Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
కొత్త డేటింగ్ ట్రెండ్ టోలియమోరీ..ఆధునిక బంధాల్లో కొత్త విషం!
నేటి ఆధునిక ప్రపంచంలో ప్రేమ, డేటింగ్ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. సోషల్ మీడియా ఎఫెక్ట్, మారుతున్న లైఫ్ స్టైయిల్ కారణంగా బంధాలకు రోజూ ఒక కొత్త నిర్వచనం పుట్టుకొస్తోంది.
ఇలాంటి డేటింగ్ ప్రపంచంలోకి దూసుకొచ్చిన సరికొత్త ట్రెండ్ టోలియమోరీ(Tolyamory). బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒకరి మనసును వాళ్లే చంపుకునే ఈ ట్రెండ్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

టోలియమోరీ అంటే ఏమిటి?
సహించడం(Tolerate), బహుళ సంబంధాలు(Polyamory) అనే రెండు పదాల కలయికే ఈ టోలియమోరీ. పేరులోనే ఉన్నట్లు.. ఇందులో సహనం లేదా రాజీ పడటం అనేది ముఖ్యాంశం. తమ భాగస్వామి వేరొకరితో సంబంధం పెట్టుకున్నారని, లేదా మోసం చేస్తున్నారని తెలిసినా.. దానిని ఏమీ అడగకుండా మౌనంగా భరించడమే టోలియమోరీ.
ఇందులో ఇద్దరి మధ్య సమానత్వం గానీ, పారదర్శకత గానీ ఉండవు. భాగస్వామిని దూరం చేసుకోలేక, ఒక వ్యక్తి తమ కోపాన్ని, బాధను దిగమింగుకుని సర్దుకుపోతారు. నెమ్మదిగా ఇది ఒక అలవాటుగా మారి, తమ ఉనికినే కోల్పోయే పరిస్థితికి చేరుకుంటారు.
పాలియామోరీకి, దీనికి తేడా ఏంటి?
చాలామంది ఈ రెండింటినీ ఒకటే అనుకుంటారు కానీ అది నిజం కాదు. బహుళ సంబంధాలు (పాలియామోరీ) అనగానే ఇద్దరి మధ్యా ఒక స్పష్టమైన ఒప్పందం ఉంటుంది. పరస్పర అంగీకారం, నిజాయితీ, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కానీ టోలియమోరీలో ఇవేమీ ఉండవు. ఇదొక ఏకపక్ష ఒప్పందం లాంటిది.
ఇందులో ఒకరు తమకు ఇష్టమొచ్చినట్లు స్వేచ్ఛను అనుభవిస్తుంటే.. మరొకరు మాత్రం ఆ బంధాన్ని నిలుపుకునేందుకు నరకం అనుభవిస్తుంటారు. దీనివల్ల రిలేషన్ షిప్ లో సమతుల్యత దెబ్బతిని బంధం బలహీనపడుతుంది.
ఈ ట్రెండ్ ఎందుకు వేగంగా విస్తరిస్తోంది?
సోషల్ మీడియా యుగంలో మేము చాలా కూల్, చాలా బ్రాడ్ మైండెడ్ అనిపించుకోవాలనే తపన యువతలో పెరిగిపోయింది. తమలో అసూయ, అభద్రతా భావం, బాధ రగులుతున్నా వాటిని బయటకు చూపిస్తే ఎక్కడ పాతకాలం మనుషుల్లా ముద్ర వేస్తారో అన్న భయంతో బలవంతులుగా నటిస్తున్నారు. ఈ నకిలీ ఆధునికతను గుడ్డిగా నమ్మి, తమ నిజమైన భావోద్వేగాలను అణచివేసుకుంటూ తమకు తామే తీరని ద్రోహం చేసుకుంటున్నారు.
మానసిక ఆరోగ్యంపై ప్రాణాంతక ప్రభావం
టోలియమోరీ అనేది బయటకి కనిపించని ఒక మానసిక హింస. ఇలాంటి బంధంలో ఉన్నవారు క్రమంగా తమపై తమకే ఉన్న గౌరవాన్ని కోల్పోతారు. నాలో ఏం లోపం ఉంది? అన్న న్యూనతా భావం వారిని దహించేస్తుంది. నమ్మకం లేని చోట సంతోషం ఎలా ఉంటుంది? బంధంలో ఉద్రిక్తతలు, దూరం విపరీతంగా పెరుగుతాయి.
అన్నింటికంటే మించి తమ బాధను ఎవరితోనూ పంచుకోలేక తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనానికి గురవుతారు. దీర్ఘకాలం పాటు భావాలను అణచిపెట్టుకోవడం వల్ల ఇది డిప్రెషన్ వంటి గంభీరమైన మానసిక సమస్యలకు దారితీస్తుంది.



Click it and Unblock the Notifications
