Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
మీ Ex బాయ్‌ఫ్రెండ్ మిమ్మల్ని మళ్లీ కావాలనుకుంటున్నారో.. లేదో.. ఈ సంకేతాలు చెప్పేస్తాయి
ప్రేమ బంధం చాలా విచిత్రమైనది. ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, దూరం అవుతున్నప్పుడు కూడా తెలుసుకోలేము, దూరమై కొన్ని రోజులు అయ్యాక గానీ ప్రేమికుల విలువ తెలిసిరాదు. ప్రేమ బంధంలో అనేక కారణాల వల్ల ప్రేమికులు విడిపోతుంటారు. కోపంలో, ఆవేశంలో మాటామాటా అనుకుంటారు. దీని వల్ల గొడవ మరింత పెద్దదవుతుంది. అసలు విషయం పక్కకు వెళ్లి.. కొసరు విషయంపైనే వివాదం నెలకొంటుంది. కోపంలో అనే మాటలు మనసును గాయం చేస్తాయి. కోపం, ఆవేశంలో అవేవీ తెలియవు.

అలా విడిపోయిన ప్రేమికులు మొదటి కొన్ని రోజులు బాగానే ఉంటారు. కానీ క్రమంగా వారు లేని లోటు తెలిసి వస్తుంది. బాధ పడతారు. మధుర జ్ఞాపకాలు గుర్తొచ్చేకొద్దీ మనసులో దుఃఖం ఉప్పొంగుతుంది. ఆవేశంలో అన్న మాటలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి. ఛ.. అలా అని ఉండాల్సింది కాదు అనిపిస్తుంది, తామన్న మాటలు ఎంతగా బాధించి ఉంటాయోనని ఆలోచించడం మొదలు పెడతారు. వారితో గడిపిన క్షణాలు కళ్ల ముందు కదలాడతాయి.
వాళ్లకు దూరంగా ఉండలేకపోతారు. వారితో గడపాలని, వారితో కబుర్లు చెప్పుకోవాలని అనిపిస్తుంది. ఒంటరిగా ఫీలైపోతారు. ఎంత మంది ఉన్నా.. వారితోనే ఉండాలనిపిస్తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు తోడుగా ఉన్నా.. గర్ల్ ఫ్రెండ్ గురించే ఆలోచనలన్నీ. ఫోన్ చేద్దామనిపిస్తుంది, మెసేజ్ పంపించాలని ఫోన్ తీసుకుంటారు. కానీ చేయలేకపోతారు.
కానీ, ఇవేవీ.. అమ్మాయిలకు తెలియదు. అయితే కొన్ని లక్షణాలు మాత్రం చాలా మంది అబ్బాయిల్లో ఒకేలా ఉంటాయి. వాటితో వారు తమ గర్ల్ ఫ్రెండ్ ను మిస్ అవుతున్నారో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.
* ప్రేమ బంధం ముగిసి పోయిందని అనుకున్న తర్వాత, కొన్ని రోజుల నుంచి ఎవరికి వారు దూరంగా ఉంటున్న తర్వాత అతడు మళ్లీ మీతో కనెక్ట్ కావడానికి ట్రై చేస్తున్నట్లయితే మీతో బంధాన్ని మళ్లీ కోరుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు.
* చాలా రోజులు దూరం ఉన్న తర్వాత ఎప్పుడైనా, ఎక్కడైనా కనిపిస్తే.. వారి కళ్లలో స్పార్క్ కనిపిస్తుంది. దూరం నుంచి అయినా సరే వారి మనసులోని భావాలను, ముఖ కవళికలను కూడా గుర్తించవచ్చు. కొందరైతే.. మీ వైపు వేగంగా వస్తుంటారు. చేతులు పట్టుకోవడం, గట్టిగా హగ్ చేసుకోవడం లాంటివి చేస్తారు. మీ బాయ్ ఫ్రెండ్ కూడా ఇలాగే చేస్తుంటే.. వారి మనసులో మీకు ఇంకా స్థానం ఉన్నట్లే అర్థం.
* మెసేజీలు చేస్తున్నా, ఫోన్ కాల్స్ చేస్తున్నా, మీతో మాట్లాడేందుకు ట్రై చేస్తున్నా వారికి మీరు కావాలని అర్థం. వారు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నట్లే.
* మీతో మాట్లాడాలని, మీ గొంతు వినాలని ఫోన్ చేసి.. ఏ మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉంటారు. లేదా ఏదేదై మాట్లాడుతుంటారు. కొందరైతే ఎవరికో చేయబోయి మీకు చేశామంటారు. కానీ అవన్నీ అబద్ధాలే. ఆ విషయం మీక్కూడా తెలిసే ఉంటుంది. మీకు తెలుసన్న విషయం వారికి కూడా తెలిసే ఉంటుంది.
* మీ స్నేహితులు, చుట్టాలు, పరిచయస్తుల ద్వారా మీ గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు లాంటి వివరాలన్నీ ఎప్పటికప్పడు తెలుసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తున్నా.. వారికి మీ పట్ల ఇంకా ప్రేమ ఉందనే అర్థం.
* మీరు వేరొక వ్యక్తితో మాట్లాడినా, చనువుగా ఉన్నా, చాటింగ్ చేసినా.. వారు చాలా జెలస్ గా ఫీలవుతారు. లోపల కుతకుత ఉడికిపోతారు. వారు పొసెసివ్‌గా ఫీలవ్వడం ఈజీగానే తెలుసుకోవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











