Latest Updates
-
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. మీ ర్యాంక్ అంచనా వేసుకోవడం ఎలా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి! -
వైశాఖ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు! -
కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి.. -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. లక్ష్మీ కటాక్షం మీకేనా? - శుక్రవారం, 17 ఏప్రిల్ 2026 -
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి! -
డీప్‌ఫేక్ ఫోటోలతో వేధిస్తున్నారా? 2 గంటల్లోనే డిలీట్ చేయించే మార్గమిదే! -
కర్ణాటక స్పెషల్ కుకుంబర్ అవలక్కి..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్! -
ఎండల వేడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో చల్లగా ఉండండి
దీపావళికి దీపాలు పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు.. చేస్తే ఏమవుతుందంటే..?
దీపావళి వచ్చేసింది. ఇంకో అయిదు రోజుల్లో దీపావళిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. ఆరోజున దేశం మొత్తం దీపాలు వెలిగించి ఈ దీపావళిని జరుపుకుంటారు. జీవితంలో నెలకొన్న చీకట్లను ఈ దీపావళి దూరం చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలాంటి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చిన్న శుభకార్యం నుంచి పెళ్లిళ్ల వరకు దీపంతోనే మొదలవుతాయి. అయితే దీపావళి రోజున పెట్టె దీపానికి ఇంకా అధిక ప్రాధాన్యత ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
అలాంటి దీపాలను పెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేయొద్దని, అలా చేయడం వల్ల ఎంతో అశుభమని చెబుతున్నారు. అయితే ఎలాంటి తప్పులు చేయకూడదు, దీపాలను ఏ విధంగా వెలిగించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దీపాలను వెలిగించేటప్పుడు చేయకూడని తప్పులు..
ఇలా వెలిగించాలి..
దీపం అనేది దేవతాస్వరూపం. ఈ దీపాన్ని దేవుడికి సమానంగా పూజిస్తుంటారు. అలాంటి దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపం ప్రమిదకు ముందుగా గంధం పెట్టాలి. అలాగే కుంకుమ, పూలు పెట్టి నమస్కరించుకోవాలి. అనంతరం అక్షింతలు సమర్పించి పూజించాలి. ఇలా చేయడం ద్వారా దేవుళ్ళ కరుణాకటాక్షాలు మనపై ఉంటాయని నమ్మకం.

మట్టి ప్రమిదలే వాడాలి..
చాలా మంది తమకున్న డబ్బులను చూపించేందుకు, ఆయుధునికతకు అలవాటు పడడంతో వెండి, బంగారం వంటి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. దీపాలను ఎలాంటి ప్రమిదల్లో వెలిగించడం కంటే మట్టి ప్రమిదల్లో వెలిగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. లోహం వేడి ఎక్కితే భూమి వేడెక్కుతుందని అది భూమాతను ఇబ్బంది పెడుతుందన్నారు. అందుకే మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించాలని అవి వేడిని గ్రహిస్తాయని పేర్కొంటున్నారు.
ఎన్ని వత్తులు ఉండాలంటే..
చాలా మంది ఒకటే ఒత్తి పెట్టి దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపాలను వెలిగించడం శుభసూచకం కాదని చెబుతున్నారు. దీపాలను రెండు లేదా మూడు వత్తులు చేసి వెలిగించాలని, అప్పుడే శ్రేయస్కరమని చెబుతున్నారు. అయితే దీపాలను ఏ నూనెతో పడితే ఆ నూనెతో వెలిగించకూడట. ఆవు నెయ్యి లేదా నువు నూనెతో వెలిగిస్తేనే ఆ దీపం యొక్క పవిత్రత ఉంటుందని చెబుతున్నారు.
దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు.. దీపావళి రోజున లక్ష్మీదేవికి దీపాలు వెలిగించి ఆరాధన చేయడం వల్లే.. పోయిన తన ఐశ్వర్యం తిరిగి పొందాడని పురాణాల్లో చెప్పారు. అందుకే దీపావళి రోజు దీపాలు పెట్టి లక్ష్మీదేవికి పూజలు చేస్తే ఆ ఇంట్లో దారిద్య్రం ఉండదని నమ్ముతుంటారు.
దీపం ఎందుకు వెలిగిస్తారంటే..
దీపం అనేది జీవాత్మకు, పరమాత్మకు ప్రతీక. అందుకే ఏదైనా పూజ చేస్తప్పుడు లేదా దేవుడిని ఆరాధించేటప్పుడు ముందుగా దీపం వెలిగించి తరువాత దేవుడికి పూజలు చేస్తూ ఉంటాం. షోడసోపాచారాల్లో అత్యంత ముఖ్యమైనది, పవిత్రమైనది దీపం. అందుకే ఈ దీపాన్ని ఏదైనా శుభకార్యాప్పుడు ముందుగా ఆరాధిస్తారు. అలాగే ఇంట్లో ఏదైనా అశుభమైనా దేవుడిని ఆరాధించేందుకు ఈ దీపాన్ని ముందుగానే వెలిగిస్తారు. అలాంటి పవిత్రమైన దీపాన్ని వెలిగించేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు. అలాంటప్పుడే మనపై దేవానుగ్రహం ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో పొందుపరిచిన అంశాలు ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. ఇవి కచ్చితనమైనవని మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications











