Latest Updates
-
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా?
భాగస్వామితో పదే పదే గొడవలవుతున్నాయా? అసలు కారణం కోపం కాదు.. మరేంటో తెలుసా?
ఏ అందమైన బంధానికైనా ప్రాణం పోసేవి మూడే మూడు అంశాలు.. నమ్మకం, గౌరవం, మనసు విప్పి మాట్లాడుకునే స్వేచ్ఛ. ఇవి సరిగ్గా ఉన్నప్పుడు ఆ బంధం ఒక అందమైన ప్రయాణంలా సాగుతుంది. కానీ, ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు తమ మనసులోని మాటలను సరిగ్గా వ్యక్తపరచలేకపోతారో, తమ అభిప్రాయాలను మాత్రమే ఎదుటివారిపై రుద్దాలని చూస్తారో.. అప్పుడే ఆ ప్రయాణంలో కుదుపులు మొదలవుతాయి.

చిన్న చిన్న విషయాలు కూడా పెను తుఫానులా మారి పెద్ద వాదనలకు దారితీస్తాయి. ఈ గొడవలు బంధంలో దూరాన్ని పెంచడమే కాకుండా, మనశ్శాంతిని పూర్తిగా దూరం చేస్తాయి. అయితే ప్రతి వాదన వెనుక కేవలం కోపమే ఉండదు, కనబడని ఎన్నో కారణాలు ఉంటాయి. అవేమిటో తెలుసుకుంటే బంధాన్ని చక్కదిద్దుకోవడం చాలా తేలిక.
మనసులో మాటను మౌనంగా దాచేస్తే...
చాలా బంధాల్లో పగుళ్లు రావడానికి ప్రధాన కారణం మనసులోని మాటను బయటపెట్టకపోవడమే. భాగస్వాముల్లో ఎవరో ఒకరు తమ అసంతృప్తిని, కోరికలను లేదా అంచనాలను బయటకు చెప్పకుండా మనసులోనే అణగదొక్కుకుంటారు. రోజులు గడిచేకొద్దీ ఈ భావాలు పేరుకుపోయి, ఒక అగ్నిపర్వతంలా మారి ఏ చిన్న కారణం దొరికినా బద్దలవుతాయి. అందుకే మనసులో ఏమున్నా ప్రశాంతంగా పంచుకోవడం అలవర్చుకోవాలి.
అంచనాలు ఆకాశంలో.. సంభాషణలు పాతాళంలో..
బంధం అన్నాక అంచనాలు ఉండటం సహజం. కానీ నేను చెప్పకపోయినా నా మనసులోని మాట నా భాగస్వామికి అర్థం కావాలి అని ఆశించడమే అసలు సమస్య. ఎదుటివారు మనసు చదువుకోలేనప్పుడు, సహజంగానే నిరాశ, ఫిర్యాదులు పుట్టుకొస్తాయి. అందుకే, ఊహల్లో బతికే బదులు, మీ అవసరాలు, అంచనాల గురించి మీ భాగస్వామితో దాపరికాలు లేకుండా మాట్లాడటమే ఉత్తమం.
గొడవలకు కారణం బంధం కాదు.. ఒత్తిడి కావచ్చు
మీ మధ్య జరిగే ప్రతి గొడవకు మీ బంధం మాత్రమే కారణం కాకపోవచ్చు. ఆఫీసులో పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి, లేదా నిరంతర అలసట.. ఇవన్నీ మనిషిని తీవ్రమైన చిరాకుకు గురిచేస్తాయి. ఆ సమయంలో చిన్న చిన్న విషయాలు కూడా భూతద్దంలో కనిపిస్తాయి. ఆ కోపం కాస్తా భాగస్వామి మీద చూపిస్తుంటారు. ఇలాంటప్పుడు సమస్య మీ భాగస్వామిలో లేదని, వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఉందని అర్థం చేసుకునే పక్వత ఉండాలి.
వినే ఓపిక లేకపోతే.. అది మాటల యుద్ధమే
గొడవ జరిగేటప్పుడు చాలామంది చేసే అతిపెద్ద తప్పు.. ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోవడం కోసం కాకుండా, వెంటనే బదులు ఇవ్వాలనే తొందరలో వినడం. తమ మాటను ఎవరూ పట్టించుకోవడం లేదని అనిపించినప్పుడు ఎవరికైనా కోపం కట్టలు తెంచుకుంటుంది. బంధం బలపడాలంటే కేవలం మాట్లాడటం కాదు, ఓపికగా వినడం కూడా నేర్చుకోవాలి. కొన్నిసార్లు, వారు చెప్పేది శ్రద్ధగా వింటే చాలు.. సగం గొడవ అక్కడే సమసిపోతుంది.
గెలవాల్సింది మీరు కాదు.. మీ బంధం
ప్రతి వాదనలోనూ నేనే కరెక్ట్ అని నిరూపించుకోవాలనే పంతం బంధానికి శత్రువు లాంటిది. ఇది సమస్యను పరిష్కరించకపోగా, మరింత జటిలం చేస్తుంది. బంధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్నది ముఖ్యం కాదు, ఇద్దరూ కలిసి ఆ సమస్యకు పరిష్కారాన్ని ఎలా కనుగొన్నారు అన్నదే ముఖ్యం. తప్పును అంగీకరించి, ఎక్కడ తగ్గాలో, ఎలా రాజీ పడాలో తెలిసినప్పుడు ఆ బంధం పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
