Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పెళ్లాంపై అనుమానమా? వీళ్లకి చెప్తే మొత్తం యవ్వారం కనిపెడతారు!
ప్రస్తుతం సంబంధాల్లో నమ్మకం కనుమరుగైపోతుంది. ప్రేమ బంధంలో అయినా లేదా పెళ్లి బంధంలో అయినా నిజాయితీగా ఉండేవాళ్లు తగ్గిపోతున్నారు. పెళ్లనవాళ్లు తమ భాగస్వామికి తెలియకుండా మరొకరితో ఎఫైర్ కంటిన్యూ చేయడం, లవ్ లో కూడా ఇాద్దరు ముగ్గరితో ఎఫైర్లు పెట్టుకోవడం ఇప్పుడు చాలి కామన్ గా మారిపోతుంది. ఇటీవల ఓ డేటింగ్ యాప్ కంపెనీ నిర్వహించిన ఓ సర్వేలో పాల్గొన్న సగంమందికి పైగా తమకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు అంగీకరించారు. వివాహేతర సంబంధాల కారణంగా, అదే సమయంలో ప్రేమలో మోసాల కారణంగా నేరాలు కూడా పెరిగిపోతున్నాయి.
వివాహేతర సంబంధాలు పెరిగిపోయిన నేపథ్యంలో కొత్తగా పెళ్లి చేసుకున్నవాళ్లు కూడా తమ భాగస్వామిని అనుమానపు చూపులు చూస్తున్నారు. తమ పార్టనర్ కి కూడా వేరకరితో సంబధం ఉందేమోనన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీకు డిమాండ్ పెరిగిపోతుంది. ముఖ్యంగా భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరులో దీనికి ఫుల్ డిమాండ్ ఉంది. జీవిత భాగస్వామిపై అనుమానపు పురుగు మనసును తొలిచేస్తుంటే.. ఒకప్పుడు స్నేహితులనో, బంధువులనో ఆశ్రయించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారడంతో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రొఫెషనల్స్ ను అంటే ప్రైవేట్ డిటెక్టివ్ లను ఆశ్రయిస్తున్నారు.

నగరంలో వివాహేతర సంబంధాలు, నమ్మకద్రోహం కేసులు పెరిగిపోతుండటంతో.. ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. విడాకుల కేసులో కోర్టులో సమర్పించడానికి బలమైన సాక్ష్యాలు కావాలన్నా, తమ అనుమానాలకు శాశ్వతంగా తెరదించాలన్నా బెంగళూరు వాసులు ఈ ఏజెన్సీల తలుపు తడుతున్నారు. వీరి పనితీరు సినిమాలను తలపిస్తుంది. రెండు దశాబ్దాల అనుభవం ఉన్న సిటీ ఇంటెలిజెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ..మేము అత్యంత గోప్యత పాటిస్తూ రహస్య నిఘా నిర్వహిస్తాం. అనుమానిత వ్యక్తి కదలికలను గుర్తించి, ఫోటోలు, వీడియోల రూపంలో తిరుగులేని ఆధారాలు సేకరిస్తాం. డిజిటల్ ఫోరెన్సిక్స్ ద్వారా కూడా సాక్ష్యాలను బయటకు తీస్తాం అని తెలిపారు.
ఈమె జీవితాన్ని కాపాడారు
ఇటీవల బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ఏరియాలో నివసించే ఓ మహిళకు, ఆమె భర్త వివాహేతర సంబంధంపై ఈ సంస్థ పక్కా ఆధారాలు అందించి విడాకుల కేసులో ఆమెకు అండగా నిలిచింది. ఈ సేవలు కేవలం వివాహితులకే పరిమితం కాలేదు. నిశ్చితార్థం జరిగిన జంటలు సైతం, పెళ్లికి ముందే తమ కాబోయే భాగస్వామి నడవడిక, ఇతర సంబంధాలపై ఆరా తీసేందుకు వీనస్ డిటెక్టివ్ ఏజెన్సీ, స్లూత్స్ ఇండియా కన్సల్టెన్సీ వంటి సంస్థలను సంప్రదిస్తున్నారు.
ఈ ధోరణికి ప్రధాన కారణం
నగరంలోని వలస జనాభా. కుటుంబాలకు దూరంగా, ఒంటరిగా జీవించే యువతీయువకుల సంఖ్య పెరగడమే ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తోందని స్లూత్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నమన్ జైన్ అభిప్రాయపడ్డారు. వారి సంస్థ ఒక్క బెంగళూరులోనే నెలకు సగటున 30 అవిశ్వాస కేసులను దర్యాప్తు చేస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కోర్టులో ఆరోపణలు నిలబడాలంటే బలమైన సాక్ష్యం తప్పనిసరి. అందుకే బ్లూ ఈగిల్, గరుడ, షైన్ ఇండియా వంటి అనేక ఏజెన్సీలు చట్టబద్ధమైన ఆధారాలను అందించడంలో ప్రత్యేకత సాధించాయి. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో బెంగళూరులో ఈ ప్రైవేట్ డిటెక్టివ్ లు వ్యక్తిగత వివాదాలను పరిష్కరించడంలో, అనుమానపు నీడలను తొలగించి నిజానిజాలను నిగ్గు తేల్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.



Click it and Unblock the Notifications
