Latest Updates
-
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.!
చిన్న గొడవలకే భార్యాభర్తల మధ్య అహం.. ఈ ఏడు మంత్రాలతో అన్యోన్య బంధం.!
నేటి కాలంలో వైవాహిక జీవితంలో గొడవలు సర్వసాధారణంగా మారిపోయాయి. అహం కారణంగా ప్రతి చిన్న విషయానికీ దంపతుల మధ్య ఘర్షణ ప్రారంభం అవుతుంది. దీంతో క్రమేణా అవి పెద్ద గొడవలకి దారి తీసి విడాకుల వరకూ వెళ్తున్నాయి. ఈ క్రమంలో భార్యాభర్తలు తమ బంధాన్ని ఎలా కాపాడుకోవాలో మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఖచ్చితంగా నేటి జంటలు తెలుసుకుని తీరాలి.

దాంపత్య జీవితం అనేది ప్రేమ, అవగాహన, ఆధ్యాత్మిక ఎదుగుదలతో కూడిన అందమైన ప్రయాణంగా మన పెద్దలు చెబుతారు. అయితే తరాలు మారుతున్న కొద్దీ వివాహ బంధంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేటి కాలంలో భార్యాభర్తల మధ్య చాలా వరకు అవగాహన లోపం కారణంగా మనస్పర్థలు ఏర్పడుతున్నాయనే చెప్పవచ్చు. ఈ క్రమంలో తమ బంధంలో సంతోషాన్ని నిలుపుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. శారీరక, భావోద్వేగ, మానసిక, సామాజిక, ఆర్థిక కారణాలు ఇందుకు దారితీస్తున్నాయని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. వైవాహిక జీవితంలో ఇవన్నీ సమతుల్యంగా ఉండటం అవసరమని సూచిస్తున్నారు. ఇందుకోసం ఏడు మంత్రాలను అనుసరించాలని సలహా ఇస్తున్నారు.
ఏ బంధంలోనైనా అంతర్గత సంతోషం చాలా ముఖ్యం. మీ సంతోషం ఎల్లప్పుడూ మీ భాగస్వామిపై ఆధారపడకూడదని నిపుణులు అంటున్నారు. లేదంటే మీరు భావోద్వేగపరంగా బానిస అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైనా అంతర్గత సంతోషం అంటే మీరు స్వయంగా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మీ పార్ట్‌నర్‌తో ప్రేమ, నవ్వులతో పాటు ఆప్యాయతను పంచుకోగలరు.
పెళ్లి తర్వాత దంపతుల మధ్య స్నేహ బంధం చాలా ముఖ్యం. ఇంటికి యజమానిననే గర్వం ప్రదర్శించకుండా భాగస్వామితో స్నేహాన్ని కొనసాగించాలి. దీని ద్వారా జీవితంలో ఒడుదొడుకులు ఉన్నా సమస్యలను సునాయాసంగా పరిష్కరించుకోగలరు. జీవితాన్ని అందంగా మార్చుకోగలరు.
వివాహ బంధంలో ఇద్దరి మధ్య స్వేచ్ఛతో పాటు ఒకరి అభిప్రాయాలకు మరొకరికి విలువ ఇవ్వాలి. అంతేకానీ మీకు అనుగుణంగా మీ భాగస్వామిని మార్చడానికి ప్రయత్నించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే వారి మధ్య గొడవలకు దారి తీసే ప్రమాదం ఉంది. ఒకరి అభిరుచులను, ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలను అంగీకరించడమే నిజమైన ప్రేమగా నిపుణులు సూచిస్తున్నారు.
దాంపత్య బంధంలో ఒకరిపై ఒకరికి ఎలాంటి అంచనాలు, లావాదేవీలు ఉండకూడదు. నీకోసం నేను ఇది చేశాను.. నా కోసం ఇది చేయి అని వారిమధ్య ఇచ్చిపుచ్చుకునేలా ఉండకూడదు. షరుతులతో ప్రేమ కొనసాగదు. షరతులు లేని ప్రేమ, బంధం ద్వారా దాంపత్య జీవితం బలోపేతం అవుతుంది.

భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్నపాటి గొడవ తలెత్తినా ఒక్కసారి ఆలోచించాలి. ఏదైనా మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించకుండా ప్రతిస్పందించడం వల్ల తర్వాత బాధపడే పరిస్థితి తలెత్తుతుంది. సంబంధంలో జాగ్రత్త వహించడం వల్ల మీ భాగస్వామి అవసరాలు తెలుసుకోవడంతో పాటు మీరు చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు.
మీ భాగస్వామి జీవితంలో ఏం కావాలని ఆశిస్తున్నారో అందుకు మనస్ఫూర్తిగా సహకరించండి. వారి వ్యక్తిగత జీవితంతో పాటు, వృత్తిపరమైన జీవితానికి సమయం ఇవ్వండి. వారిని మీ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించకండి. ఇది బంధాన్ని బలహీనపరుస్తుంది. నేను అనే భావనను మొదలుపెట్టి, మనం అనే భావనతో మెలగడం ద్వారా బంధం బలపడుతుంది. గొడవ జరిగినప్పుడు మాటకు మాట పెంచుకుని వాగ్వాదం తీవ్రం చేయకుండా బంధానికి ప్రాధాన్యత ఇస్తూ కాంప్రమైజ్ అవడం ద్వారా ఎదుటి వ్యక్తిలోనూ మార్పు కనిపిస్తుంది. దీంతో బంధం బలపడే అవకాశాలు పెరుగుతాయి.



Click it and Unblock the Notifications