Latest Updates
-
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
మీరు ఎదగలేకపోడానికి 3 కారణాలు ఇవే? సక్సెస్ అవ్వడానికి సైకాలజిస్ట్ చెప్పిన రహస్యం
మన లైఫ్ ఒక జర్నీ లాంటిది. ఈ జర్నీలో కొందరు శిఖరాలను అధిరోహిస్తే మరికొందరు పదేపపదే అడ్డంకులను చూసి కిందపడిపోతుంటారు. అచ్చం పాము నిచ్చెన ఆట మాదిరిగా. గెలిచిన వారిని చూసి వారిని చూసి వాళ్లకి అన్నీ కలిసొచ్చాయి అని సరిపెట్టుకుంటాం.
కానీ ఓడిపోయిన వాళ్లలో చాలామంది తమ వైఫల్యానికి కారణం తాము కాదని, మరెవరో లేదా మరేదో అని నమ్ముతుంటారు. ఈ నమ్మకమే వాళ్లని లైఫ్ లో ముందుకు సాగనివ్వని లేదా ఎదగనివ్వని ఒక అదృశ్య సంకెళ్లు. వారు తమను తాము బాధితులుగా చూపిస్తూ తమ చేతకానితనానికి, నిస్సహాయతకు 3 రకాల విక్టిమ్ కార్డ్స్ ను ఒక కవచంలా వాడుకుంటారని ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్, సైకాలజిస్ట్ విజయ పెద్దిన చెప్పారు.

ఈ 3 కార్డులు ఎవరి జేబులో అయితే ఉంటాయో వాళ్లు పర్శనల్ లైఫ్ లో, ప్రొఫెషషనల్ లైఫ్ లో లేదా మానవ సంబంధాలలో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్లు సమస్యను పరిష్కరించడానికి కాకుండా సాకులు చెప్పి తప్పించుకోవడానికే ప్రయత్నిస్తారు. ఇంతకీ మనల్ని ఎదగనీయకుండా చేసే ఆ 3 కార్డులు ఏవో ఇప్పుడు చూద్దాం.
గతం అనే గాయం (ది పాస్ట్ విక్టిమ్ కార్డ్)
ఈ కార్డును వాడే వ్యక్తులు ఎప్పుడూ తమ ప్రస్తుత ఫెయిల్యూర్ కి లేదా వైఫల్యాలకు గతాన్ని వేలెత్తి చూపుతారు. వీరి మాటలు ఎప్పుడూ ఎలా ఉంటాయంటే.."చిన్నప్పుడు మా ఇంట్లో నన్ను సరిగ్గా ఎంకరేజ్ చెయ్యలేదు, అందుకే నాలో కాన్ఫిడెన్స్ తక్కువ లేదా గతంలో నేను పెట్టిన వ్యాపారంలో నష్టపోయాను, అందుకే ఇప్పుడు ఏ కొత్త ప్రయత్నం చేయాలన్నా భయంగా ఉంది.. గత ప్రేమలో నేను మోసపోయాను, అందుకే ఇప్పుడు ఎవరినీ నమ్మలేకపోతున్నాను" అని అంటుంటారు.
వీరు గడిచిపోయిన కాలాన్ని ఒక జైలుగా మార్చుకుని అందులోనే బంధీలుగా జీవిస్తారు. గతం నేర్పిన గుణపాఠాన్ని స్వీకరించి ముందుకు సాగడానికి బదులుగా, ఆ గాయాన్నే పదేపదే కెలుక్కుంటూ, దానిని ఒక సాకుగా వాడుకుంటారు. గతం మనకు అనుభవాలను ఇస్తుంది, కానీ మన భవిష్యత్తును శాసించకూడదు.
చిన్నప్పుడు ఎదురైన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, ఎదురైన నష్టాలు ఎవరికైనా బాధ కలిగిస్తాయి. కానీ, వాటినే పట్టుకుని వేలాడుతూ, అప్పుడు అలా జరిగింది కాబట్టే, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అని చెప్పడం బాధ్యత నుండి తప్పించుకోవడమే.

పరిస్థితుల పాచిక (ది సర్కమ్‌స్టెన్సెస్ కార్డ్)
ఈ కార్డును వాడేవారు తమ చుట్టూ ఉన్న పరిస్థితులే తమ ఓటమికి కారణమని బలంగా నమ్ముతారు. వీరికి ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ తమకే ఉన్నాయని, తమంత దురదృష్టవంతులు ఇంకోరు లేరనిపిస్తుంది.
వీరి మాటల్లో తరచూ వినిపించే పదాలు.. "నాకు సరైన ఆర్థిక అండ లేదు, లేకపోతేనా నేనెప్పుడో వ్యాపారం మొదలుపెట్టేవాడిని.. నా పై అధికారికి నేనంటే గిట్టదు, అందుకే నాకు ప్రమోషన్ రావడం లేదు లేదా మా కుటుంబ బాధ్యతలన్నీ నా మీదే ఉన్నాయి, అందుకే నా కలలను నేను నెరవేర్చుకోలేకపోతున్నాను".
నిజానికి ప్రతికూల పరిస్థితులు లేని మనిషి భూమ్మీద ఎవ్వరూ ఉండడు. అందరికీ ఏదో ఒక రూపంలో సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. కానీ గెలిచేవాడు ఆ సవాళ్లను అధిగమించడానికి మార్గాలు వెతుకుతాడు. ఈ కార్డు వాడే వ్యక్తి మాత్రం ఆ సవాళ్లనే నిందిస్తూ కూర్చుంటాడు. వారు తమ నియంత్రణలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ, తమ చేతుల్లో ఉన్న చిన్నచిన్న అవకాశాలను కూడా వదిలేసుకుంటారు.
అదృష్టం అనే అడ్డుగోడ (ది లక్ కార్డ్)
ఇది చాలామంది ఈజీగా వాడే కార్డు. తాము ఎంత ట్రై చేసినా కూడా అదృష్టం కలిసి రావడం లేదని వాపోవడం వీరి నైజం. వాడికేముంది, వాడికి లక్ బాగుంది అందుకే సులభంగా విజయం సాధించాడు.. నేను ఎంత కష్టపడినా నా టైమ్ బాగాలేదు లేదా నేను అద్భుతంగా ప్రయత్నిస్తున్నాను, కానీ ఏంటో అంతా చివరి నిమిషంలో చేజారిపోతోంది.. నా జాతకంలోనే ఏదో లోపం ఉంది ఇలాంటి మాటలతో తమను తాము సమాధానపరుచుకుంటారు.
ప్రయత్నం చేయకుండా అదృష్టం మీద భారం వేయడం సోమరితనం. కానీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్పుకుంటూ కూడా అదృష్టాన్ని నిందించడం ఒకరకమైన ఆత్మవంచన. సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తూ, తమ నైపుణ్యాలను పెంచుకుంటూ నిరంతరం సిద్ధంగా ఉన్నవారినే అదృష్టం వరిస్తుంది.
అంతేగానీ ఏమీ చేయకుండా కూర్చుంటే అదృష్ట దేవత వచ్చి తలుపు తట్టదు. తాము చేసే ప్రయత్నంలో ఉన్న లోపాలను సమీక్షించుకోకుండా, తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోకుండా, కేవలం లక్ ను నిందించడం అంటే తమపై తమకే నమ్మకం లేదని ఒప్పుకోవడమే.



Click it and Unblock the Notifications