Latest Updates
-
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.!
ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు వస్తాయో తెలుసా? పరిశోధనలో ఏం తేలిందంటే?
ఆత్మహత్య ఆలోచనలు కొన్ని సందర్భాల్లో చాలా మందికి ఇబ్బందులకు గురి చేస్తాయి. కొన్ని చిన్న చిన్న సమస్యలు కొందరికి ఆత్మహత్య ఆలోచనలను తీసుకొస్తాయి. అయితే, ఈ ఆలోచనలు వస్తున్నప్పుడు కొన్ని పోషకాహార లోపాలు, ముఖ్యంగా విటమిన్ డి లోపం కారణంగా ఈ ఆలోచనలు ప్రబలవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే అసలు ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు వస్తాయి? దానికి కారణం ఏంటి అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆత్మహత్య ఆలోచనలు రావడానికి కారణాలు
విటమిన్-డి లోపం వల్ల కొందరు వ్యక్తులకు తీవ్రమైన ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అలాంటి వారికి ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, మరికొంత మంది తమలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని గమనించి, తాము ఏదైనా పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నామా అని తెలుసుకొని దానికి సంబంధించిన చికిత్సలు తీసుకుంటారు. అయితే ముఖ్యంగా, విటమిన్-డి లోపం కారణంగా ఆత్మహత్య ఆలోచనలు వస్తాయన్నది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం.

మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హ్యూమన్ మెడిసిన్ మరియు స్వీడన్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి ఈ అంశంపై ఒక అధ్యయనం చేశారు. విటమిన్ డి లోపం కారణంగా శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగి, అది ఆత్మహత్య ఆలోచనలను ప్రేరేపిస్తుందని వారు కనుగొన్నారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తులలో విటమిన్ డి స్థాయి చాలా తక్కువగా ఉన్నాయని ఈ పరిశోధన పేర్కొంది.
ఈ అధ్యయనంలో భాగంగా, ఆత్మహత్యకు యత్నించి ఇప్పటికీ బతికే ఉన్న 59 మందిని పరిశీలించారు. వారిలో 60 శాతం మందికి విటమిన్ డి లోపం ఉన్నట్లు గుర్తించారు. ఈ లోపం వల్ల వారు తీవ్ర డిప్రెషన్‌లో పడినట్లు కనుగొన్నారు. దీనికి కారణం ఆత్మహత్య ఆలోచనలకు వస్తున్నట్లు కనుగొన్నారు.
విటమిన్ డి లోపం ఉన్నవారి రక్తంలో అధిక స్థాయిలో ఇన్ఫ్లమేషన్ సంకేతాలు కనబడ్డాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ ఇన్ఫ్లమేషన్ మానసిక ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. ముఖ్యంగా డిప్రెషన్. డిప్రెషన్ కారణంగా జీవితం నిరాశతో నిండిపోయి, ఆత్మహత్య ఆలోచనలను నియంత్రించడం కష్టతరం అవుతుంది.
అందువల్ల, మానసిక ఆరోగ్య నిపుణులు.. విటమిన్ డి స్థాయి తక్కువగా ఉంటే, వాటిని పెంచేందుకు ట్రై చేయాలని చెబుతున్నారు. విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకోసం విటమిన్ డి ట్యాబ్లేట్లు తీసుకోకుండా సహజంగానే ఆ విటమిన్‌ను పొందేందుకు యత్నించాలి. మీ మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే, విటమిన్ డి లోపాన్ని నివారించేందుకు పోషకాహారం తీసుకోవడం ముఖ్యం. మష్రూమ్స్, కోడి గుడ్డు వంటి ఆహారాలను తీసుకోవడం, అలాగే ఎండలో కనీసం 30 నిమిషాలపాటు ఉండటం వంటివి చేయాలి.



Click it and Unblock the Notifications
