Latest Updates
-
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా?
మనిషికి దూరంగా ఉన్నా.. మనసుకి దగ్గరయ్యే మార్గాలు
పెళ్లి తర్వాత.. ప్రతి విషయంలోనూ పార్ట్‌నర్ సలహాలు, సూచనలు కోరుకుంటారు. అలాగే.. ఇద్దరూ కలిసి సినిమాలు, షికార్లు, షాపింగులూ, టూర్లు, ట్రిప్స్, వెకేషన్స్, హాలిడేట్ అంటూ.. మస్తుగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడికి వెళ్లినా.. ఇద్దరూ కలిసి వెస్తూ.. ఎంజాయ్ చేస్తూ.. లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. వాళిద్దరిదే ప్రపంచం అన్నట్టు మనసులో ఎన్నో అనుభూతులు పొందుతారు. కానీ ఒక్కసారిగా.. ఇద్దరూ కొన్ని కారణాల వల్ల దూరంగా ఉండాల్సి వస్తే.. ??

చుట్టూ ఎంతమంది ఉన్నా.. జీవిత భాగస్వామి లేరన్న ఫీలింగ్ కొంతైనా ఉంటుంది. జ్ఙాపకాలు, ఆలోచనలు ఒక పట్టాన వదిలిపెట్టవు. ఇంకా ఎంతకాలం ఈ దూరం అని ఫీలవుతూ ఉంటారు. రోజులు త్వరగా గడవడానికి రకరకాలు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ దూరం మీ అన్యోన్యతకు ఏ మాత్రం అడ్డు రాకుండా ఉండాలన్నా.. లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నా.. మీ లైఫ్ పార్ట్‌నర్ దూరంగా ఉన్నా.. దగ్గరగా ఉన్నారన్న ఫీలింగ్ కలగాలంటే.. ఈ సింపుల్ టిప్స్‌ని మీ రిలేషన్‌లో ఎంటర్ చేసుకుంటే సరి.
వర్క్ లో ఎంత తీరిక లేకుండా ఉన్నా సరే.. ప్రతిరోజూ కనీసం ఓ పదినిమిషాలైనా ఫోన్లో మాట్లాడండి. ఒకరి గొంతు మరొకరు వినడం వల్ల దూరంగా ఉన్నారన్న ధ్యాస నుంచి బయటపడవచ్చు. అలాగే కాసేపు ప్రేమగా చెప్పే కబుర్లు చాలా సంతోషాన్నిస్తాయి. అలాగే తిన్నావా లేదా.. ఏం తిన్నావు వంటి పలకరింపులు.. మీరు తనపై తీసుకుంటున్న కేర్‌ని సూచిస్తాయి.

మాట్లాడుకునేటప్పుడు ఆఫీసు విషయాలు, రోజంతా నిమగ్నమైన అన్ని పనుల గురించి చర్చించుకోండి. మీ మాటల్ని ఫోనుతోనే ఆపేయకుండా.. మెసేజ్ లు, ఈ మెయిల్స్ ద్వారా మరింత ప్రేమగా మనసులోని ఆలోచనలను పంచుకోండి. వీలైతే ఆన్‌లైన్ గ్రీటింగ్‌లూ, చిన్న చిన్న గిఫ్ట్స్ పంపి మీ డార్లింగ్ ని సర్ ప్రైజ్ చేయండి. మీ ఫోటోలను కూడా అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటే.. మరింత హ్యాపీగా ఫీలవుతారు..

ప్రస్తుత జనరేషన్ కి ఇంటర్నెట్ వరం లాంటిది. ఎందుకంటే.. ఎంత దూరంగా ఉన్నా.. పక్కనే ఉన్నామనే ఫీలింగ్ తీసుకురావడానికి నెట్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వారంలో కనీసం రెండుసార్లైనా స్కైప్, ఫేస్ టైం వంటి యాప్స్ ద్వారా.. మీ లైఫ్ పార్ట్ నర్ తో వీడియో కాల్ మాట్లాడి.. ఎంజాయ్ చేయండి. వీడియో కాల్ వల్ల.. దూరంగా ఉన్నామన్న ఫీలింగ్ నుంచి ఈజీగా బయటపడవచ్చు.
కొన్ని సందర్బాల్లో పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల మీ భాగస్వామి మీతో మాట్లాడటం వీలు కాకపోతే.. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి చిన్న చిన్న అడ్జెస్ట్ మెంట్స్ ఇలాంటి సమయంలో చాలా అవసరం. లేదంటే.. అనవసర మనస్పర్థలు.. మీ ఇద్దరి రిలేషన్ పై ప్రభావం చూపుతాయి. మాట్లాడకపోవడానికి కారణాలు అడిగి తెలుసుకోండి. అలాగే.. మాట్లాడటం వీలుకాకపోతే.. ఒక చిన్న మెసేజ్ పెట్టడం వల్ల.. ఎలాంటి ఇబ్బంది ఉండదు.



Click it and Unblock the Notifications
