Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
భారత్ లో పెరుగుతున్న రెండో పెళ్లి ధోరణి..జీవన్ సాథి సర్వేలో ఆసక్తికర నిజాలు
నీ తారలు, ప్రముఖుల రెండో పెళ్లిళ్ల వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపించడం మనకు అలవాటే. అయితే, ఇప్పుడు ఈ ట్రెండ్ కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. సగటు భారతీయుల ఆలోచనా విధానంలో కూడా ఊహించని మార్పులొచ్చాయి. ఒకప్పుడు పెళ్లి అనగానే జాతకాలు, 36 గుణాలు కలిశాయా లేదా అని ఆరా తీసేవారు.
కానీ ఇప్పుడు ఆ పట్టింపులు పోయాయి. కేవలం ఒకటి లేదా రెండు ముఖ్యమైన లక్షణాలు ఉంటే చాలనుకుంటున్నారు. ప్రముఖ మ్యాట్రిమోనీ సంస్థ జీవన్ సాథి విడుదల చేసిన మోడరన్ మ్యాచ్ మేకింగ్ రిపోర్ట్ 2026.. భారతీయ వివాహ వ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులను కళ్లకు కట్టింది. ఆ ఆసక్తికరమైన విషయాలు ఏంటో చూద్దాం.

వయసు కాదు.. కెరీర్ ముఖ్యం!
ఒకప్పుడు పాతికేళ్లు రాగానే ఇంట్లో పెళ్లి గోల మొదలయ్యేది. కానీ ఇప్పుడు యువత ఆలోచన పూర్తిగా మారింది. 2016లో సగటు వివాహ వయసు 27 ఏళ్లుగా ఉంటే, 2025 నాటికి అది 29 ఏళ్లకు పెరుగుతుందని సర్వే అంచనా వేసింది. బంధువుల ఒత్తిడికి లేదా సామాజిక భయాలకు తలొగ్గి పెళ్లి చేసుకోవడానికి యువత ఇష్టపడట్లేదు.
ముందుగా కెరీర్ లో స్థిరపడటం, ఆర్థిక స్వాతంత్ర్యం, తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికే పెద్దపీట వేస్తున్నారు. అందుకే సగం మందికి పైగా 29 ఏళ్లు వచ్చాకే భాగస్వామి వేట మొదలుపెడుతున్నారు.
పెరుగుతున్న రెండో పెళ్లిళ్లు
ఈ నివేదికలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మన దేశంలో రెండో పెళ్లిళ్ల ట్రెండ్ ఏకంగా 43 శాతం పెరిగింది. 2016లో 11 శాతంగా ఉన్న ఈ ఆసక్తి 2025 నాటికి 16 శాతానికి చేరుకుందని అంచనా. విడాకులు, రెండో పెళ్లి అనేవి ఒకప్పుడు సమాజంలో పెద్ద మచ్చగా భావించేవారు.
కానీ ఇప్పుడు ఆ సామాజిక ముద్ర చెరిగిపోతోంది. గతం గడిచిపోయిందని, సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఎవరైనా అర్హులేనని ఈ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఆరు మ్యాట్రిమోనీ సక్సెస్ స్టోరీల్లో ఒకటి రెండో పెళ్లికి సంబంధించినదే కావడం విశేషం.
కులం గోడలు బద్దలవుతున్నాయ్!
పెళ్లిళ్లలో కులం అనేది ఎప్పటినుంచో ఉన్న అతిపెద్ద అడ్డంకి. కానీ, ఆధునిక యువత ఈ గోడలను దాటేస్తోంది. 2016లో 91 శాతం మంది తమ కులంలోనే పెళ్లి జరగాలని పట్టుబడితే, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 54 శాతానికి పడిపోయింది.
మహానగరాల్లో అయితే ఇది 49 శాతానికే పరిమితమైంది. కులం, గోత్రాల కంటే కూడా ఇద్దరి మధ్య పరస్పర అవగాహన ఉంటే చాలని ఇప్పటి యువత గట్టిగా నమ్ముతోంది.

ఢిల్లీ వైపు యువత చూపు
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. లక్నో, జైపూర్, భోపాల్ వంటి రాజధాని నగరాల యువత తమ భాగస్వాములను సొంత ఊర్లో కాకుండా ఢిల్లీలో వెతుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఢిల్లీ వాసుల ఆధునిక ఆలోచనా విధానం, ఉదార స్వభావం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
భార్య ఎక్కువ సంపాదించినా ఓకే!
మగవాడే సంపాదించాలి, ఆడది ఇంటికే పరిమితం కావాలి అనే పాత కాలపు ఆలోచనలు కనుమరుగవుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా సంపాదించాలని 42 శాతం మంది కోరుకుంటున్నారు.
అసలు ట్విస్ట్ ఏమిటంటే.. తమ కంటే తమ భార్య ఎక్కువ సంపాదించినా ఏమాత్రం ఈగో ఫీల్ అవ్వమని, సంతోషంగా అంగీకరిస్తామని ఏకంగా 87 శాతం మంది పురుషులు చెప్పడం ఆధునిక భారతీయ మగవాడి ఆలోచనలో వచ్చిన గొప్ప మార్పు.



Click it and Unblock the Notifications
