Latest Updates
-
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది!
బాస్ బర్త్ డే పార్టీకి పిలిచి పట్టుకున్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వు ఏ లోటు రాకుండా చూసుకుంటా #mystory263
నేను ఆ రోజు తలస్నానం చేసి లూజ్ హెయిర్ తో పార్టీకి వెళ్లాను. తను నా జుట్టు వాసన చూస్తూ.. ఏం షాంపూ వాడావు అన్నాడు. ఏంటీ మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్నాను. నేను ఎప్పటి నుంచో ఇలా నీతో ప్రవర్తించాలనుకుంట
మా బాస్ అలా ప్రవర్తిస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. తను మొదట ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు చాలా అమాయకంగా ఉండేవాడు. మొదట పెద్దగా కమ్యూనికేషన్ స్కిల్స్ తెలిసేవి కావు. కానీ మంచి ఇంటలిజెంట్. ప్రతి విషయానికి నా సలహా అడిగేవాడు.
ఏ డౌట్ వచ్చినా నన్నే క్యాబిన్ కు పిలిచేవాడు. ఆఫీస్ లో అతన్ని బాగా అర్థం చేసుకుంది నేనే అనుకుని నాతోనే ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేవాడు.

మమత అని పిలువు
నన్ను ఎప్పుడూ ఏమండి అని పిలుస్తూ ఉంటే నాకే ఏదోలా అనిపించేది. అందుకే అలా అనొద్దు.. మమత అని పిలువు అని చెప్పాను. మొదట అలా పిలవడానికి అతను కాస్త ఇబ్బందిపడ్డా.. తర్వాత పేరుతోనే పిలవడం స్టార్ట్ చేశాడు. నేను అతని క్యాబిన్ కు దగ్గర్లోనే కూర్చొనేదాన్ని.

కలిసే చేసేవాళ్లం
ఇద్దరం లంచ్ కలిసే చేసేవాళ్లం. అతను నాతో బాస్ లా ఎప్పుడూ ప్రవర్తించేవాడు కాదు. నాతోనే కాదు.. ఆఫీస్ లో అందరితోనూ తను చాలా బాగా మెలిగేవాడు. ఎవ్వరూ తన గురించి ఒక్క చెడ్డ మాట కూడా మాట్లాడేవారు కాదు. ఆర్గనైజేషన్ కూడా అతని ప్రవర్తన, పని తీరు చూసి అతనిపై భరోసా పెంచుకుంది.

మా ఆయనకు గొప్పగా చెప్పేదాన్ని
కంపెనీ ఎండీలు తను ఏం చెప్పినా సరే నమ్మేవారు. అంత నమ్మకాన్ని కల్పించుకున్నాడు అతను. నాకు కూడా అతనిపై మంచి నమ్మకం ఉండేది. నన్ను చాలా సార్లు అతనే ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లేవాడు. నాకు పెళ్లయ్యింది. మా ఆయనకు కూడా మా బాస్ గురించి నేను చాలా గొప్పగా చెప్పేదాన్ని.

నన్ను టచ్ చేస్తూ ఉండేవాడు
అలాంటి మా బాస్ లో మరో కోణం కూడా ఉందని నాకు చాలా రోజుల వరకు తెలియదు. తను అప్పుడప్పుడు నన్ను టచ్ చేస్తూ ఉండేవాడు. అయితే అదంతా కూడా ఏదో క్యాజ్ వల్ అనుకునేదాన్ని. కానీ అతని బర్త్ డే ఫంక్షన్ లో అతని అసలు స్వరూపం తెలిసింది.

బతిమిలాడుతున్నానని వెళ్లాను
ఆఫీస్ లో బాస్ బర్త్ డే ఫంక్షన్ నిర్వహించాం. తర్వాత మళ్లీ రాత్రి తను స్పెషల్ గా బయట పార్టీ అరెంజ్ చేశాడు. దానికి చాలా కొద్ది మందిని ఇన్వైట్ చేశాడు. ఆ పార్టీకి రమ్మని ఆయన చాలాసార్లు నాకు ఫోన్ చేశాడు. రాత్రి సమయంలో పార్టీకి వెళ్లడం ఇష్టం లేకున్నా మరీ అంతగా బతిమిలాడుతున్నానని వెళ్లాను.

గట్టిగా కౌగిలించుకున్నాడు
నాకు అసలు నైట్ పార్టీలు ఇష్టం లేదు. నేను ఎప్పుడు అలా వెళ్లలేదు. కానీ బాస్ కోసం ఫస్ట్ టైమ్ పార్టీ వేర్ డ్రెస్ లో వెళ్లాను. పార్టీలో ఆయనకు బుకే ఇచ్చాను. తర్వాత తను నన్ను హగ్ చేసుకున్నాడు. గతంలో కూడా చాలా సార్లు నన్ను ప్రశంసిస్తూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. కానీ ఆ రోజు మాత్రం తను చాలా గట్టిగా కౌగిలించుకున్నాడు.

నువ్వే ఛాన్స్ ఇవ్వడం లేదు
నేను ఆ రోజు తలస్నానం చేసి లూజ్ హెయిర్ తో పార్టీకి వెళ్లాను. తను నా జుట్టు వాసన చూస్తూ.. ఏం షాంపూ వాడావు అన్నాడు. ఏంటీ మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్నాను. నేను ఎప్పటి నుంచో ఇలా నీతో ప్రవర్తించాలనుకుంటున్నాను కానీ నువ్వు ఛాన్స్ ఇవ్వడం లేదు అన్నాడు.

నలిపేయాలని ఉంది
నువ్వు ఒకే అంటే ఈ రోజు నుంచి నిన్ను నా సొంతదానిలాగా చూసుకుంటాను అన్నాడు. నిన్ను చూస్తుంటే నాకు మతిపోతుంది.. నలిపేయాలని ఉంది అన్నాడు. నీ పర్ ఫ్యూమ్ వాసనకు నా మససు పడిచచ్చిపోతుంది. ఒక్కసారైనా నీతో తనివితీరా గడపాలని ఉంది అన్నాడు.

పెళ్లయ్యింది అని తెలిసినా
నేను షాక్ అయ్యాను. వెంటనే అక్కడి నుంచి సైలెంట్ గా ఇంటికొచ్చాను. నేను లైంగిక వేధింపులకు సంబంధించి చాలా వార్తలు చదివాను. కానీ నేను కూడా వేధింపులకు గురి అవుతానని ఏ రోజు అనుకోలేదు. నాకు పెళ్లయ్యింది అని తెలిసినా కూడా మా బాస్ నాతో అలా ప్రవర్తించడం చాలా బాధేసింది.

మోజు పడి ఉంటుందని అనుకుంటారు
తను గురించి నేను ఎవరికైనా బ్యాడ్ గా చెబితే ఎవరూ నమ్మరు. చివరకు నా పరువే పోతుంది. ఈమెనే ఇంక్రిమెంట్స్ కోసం బాస్ పై మోజు పడి ఉంటుందని అనుకుంటారు.. అందుకే తను వేధింపులకు పాల్పడ్డ కూడా మౌనంగా ఉంటున్నాను.

దుర్మార్గులకు బుద్ధి చెప్పాలి
నాలాగే చాలా మంది అమ్మాయిలు ఇలాంటి వేధింపులకు నలిగిపోతుంటారని నాకు తెలుసు. ప్రతి మహిళ కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఇలాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పే రోజులు రావాలని ఆశిస్తున్నాను.



Click it and Unblock the Notifications