Latest Updates
-
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు!
లాక్ డౌన్ ఎఫెక్ట్ : చరిత్రలో తొలిసారిగా భక్తులు లేకుండా సింహచలం స్వామికి చందనోత్సవం...
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చరిత్రలో తొలిసారిగా భక్తులు లేకుండా చందనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో అవతరించాడు. అందులో ఓ అవతారమైన లక్ష్మీ నరసింహ స్వామి అవతారం గురించి కొద్ది మందికే తెలుసు. శ్రీ మహా విష్ణువు హిరణ్య కశిపుని నుండి తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకే నరసింహ స్వామి అవతారం ఎత్తి.. గోడలను బద్దలు కొట్టుకుని వచ్చి మరీ హిరణ్యుడిని సంహరించాడని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత ప్రహ్లాదుని కోరిక మేరకు సింహగిరిపై వెలిశాడని చాలా మంది నమ్మకం.

అందుకే ఆనాటి నుండి సింహాచలం కొండపై నిత్యం భక్తులు ఆ స్వామి వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకునేవారు. అయితే సంవత్సరం పొడవునా చందనంతో కప్పి ఉండే స్వామి వారు వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రం నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ ఈసారి కరోనా లాక్ డౌన్ కారణంగా భక్తులకు ఈ స్వామి వారి నిజ స్వరూపాన్ని దర్శించుకునే అవకాశం లేకపోయింది.

పెద్దల ఆధ్వర్యంలోనే..
ప్రతి సంవత్సరం సింహాచలంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీని కారణంగా భక్తులకు స్వామి వారి నిజ స్వరూపం చూసే భాగ్యం కరువయ్యింది. ఈసారి వైరస్ కారణంగా భక్తులకు అనుమతి లేకపోవడంతో పెద్దల ఆధ్వర్యంలోనే చందనోత్సవం సాగింది.

చందనం తొలగించిన తర్వాతే..
ప్రతి సంవత్సరం చందనం తొలగించిన తర్వాతే భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. కానీ ఈసారి కరోనా వైరస్ కారణంగా ఈ అవకాశం కేవలం ఆలయ అనువంశిక ధర్మకర్తలకు మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది.

వైశాఖ శుద్ధ తదియ నాడే..
ఆదివారం తెల్లవారుజామునే వైశాఖ శుద్ధ తదియ నాడు బొరుగులతో స్వామి వారి మీద ఉన్న చందనాన్ని తొలగించారు. ఆ తర్వాత స్వామివారిని తొలిసారిగా ఆలయ ధర్మకర్తలు దర్శంచుకున్నారు. కానీ భక్తులకు మాత్రం ఈసారీ ప్రత్యక్షంగా చూసుకునే భాగ్యం దక్కలేదు.

ఏడాదిలో ఎన్నిసార్లంటే..
లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవంలో భాగంగా సింహాచలేశుని ఆదివారం తెల్లవారుజామునే సుప్రభాత సేవతో మేల్కొలిపి గంగాధర నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత బంగారు, వెండి బొరిగెలతో స్వామి విగ్రహంపై కప్పి ఉంచి చందనాన్ని తొలగించారు. తర్వాతే జాజిపోకల అనే మేలు రకం గంధాన్నే దీని కోసం వినియోగిస్తారు. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన పూజలని నిర్వహించి, గంధపు చెక్కల నుండి గంధాన్ని తీసే ప్రక్రియను మొదలు పెడతారు. స్వామి వారికి ఈ చందనపు పూత ఏడాదిలో కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే క్రతువు కాదు. సంవత్సరానికి నాలుగుసార్లు మూడు మణుగుల చొప్పున చందనాన్ని సమర్పిస్తారు. వైశాఖ శుద్ధ తదియతో పాటు జ్యేష్ట, అషాఢ పౌర్ణమి రోజుల్లో కూడా మరో మూడు మణుగుల చొప్పున స్వామి వారికి పూస్తారు. అలా స్వామివారికి కప్పిన 12 మణుగులు అంటే 500 కిలోల చందనాన్ని వైశాఖ శుద్ధ తదియ నాడు భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు.



Click it and Unblock the Notifications