Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ..బంగారం కొనడానికి శుభ ముహూర్తం ఎప్పుడంటే..!
దేశవ్యాప్తంగా ఇవాళ(ఏప్రిల్ 30) అక్షయ తృతీయ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. లక్ష్మీదేవి,విష్ణువుని ఈ రోజు పూజించడం వల్ల సిరిసంపదలు, అదృష్టం లభిస్తాయని హిందువులు నమ్ముతారు. ఇవాళ అక్షయ తృతీయ సందర్భంగా ఉదయం నుంచే ఆలయాల దగ్గర భక్తుల రద్దీ కొనసాగుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజునే.. గంగానది భూమ్మీదకు వచ్చింది,త్రేతాయుగం ప్రారంభమైంది,శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చాడు,బ్రహ్మ శివుడు ఆశిస్సులతో స్వర్గపు సంపదకు కుబేరుడు అధిపతి అయ్యాడు. ఈ పవిత్రమైన రోజున గృహ ప్రవేశం, పెళ్లి, బంగారం కొనడం, కొత్తగా ఏదైనా ప్రారంభించడం వంటివి శుభప్రదం అని చెబుతుంటారు.
అక్షయ తృతీయ శుభ సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 29,2025 సాయంత్రం 5: 31 గంటలకు ప్రారంభహై..ఏప్రిల్ 30 మధ్యాహ్నాం 2:12 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ 30న అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఏప్రిల్ 30న ఉదయం 05:41 నుండి మధ్యాహ్నం 12:18 వరకు పూజకు చాలా శుభప్రదమైనదిగా సమయంగా పరిగణించబడుతుంది.

బంగారం కొనడానికి శుభ సమయం
ఏప్రిల్ 29 సాయంత్రం 05:31 నుండి ఏప్రిల్ 30 ఉదయం 05:41 వరకు.
ఏప్రిల్ 30 ఉదయం 05:41 నుండి మధ్యాహ్నం 12:18 వరకు.
సాయంత్రం ముహూర్తం: రాత్రి 08:16 నుండి రాత్రి 09:37 వరకు
రాత్రి ముహూర్తం: ఏప్రిల్ 30 రాత్రి 10:57 నుండి తెల్లవారుజాము 03:00 వరకు.
బంగారం కొనలేకుంటే ఇది కొనండి
ప్రస్తుతం బంగారం ధరలు కొండెక్కి కూర్చోడంతో బంగారం కొనడం అటుంచి గోల్డ్ పేరు వింటేనే సామాన్యులు వణికిపోతున్నారు. ఈ పవిత్రమైన రోజున బంగారం కొనుగోలు చేయలేని వాళ్లు లక్ష్మిదేవికి చిహ్నంగా భావించే వెండిని కొనడం శుభప్రదం. వెండి నాణేలు, వెండి ఆభరణాలు,వెండి పాత్రలు కొనడం శుభప్రదం. అయితే వెండి ధరలు కూడా పెరిగిన క్రమంలో దీనిని కొనుగోలు చేయడం కూడా కష్టంగా భావించే పేదవారు లేదా విలువైన లోహాలు కొనుగోలు చేయలేనివాళ్లు మట్టి కుండలు కొనుగోలు చేయడం శుభప్రదం అని పండితులు సూచించారు.



Click it and Unblock the Notifications
