను తనకు డైరెక్టుగా చెప్పలేను. ఈ మాటలు తనను ఎంతగానో బాధపెడతాయి. కాబట్టి నేను ఏమి చేయాలో చెప్పగలరు.

వివాహ బంధంలో..

వివాహ బంధంలో..

మీ మాజీ ప్రియుడు ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అయితే అందులో నుండి బయటకు రావడం అనేది అంత సులభం కాదు. అందులోనూ వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంటున్నారు. కాబట్టి మీ గురించి వారితో చెబితే.. వారి మధ్య గొడవలు ప్రారంభమవుతాయి.

ఈ రాశుల వారు సులభంగా క్షమిస్తారు... కానీ పగ పెంచుకుంటూ పోతారు...!ఈ రాశుల వారు సులభంగా క్షమిస్తారు... కానీ పగ పెంచుకుంటూ పోతారు...!

భావోద్వేగ బంధాలు..

భావోద్వేగ బంధాలు..

ఎందుకంటే ఇలాంటి బంధాలన్నీ చాలా భావోద్వేగంతో ముడిపడి ఉంటాయి. అలాంటి వాటిని తెంచుకుని బయటకు రావడమనేది.. మాటల్లో చెప్పినంత సులభం మాత్రం కాదు. కానీ మీరు మీ పేరేంట్స్ ను ఒప్పించొచ్చు. కానీ, వారిని ఆ బంధాలను వదులుకుని రమ్మనడం మాత్రం కష్టం.

తొందరపడకుండా..

తొందరపడకుండా..

ఇలాంటి సమయంలో మీరు తొందరపడకండి. ఇంకా కొంత సమయం వేచి చూడండి. ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడులేయాలి. చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా తను కుటుంబసభ్యులతో మాట్లాడి.. విడిపోవడానికి.. విడాకులు తీసుకోవడానికి.. మీకు లైన్ క్లియర్ కావడానికి కొంత సమయం పడుతుంది.

మీ ప్రయత్నంగా..

మీ ప్రయత్నంగా..

అయితే మీ మాజీ ప్రియుడికి వివాహ బంధాన్ని విడిచిపెట్టి రావద్దని చెప్పేందుకు ప్రయత్నించండి. మీరు కూడా మీ స్నేహితులు, ఇతర వ్యక్తులను కలవడం ద్వారా వారిని మరచిపోవడానికి ప్రయత్నించవచ్చు. కొత్త వ్యక్తులను పరిచయడం చేసుకోవడం ద్వారా మీ లైఫ్ కొత్తగా మార్చుకోవచ్చు. ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. తల్లిదండ్రుల నుండి పిల్లలను దూరం చేయడం అనేది మంచి విషయం కాదు. ఈ మేరకు మీరే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి.

English summary

Is it wrong to be in contact with an ex-boyfriend after marriage?

Here we talking about is it wrong to be in contact with an ex-boyfriend after marriage. Read on.
Story first published:Tuesday, December 8, 2020, 17:43 [IST]
Desktop Bottom Promotion