Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
కైలాస పర్వతాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ ఎక్కలేదు..? నిజంగా అక్కడ అతీత శక్తి వున్నదా..?
మన దేశంలో ప్రముఖ పర్వాతాలు చాలా వున్నాయ్. హిమాలయాల్లోని ఎన్నో పర్వతాలను చాలామంది ఎక్కారు. మౌంట్ ఎవరెస్ట్‌ను కూడా ఎక్కి చాలా మంది రికార్డు సృష్టించారు కానీ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా కైలాస పర్వతాన్ని ఎక్కలేదు. దీని వెనక చాలా రహస్యాలే వున్నాయని అంటున్నారు. పరమశివుడు కైలాస పర్వతంపైనే వుంటాడని పురాణాలు మనకు చెబుతున్న విషయం తెలిసిందే. కైలాస పర్వతంలో దాగి వున్న మరిన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం.
ఆత్మలింగాన్ని పొందే క్రమంలో రావణుడు ఆ పరమశివుడి వేడుకోవడానికి హిమాలయాల వద్దే తన పది తలలను నరుక్కునే ప్రయత్నం చేశాడని పురాణం చెబుతోంది. ఈ హిమాలయ పర్వతం చైనా దేశంలోని టిబెట్ ప్రాంతంలో వుంది. కైలాస పర్వతం ఎత్తు 6.6 కిలోమీటర్లు, కైలాస పర్వతంపైకి ఇప్పటి వరకు ఒక్కరూ కూడా ఎక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఈ పర్వతం అంచులో రెండు సరస్సులు వుంటాయ్. ఒకటి దేవుడి సరస్సు మరొకటి రాక్షస సరస్సు. ఈ సరస్సులో పార్వతీ దేవీ స్నానం ఆచరించారని చెబుతుంటారు. ఇక్కడ పార్వతీ కుంబ్ కూడా వుంటుంది. బ్రహ్మదేవుడు తన మనసు నుంచి ఈ సరస్సును సృష్టించాడని అందుకే దీనికి మనససరోవర్ అని పేరు వచ్చిందని చెబుతారు.
ఇక రాక్షస సరస్సు అసలు పేరు రక్షస్తల్. ఈ సరస్సును రావణుడు ఏర్పాటు చేసుకున్నాడని అంటారు. అందువల్ల ఎవ్వరూ ఈ సరస్సు జోలికి వెళ్లరు. రావణుడు ఇక్కడే తన పదితలను నరుక్కొని శివుడి కోసం పరితపించాడని, పదవ రోజు శివుడు ప్రత్యక్షమయ్యి ఆత్మ లింగాన్ని సమర్పించాడని చెబుతుంటారు.
ఈ కైలాస పర్వతంపై మనిషికి రెండు వారాల్లో పెరగాల్సిన గోర్లు, 12 వారాల్లోనే పెరుగుతున్నాయని గుర్తించారు. జుట్టు కూడా వేగంగా పెరిగిపోతున్నట్లు కనుగ్గొన్నారు. దీని వెనక రహస్యమేంటో ఇప్పటి వరకు ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.

కైలాస పర్వతంలో శివుడు వున్నాడమి నమ్మి భక్తులు పవిత్రంగా భావిస్తారు, ఇక బౌద్దులు దీనిన ఘ్నానం ప్రసాదించే పర్వతంగా చూస్తున్నారు. ఇక జైనులకు సంబంధించిన మొదటి తీర్ధాంకరుడు ఇదే పర్వతంలో ఘ్నానం పొందాడని చెబుతున్నారు. అందువల్లే ఈ పర్వతాన్ని కేవలం హిందువులు మాత్రమే కాకుండా ఇతర మతాలవారు కూడా గౌరవిస్తున్నారు.
విష్ణు పురాణంలో ఈ పర్వతానికి నాలుగు ముఖాలు వున్నాయని చెబుతున్నారు. నాలుగు వైపుల నుంచి చూస్తే ఒక ముఖంలో సింహం, ఒక ముఖంలో గుర్రం, ఒక ముఖంలో నెమలి, మరో ముఖంలో ఏనుగు కనిపిస్తుందని, ఇవన్నీ శివుడు, పార్వతీ, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి వాహనాలను అంటున్నారు.
ఈ పర్వతాన్ని ఎక్కేందుకు కొంతమంది సాధువుల ప్రయత్నించారు కానీ వారందరూ అదృష్యమయ్యారని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ పూర్తగా ఎక్కినట్లు ఆధారాలు లేవని అంటున్నారు. ఈ పర్వతన్ని చైనా దేశం చాలా మంది ప్రముఖులతో ఎక్కించడానికి ప్రయత్నం చేసింది కానీ ఎవ్వరూ ఈ పర్వతాన్ని ఎక్కలేకపోవడం కూడా ఒక మిస్టరీగా భావించవచ్చు.
రెండు సార్లు ఈ పర్వతంపై హెలికాప్టర్లను పంపిస్తే అవి మధ్యలోనే కూలిపోయాయ్. ఈ పర్వతం ఎక్కడానికి టెక్నాలజీ కూడా సహకరించడం లేదని చెబుతున్నారు. శివుడు తన కుటుంబంతో ఈ కైలాస పర్వతం వద్ద నివసిస్తుంటాడని చెబుతుంటారు. ఇలాంటి ఎన్నో రహస్యాలు కైలాస పర్వతం చుట్టూ తిరుగుతున్నాయ్.



Click it and Unblock the Notifications