Latest Updates
-
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు!
భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారని తెలిపే గ్రీన్ ఫ్లాగ్స్.. ఇవి మీ బంధంలో ఉన్నాయా.?
వైవాహిక జీవితంలో ప్రేమ, సంతోషం, దుఃఖం, గొడవలు, మనస్పర్థలు ఇవన్నీ సాధారణమే. కానీ కొన్ని బంధాల్లో సానుకూల అంశాలను పక్కనబెట్టి తరచూ బాధ కలిగించే అంశాలను గుర్తు చేసుకుంటూ అందమైన దాంపత్య జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటారు. మరికొందరు గొడవలు జరిగినా సర్దుకుపోతూ తమ మధ్య ప్రేమను మరింత బలోపేతం చేసుకుంటారు. వీటినే రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్ అంటారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. మరి గ్రీన్ ఫ్లాగ్స్‌ని ఎలా గుర్తించాలి. వాటి సంకేతాలేంటి..? ఈ కథనంలో చూద్దాం..

భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలను సృష్టించే రెడ్ ఫ్లాగ్స్ ఏ కాదు ప్రేమను పెంచే గ్రీన్ ఫ్లాగ్స్ కూడా ఉంటాయని సైకాలజిస్టు నిపుణులు అంటున్నారు. మీ భాగస్వామిలో మీరు సరిగ్గా గమనిస్తే రోజూ ఇలాంటివి గుర్తించవచ్చని.. దీంతో చాలా వరకు మనస్పర్థలు తొలగిపోతాయని సూచిస్తున్నారు. భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారనే దానికి ఈ గ్రీన్ ఫ్లాగ్స్ సంకేతంగా చెబుతున్నారు. బంధాన్ని మరింత బలోపేతం చేసి ప్రేమ ప్రయాణాన్ని అందించే గ్రీన్ ఫ్లాగ్స్ ఏంటో తెలుసుకుందాం..
గౌరవం, జాలి
దాంపత్య బంధంలో ఇద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు.. క్లిష్ట పరిస్థితుల్లోనూ మీ భాగస్వామి మీపై అదే గౌరవం, జాలి చూపిస్తారు. మీరు బాధలో ఉన్నా కోపంలో ఉన్నా.. నెగిటివ్ ఫీలింగ్‌తో కాకుండా మీకు రెస్పెక్ట్ ఇస్తూ మీ మనోభావాలను అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఏదైనా సందర్భంలో మీ పార్ట్‌నర్ తప్పు ఉన్నా.. తాను మనస్ఫూర్తిగా ఆ తప్పును మీ ముందు ఒప్పుకొంటారు. సరిదిద్దుకునే మనస్తత్వంతో ఉంటారు. తప్పు మీపై నెట్టేయడానికి ప్రయత్నించరు.

మీతో గడపాలని ఎదురుచూడటం..
ఆఫీసు లేదా వ్యాపారం వృత్తిపరమైన బాధ్యతలు ఏవైనా బయట ముగిసిన తర్వాత వెంటనే ఇంటికి వచ్చేయాలని ఎదురుచూస్తుంటారు. ఇంటికి ఇప్పుడు వెళ్లాలా.. వెళ్తే మళ్లీ ఏవైనా గొడవలు అవుతాయా అనే భయం లేకుండా సంతోషంగా ఎప్పుడెప్పుడు వెళ్లాలా.. భాగస్వామితో సమయం గడపాలా అని ఆరాటపడుతుంటారు. మీతో సాన్నిహిత్యాన్ని సంతోషంగా ఆస్వాదిస్తుంటారు. మీతో పనులు షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. కబుర్లు చెప్పాలని చూస్తారు. ఇది మధురమైన బంధానికి అతి పెద్ద గ్రీన్ ఫ్లాగ్..
వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యత
ఏ బంధమైనా ప్రతి వ్యక్తికీ కొన్ని అభిరుచులు, అభిప్రాయాలు ఉంటాయి. కొందరు పెళ్లయ్యాక కుటుంబం కోసం, భాగస్వామి కోసం తమ ప్యాషన్‌ను, ఇష్టాలను త్యాగం చేస్తారు. అలా కాకుండా మీకు ఏం చేయాలని ఉందో తెలుసుకుని ఆ రంగంలో మీరు రాణించడానికి మద్దతు అందిస్తారు. మీ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ స్వేచ్ఛాయుత నిర్ణయాలకు అడ్డు రారు.
భాగస్వామి మీ వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీరు కూడా బయట మీ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని సంతోషకరంగా గడపగలరు. ఇక పిల్లల విషయంలోనూ, వారి పెంపకం విషయాలను ఇద్దరికీ ఏకాభిప్రాయం ఉండాలని భావిస్తారు. ఇవన్నీ సంతోషకరమైన జీవితానికి నాంది పలికే గ్రీన్ ఫ్లాగ్స్.
మీరూ మీ భాగస్వామితో ఇలా ఉండటానికి ప్రయత్నిస్తూ వారితో సంతోషంగా గడిపేందుకు సమయం కేటాయించండి. వారి అభిరుచులను, అభిప్రాయాలను గౌరవించిండి. మీ కంటూ ఓ ప్రత్యేక సమయం కేటాయించుకోండి. దీని ద్వారా మీ మధ్య ఎప్పుడైనా శారీరక దూరం పెరిగినా మానసికంగా చాలా దగ్గరగా ఉంటారు. అదే మీ బంధానికి గట్టి పునాదిని ఇస్తుందని సైకాలజిస్టు నిపుణులు అంటున్నారు.



Click it and Unblock the Notifications
