Latest Updates
-
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచే తప్పులు ఇవే.. మనస్పర్థలు తొలగాలంటే ఇలా చేయండి.!
భార్యాభర్తలు అన్నాక ఒకరిపై ఒకరికి గౌరవం, అంగీకారం, ఆరోగ్యకరమైన సంభాషణ, సహకారం ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే వారి మధ్య బంధం బలంగా ఉంటుంది. విభిన్న వ్యక్తిత్వాల కలయికతో ఏర్పడిన వివాహ బంధంలో ఇద్దరి అభిరుచులకు ప్రాధాన్యత ఉంటేనే ఆ బంధం బలపడుతుంది. కానీ కుటుంబంలో తలెత్తే చిన్నపాటి తప్పుల కారణంగా దంపతుల మధ్య కలహాలు మొదలవుతున్నాయి. మరి సంతోషకరమైన వివాహ జీవితానికి సైకాలజిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం..

ఈ రోజుల్లో ఆడపిల్లలు పెళ్లికి ముందు, తర్వాత తమకంటూ ఒక గుర్తింపును కోరుకుంటున్నారు. అయితే కొన్ని కుటుంబాల్లో కోడలి విషయంలో అత్తామామలు, భర్త తమకు నచ్చినట్లుగా ఉండాలనుకుంటారు. ఈ కారణంగా ఆ బంధంలో ఉద్రిక్తత, భావోద్వేగ దూరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో మీ కుటుంబంలోకి వచ్చే కొత్త వ్యక్తిని పూర్తిగా మార్చడానికి ప్రయత్నించకూడదని.. ఆమె గుర్తింపుకి ప్రాధాన్యత ఇస్తూ కోడలిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తే ఆ కుటుంబం ఆరోగ్యకరంగా, సంతోషకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దాంపత్య బంధంలో సర్దుబాట్లు, రాజీలు సహజమే కానీ.. అది మీ గుర్తింపును కోల్పోయేలా చేయకూడదు.
పెళ్లి తర్వాత యువతీయువకుల జీవితం పూర్తిగా మారిపోతుంది. కొత్త బాధ్యతలు, సంబంధాలు, పరిస్థితులు ఇవన్నీ భాగమే. ఈ క్రమంలో భార్య లేదా భర్త తమ ఇష్టాలు, వ్యక్తిత్వం, మాటతీరు, వృత్తి, స్నేహితులు, జీవనశైలిని మార్చుకోవాలని ఒత్తిడి చేస్తే అది మానసిక ఒత్తిడికి దారి తీసి వారి బంధంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం ద్వారా విజయవంతమైన వివాహం సాధ్యమవుతుంది.
నేను- మనం
మీ జీవితంలోకి వచ్చిన భాగస్వామి గుర్తింపును, గౌరవాన్ని కాపాడటం ద్వారా మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇద్దరి మధ్య అప్పుడపప్పుడూ అభిప్రాయ భేదాలు తలెత్తినా గౌరవాన్ని కాపాడుకోవడం ద్వారా బంధం దీర్ఘకాలికంగా బలంగా ఉంటుంది. మీ భాగస్వామితో భావాలు, అంచనాలు, సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడుకోవడం ద్వారా అభిప్రాయ భేదాలు తొలగి సంతోషంగా ఉండగలుగుతారు. భార్యాభర్తలు నేను కన్నా మనం అనే భావనతో ఉంటేనే కలిసి నిర్ణయాలు తీసుకోవడం, బాధ్యతలు పంచుకునే సామర్థ్యం పెరిగి బంధం బలపడుతుంది.

ఈ అలవాట్లు వద్దు
మీ వివాహ బంధంలో ఎప్పుడూ మరొకరితో పోలిక, తేడాలు అనేవి చూపించకూడదు. మా ఇంట్లో ఇలా ఉంటాం.. మీ ఇంట్లో ఇలా ఉన్నారేంటి.. మీరు ఇలా ఉండాలి అనే పోలికల ద్వారా ఒకరిపై ఒకరికి అనురాగం తగ్గి మానసికంగా దూరం పెరుగుతుంది. మీ భాగస్వామిలో ఎప్పుడూ తప్పులు వెతకడానికి ప్రయత్నించకండి. వారిలో పాజిటివ్ అంశాలను చూడండి. లేదంటే వారి ఆత్మవిశ్వాసం, భావోద్వేగ బంధం తగ్గిపోతుంది.
మీ ఇష్టానికి అనుగుణంగా ఉండాలని మీ భాగస్వామి గుర్తింపును మార్చుకోవాలని, వారి గుర్తింపును చంపేయాలని ప్రయత్నించకండి. ఇది వారిలో అభదత్రను పెంచుతుంది. ఇద్దరి మధ్య తరచూ మౌనం కూడా సరికాదు. మనస్పర్థలు తలెత్తినప్పుడు మాట్లాడకుండా ఉండటం ద్వారా తరచూ అపార్థాలకు దారితీయవచ్చు.
కుటుంబీకుల పాత్ర
తమ కుటుంబంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తిని మనస్ఫూర్తిగా అత్తామామలు స్వాగతించాలి. వారితో బంధంలో ఒత్తిడి ఉండకూడదు. గౌరవంతో ఏర్పడిన బంధం మాత్రమే ఎక్కువ కాలం నిలబడుతుంది. ఆరోగ్యకరమైన సంబంధంలో ఇద్దరు భాగస్వాములు తమ భావాలను పంచుకోవాలి. వ్యక్తిగత స్వేచ్ఛకి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ భాగస్వామికి మీకు అనుగుణంగా మార్చుకోవడానికి బదులుగా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న ప్రశంసలు మీ మధ్య ప్రేమను పంచుతాయి. కుటుంబీకులతో పరస్పర గౌరవాన్ని కలిగి ఉండటం ద్వారా ఆరగ్యకరమైన వాతావరణం ఉంటుంది.



Click it and Unblock the Notifications
