Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
చతుర్మాసంలో ఇవి దానం చేయండి.. విష్ణు అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది
మానువులు మాత్రమే కాదు దేవుళ్లు కూడా ఒక నిర్దిష్ట కాలానికి నిద్రపోతారు. ఈ చర్య ఆధ్యాత్మిక కోణం నుంచి కూడా అత్యధిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 29వ తేదీ నుంచి విష్ణువు క్షీర సాగరంలో గాఢ నిద్రలోకి వెళ్లిపోతాడు. దీనినే చతుర్మాసంగా వ్యవహరిస్తారు. విష్ణువు పటాల రాజు బలితో కలిసి నివసిస్తాడని, దేవశయని ఏకాదశి నాడు యోగా నిద్రలో ఉండిపోతాడని భక్తుల విశ్వాసం.
ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం శ్రీ మహా విష్ణఉవు చతుర్మాస సమయంలో 4 నెలల పాటు యోగా నిద్రలోకి వెళ్తాడు. ఈ చతుర్మాస సమయం ఆషాఢమాసంలోని ఏకాదశి నుంచి కార్తీక మాసంలోని ఏకాదశి వరకు ఉంటుంది. ఈ కాలంలో రుషులు, సాధువులు, సన్యాసులు మహావిష్ణువు నామ జపం పఠిస్తూ ఉంటారు. తీర్థయాత్రలూ చేస్తుంటారు. ఇంతటి విశిష్టమైన చతుర్మాసంలో కొన్నింటిని దానం చేస్తే మంచి జరుగుతుందని విశ్వాసం. దానధర్మాలకు గొప్ప సమయంగా భావించే చతుర్మాసంలో ఏం దానం చేయాలి, ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చతుర్మాసంలో చేయాల్సిన దానాలు:
ఉద్యోగ, వ్యాపారాల్లో పనుల ఒత్తిడి సహజం. అయితే కొందరికి పని ఒత్తిడితో పాటు ఆందోళన కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఉద్యోగాల తొలగింపులు ఎక్కువైపోయాయి. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడిపోతుందో ఊహించలేని పరిస్థితి. అలాంటి ఆందోళన ఎదుర్కొంటున్న వారు చతుర్మాసంలో గొడుగు, వస్త్రాలు, బియ్యం, కర్పూరం లాంటివి దానం చేయాలి.
ఫలితంగా ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు వారి కోరికలు నెరవేరతాయి. ఇలా చేయడం వల్ల వ్యాపార, ఆర్థికాభఇవృద్ధితో పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. ఉన్నతోద్యోగుల నుంచి ఒత్తిడి ఉండదు. అలాగే రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
చతుర్మాస సమయంలో ఏం చేయాలి:
- చతుర్మాసంలో మన గ్రంథాల్లో స్వీయ నిగ్రహ కాలం అని కూడా పిలుస్తారు. అంటే మనస్సును నిగ్రహించుకుని కొన్ని పనులు చేయాలి, కొన్ని నివారించాలి.
- చతుర్మాసం సమయంలో సూర్యోదయం ముందే నిద్రలేచి స్నానం చేయాలి.
- రోజూ విష్ణువును ఆరాధించాలి. రోజూ శుభ్రమైన, ఉతికిన బట్టలే వేసుకోవాలి.
- రోజూ విష్ణు మంత్ర పఠనం మరవద్దు.
- చతుర్మాసం సమయంలో బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. ఆలుమగలు దూరం ఉండాలి.
చతుర్మాస సమయంలో చేయకూడని పనులు:
- చతుర్మాస సమయంలో ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
- చతుర్మాసంలో మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయ లాంటి వాటికి దూరంగా ఉండాలి.
- అబద్ధాలు చెప్పకూడదు. మోసం, నేరం, వెన్నుపోటు లాంటివి ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు.
- చతుర్మాసంలో నాలుగు నెలలు ఉంటుంది. ఈ సమయంలో సావన్ నెలలో సాగ్, ఆకుపచ్చ కూరగాయలు తినకూడదు. భడోన్ నెలలో పెరుగు తీసుకోవద్దు. అశ్విన్ మరియు దాల్ నెలలో పాలకు దూరంగా ఉండాలి. కార్తీక్ నెలలో పప్పుధాన్యాలు తినడం నిషిద్ధం.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
