Latest Updates
-
అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ -
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే..
దూకుడు-నిష్క్రియాత్మక స్వభావం ఉన్న భాగస్వామితో వ్యవహరించడానికి 10 టిప్స్
దూకుడు-నిష్క్రియాత్మక స్వభావం ఉన్న మనుష్యులు వారి కోపాన్ని, నిరాశనీ సున్నితం గా వ్యక్తపరుస్తూ ఉంటారు.ఒకవేళ మీ భాగస్వామి ఇలాంటి వారైతే కనుక అంతర్లీనం గా వారిలో ఉన్న కోపం మీ మీద చూపించడం వల్ల మీలో నిరాశ పెరుగుతుంది.
మీ భాగస్వామి స్వభావాన్ని మార్చి వారు కూడా తమ భవాలని చక్కగా వ్యక్తపరిచేలా చెయ్యడానికి క్రింద ఇచ్చిన టిప్స్ బహూశా మీకు ఉపయోగపడచ్చు.

దుడుకు -నిష్క్రియాత్మక స్వభావం ఉన్న వ్యక్తులని గుర్తించడం
వ్యక్తుల ప్రవర్తన ని బట్టి వారి నిజ స్వభావాన్ని అంచనా వేయవచ్చు. మాట్లాడకుండా నిశ్శబ్దం గా ఉండి సాధిస్తుండటం,మిమ్మల్ని పొగడకపోవడం, మిమ్మల్ని విమర్శించడం(మీకు సహాయం చేస్తున్నము అన్న పేరుతో),అస్పష్టమైన ద్వంద్వార్ధాలతో కూడిన సంభాషణ,చిన్న చిన్న సహాయాలు కూడా చెయ్యకపోవడం, మీకు కావాలని ద్రోహం చెయ్యడం..ఇవన్నీ మీకు ఎక్కడో చూసినట్లనిపిస్తోందా??అయితే మీ భాగస్వామి దుడుకు -నిష్క్రియాత్మక స్వభావం ఉన్న వ్యక్తే.

కోపం మీ వల్లే వస్తోందన్న వాదన కి మోసపోకండి
ఎందుకు అంత కోపం గా ఉన్నావని మీ భాగస్వామి మిమ్మల్ని అడిగి, అసలు ఈ నెగెటివ్ భావాలన్నీ మీలో అంతర్గతం గా ఉన్నాయనచ్చు.కానీ చాలా మంది దుడుకు స్వభావం ఉన్నవాౠ తాము తమకి తెలీకుండా ఎదుటివారిలో కోపాన్ని కలుగచేస్తున్నామని తెలుసుకోరు.అందువల్ల మీ భాగస్వామి తెలిసి తెలిసి మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోవద్దు.కోపానికి కారణం "నేను" కదా అని అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు.నిష్క్రియాత్మకమైన-దుడూకు స్వభావం ఈ రెండూ పరస్పర విరుద్ధ ప్రవర్తనలు, వీటిని వెంటనే గుర్తించాలి

కాం గా ఉండండి
మీలో ఉబికి వస్తున్న కోపానికి కారణం మీరు కాదు అని తెలిసినా కూడా కాం గా ఉండండి. ఎందుకంటే మీ భాగస్వామి భావోద్వేగాలతో ప్రతిస్పందించి ఈ కోపానికి మరింత ఆజ్యం పోసే వ్యక్తి అయితే కనుక చాలా జాగ్రత్త. వారికి కావాల్సింది మీకు మరింత కోపం తెప్పించడమే.దానివల్ల వారు బాధితుడి పాత్ర పోషించవచ్చు అనుకుంటారు.

తల్లితండ్రుల పాత్ర పోషించవద్దు
చాలా మంది దుడూకు-నిష్క్రియాత్మక స్వభావం ఉన్న వ్యక్తుల ప్రవర్తన కి కారణం వారి చిన్నతనం తో ముడి పడి ఉంటుంది. అంటే మీ భాగస్వామి చిన్నప్పటి వేషాలని మిమ్మల్ని పేరెంట్ స్థానం లో ఉంచి వేస్తున్నారన్నమాట.చిన్న చిన్న పనులు కూడా మీ భాగస్వామి చెయ్యడానికి నిరాకరిస్తున్నారని ఇంటి పనులన్నీ మీద వేసుకోకండి.మీ అనుబంధం నిలవాలంటే మీరిద్దరూ ఒకరినొకరు ఎదిగిన వ్యక్తులుగా పరిగణించుకోవాలే తప్ప తల్లి/తండ్రి-పిల్లవాడి పాత్రలు కాదు.

మీరేమి అనుకుంటున్నారో జాగ్రత్తగా చర్చించండి
మీ ఆందోళనలని వారితో చర్చించేటప్పుడు నువ్వెప్పుడూ ఇంతే అని నిందిచడం మాని వారి ప్రవర్తన మీకు ఎలా బాధ కలిగిస్తోందో ఉదాహరణతో చెప్పండి.దుడుకు-నిస్క్రియాత్మక స్వభావం ఉన్న వ్యక్తుల భావ వ్యక్తీకరణ లోపం వల్ల వారికి తెలీకుండానే మిమ్మల్ని అదుపులో ఉంచుదామని చూస్తారు. కానీ వారికి మీరు ఎంత బాధ పడుతున్నారో తెలిస్తే అది చాలా శక్తివంతం గా పనిచేస్తుంది వారి మీద.కానీ దుడుకు-నిష్క్రియాత్మక స్వభావం ఉన్న వ్యక్తులు మీకు హర్ట్ అవడానికి హక్కు లేదనీ,మీరే దానికి బాధ్యులనీ సాకులు వెతకడానికి ప్రయత్నిస్తారు.

ధ్రుడం గా చెప్పండి
మన బంధం లో నువ్వే ఒక సమస్య అని తీర్పు చెప్తున్నట్లు కాకుండా నీ ప్రవర్తన వల్ల నేను ఇలా మానసికం గా గాయపడ్డాను అని ధ్రుడం గా చెప్పడం మంచిది.

రిలేషన్ షిప్స్ స్పెషలిస్టు ని కలవండి
దుడుకు-నిష్క్రియాత్మక స్వభావాన్ని నటిస్తున్న భాగస్వామిని కలిగిఉన్న దంపతులు బయటివారి సహకారం చాలా అవసరం.రిలేషన్ షిప్ కౌన్సిలర్ సహాయంతో కొన్ని సెషన్స్ తరువాత మీకు భావవ్యక్తీకరణ,మీ మీద మాకు అవగాహన కలుగుతాయి. ఒకవేళ దుడుకు-నిష్క్రియాత్మక స్వభావం ఉన్న మీ భాగస్వామి కౌన్సెలర్ ని కవడానికి ఇష్టపడకపోతే మీరొక్కరైనా వెళ్ళి కలవచ్చు.దీనివల్ల మీకు మీ దుడుకు-నిష్క్రియాత్మక స్వభావం ఉన్న మీ భాగస్వామి తో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది.

మీ భాగస్వామి కి స్వీయ గౌరవాన్ని పెంచండి
చాలమంది దుడుకు-నిష్క్రియాత్మక స్వభావం ఉన్న వ్యక్తులకి తమ మీద తమకి గౌరవం ఉండదు. వారు తమ భావాలని వ్యక్తపరచడానికి సిగ్గుపడతారు.అందువల్ల అలాంటి వ్యక్తులకి తమపై తమకి నమ్మకం కలిగించాలి.ఒక్కోసారి వారు చేసిన చిన్న చిన్న సహాయాలకి కూడా పొగిడితే వారు ఆనందపడి స్వీయ గౌరవం పెంచే మరిన్ని పనులు చెయ్యగలుగుతారు.(ఏదైనా హాబీ ని పెంపొందించుకోవడం,ఫిట్నెస్స్ ని ఒక రొటీన్ గా మార్చుకోవడం లాంటివన్నమాట)

అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి
వ్యక్తుల దుడుకు-నిష్క్రియాత్మక స్వభావానికి ఏదో ఒక కారణం ఉంటుంది. అలాంటి వ్యక్తులు అసలు తాము అలా ప్రవర్తించడానికి కారణం శోధించగలిగితే మీ బంధం ఆనందంగా ఆరోగ్యంగా నిలుస్తుంది.వారితో చర్చించేటప్పుడు వారు తమ భావాలని వ్యక్తీకరిస్తే చాలా ఉపయోగకరం.కానీ ఇవన్నీ నిపుణుడైన థెరపిస్ట్ ఆధ్వర్యం లో జరగాలి.కానీ కొంత మంది దంపతులు ఇంట్లో తమలో తాము చర్చించుకుంటారు.

అవసరమయితే వదిలి వెళ్ళడానికి సిద్ధం కండి
ఎంత ప్రయత్నించినా ఒకోసారి దుడుకు-నిష్క్రియాత్మక స్వభావం ఉన్న భాగస్వామితో బంధం నిలవదు.ఇలాంటి స్వభావాన్ని గుర్తించకపోతే మీరు మానసికంగా గాయపడటమే కాకుండా మీపై మీకు నమ్మకం కూడా పోతుంది.వారి ప్రవర్తన ని మార్చుకొవడానికి సిద్ధంగా లేనివారిని విడిచిపెట్టి వెళ్ళడమే మార్గం.



Click it and Unblock the Notifications











