Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాల్సిన రిలేషన్ షిప్ లెసెన్స్
రిలేషన్ షిప్ సలహా కావాలంటే ఈ జనరేషన్ వాళ్లు ముందుగా చేసే పని ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం. లేదా బుక్స్, సినిమాల ద్వారా రిలేషన్ షిప్ గురించి తెలుసుకుంటారు. లేదా ఫ్రెండ్స్, బంధువులు, సన్నిహితులను అడుగుతారు. కానీ.. తల్లిదండ్రులను మాత్రం అడగరు. ఎందుకు ?
ఎందుకంటే.. రిలేషన్ షిప్ ప్రాబ్లమ్స్ తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరని చాలా మంది భావిస్తారు. కానీ ఇది తప్పు. తల్లిదండ్రులు ఎలాంటి సమస్యకైనా సింపుల్ పరిష్కారం చెబుతారు. ఎలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని చాలా చక్కగా వివరిస్తారు. కాబట్టి తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాల్సిన రిలేషన్ షిప్ లెసెన్స్ ఏంటో మీరే చూడండి..

చిన్న విషయాలు
మీ నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సరికి మీ అమ్మ కప్పు కాఫీ, గ్లాసు నీళ్లతో రెడీగా ఉంటుంది. రాత్రిపూట మీ కోసం ఐక్రీం తేవడం, అనారోగ్యంతో ఉన్నప్పుడు అర్థరాత్రి అయినా సరే మెడిసిన్స్ తీసుకురావడం, ఇలాంటి అలవాట్లన్నీ మీ నాన్నకు న్యాచురల్ గా వచ్చిన లక్షణాలు. ఇవన్నీ చిన్న విషయాలే అయినా.. చాలా సంతోషాన్ని, బాధ్యతను నేర్పుతాయి.

కుటుంబంతో గడపడం
మన తల్లిదండ్రులు వాళ్ల తల్లిదండ్రులు సమయం గడిపేవాళ్లు. ఎంత బిజీగా ఉన్నా.. వాళ్లతో కలిసి కప్పు కాఫీ అయినా తాగుతారు. లేదా కాసేపు టీవీ చూస్తారు. పండుగలు, బర్త్ డేలు వాళ్లతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే.. కుటుంబంతో కూడా కాసేపు గడపాలని చెప్పే ఈ విషయం మనం గ్రహించాలి.

గొడవలు
మన పేరెంట్స్ చాలా సందర్భాల్లో చిన్న చిన్న కారణాల వల్ల గొడవ పడుతూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద విషయాలకు కూడా గొడవపడుతూ ఉంటారు. కానీ.. ఈ గొడవల్లో ఎప్పుడూ కూడా ఐ హేట్ యు, నువ్వు నాకు అవసరం లేదు వంటి పదాలు ఉపయోగించరు. వాళ్ల రిలేషన్ కట్ చేసుకునే విధంగా ఎప్పుడూ మాట్లాడరు. ఇలాంటి విషయాలు మన జనరేషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి.

ఆదాయానికి తగ్గట్టు
మనకు వస్తున్న ఆదాయానికి తగ్గట్టు లైఫ్ లీడ్ చేసే అలవాట్లు మన పేరెంట్స్ నుంచే నేర్చుకోవాలి. వాళ్లు ఏదైనా కొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కారు కొనాలంటే.. మైలేజ్ గురించి ఆలోచిస్తారు. చివరికి మంచి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫన్ తో పాటు, ఆర్థిక విషయాల గురించి కూడా ఆచితూచి అడుగేసే ఆలోచనలు మనం నేర్చుకోవాలి.

రోజు ఎలా గడిచింది
కొన్ని సందర్భాల్లో అమ్మ నాన్నను ఎలా ఉంది రోజంతా, వర్క్ ఎలా ఉంది అంటూ ప్రశ్నలతో విసిగిస్తోందని మనం ఫీలవుతూ ఉంటాం. కానీ.. ఇలా రోజంతా జరిగిన అనుభవాలు పంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందనే లాజిక్ మనం కూడా కంపల్సరీ అలవరచుకోవాలి.

ప్రేమ
మన పేరెంట్స్ రోజుకి ఎన్ని సార్లు ఐ లవ్ యు అని చెప్పుకుంటారు. చాలా తరచుగా కదూ. కానీ.. ఇద్దరూ కలిసి టీవీ చూడటం, షాపింగ్ చేయడం, సాయంత్రం సరదాగా బయటకు వెళ్లడం వంటివి అన్నీ వాళిద్దరి మధ్య ప్రేమను తెలుపుతాయి. ఐ లవ్ యు అనే చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

కాంప్లిమెంట్స్
ఏదైనా ఫంక్షన్ రోజో లేదా పండగలకో అమ్మ బాగా రెడీ అయినప్పుడు నాన్న కాంప్లిమెంట్ ఇస్తారు. లేదా వంటలు బాగున్నాయని కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల మరింత అన్యోన్యత పెరుగుతుంది.

లవ్, ఫ్రెండ్ షిప్
మన పేరెంట్స్ ఒకరి నొకరు ఎంత సపోర్ట్ చేసుకుంటారో, ఎంత విలువనిచ్చుకుంటారో మనకు తెలుసు. ఏ సమయంలో కరెక్ట్ గా ఉన్నారు, ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది ఒకరినొకరు సలహా ఇచ్చుకుంటారు. ఇలాంటి విషయాలు వివరించినప్పుడు ప్రేమ, ఫ్రెండ్ షిప్ రెండూ ఖచ్చితంగా ఉండాలి.

క్షమించే గుణం
క్షమించాలనే విషయానికి వస్తే.. ఈ జనరేషన్ వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ.. ఇలాంటి చిన్న చిన్న గొడవలే.. ఇద్దరి మధ్య ప్రేమను రెట్టింపు చేస్తాయని మన పేరెంట్స్ చెబుతారు. కాబట్టి ఒకరినొకరు క్షమాపణ చెప్పుకుంటే.. మీ ఇద్దరి మధ్య రిలేషన్ మరింత బలపడుతుంది.



Click it and Unblock the Notifications