Latest Updates
-
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.!
చనిపోయిన వారి వస్తువులు ఉపయోగిస్తే ఏమవుతుందో తెలుసా..?
హిందూ శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి వస్తువుల్లో కొన్నింటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ొక వేల ఉపయోగిస్తే తీవ్ర నష్టం జరుగుతుంది. శాస్త్రాలు వీటి గురించి చాలా కఠినంగా హెచ్చరించాలి. గరుడు పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడనకు ఎన్నో విషయాలు చెబుతాడు. వాటిని చనిపోయిన వ్యక్తుల సంబంధించిన కూడా చాాలా విషయాలు చెబుతారు. పుట్టిన మనిషి తప్పకుడా చనిపోవాలని, చనిపోయిన వ్యక్తి తిరిగి జన్మించడం కూడా కచ్ఛితంగా జరుగుతుందని, దీన్ని ఎవరూ ఆపలేరని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మృత్యువు నుంచి ఎవరూ లప్పించుకోలేరు.

చావు వచ్చినప్పుడు, మనుషులు శరీరాన్ని త్యాగం చేయాల్సి వుంటుంది. శరీరంతో పాటు ఆ వ్యక్తి ఉపయోగించిన వస్తువులను కూడా త్యాగం చేయాల్సిందే. చనిపోయిన తరువాత మనిషి ఈ భూమిపైనుంచి ఏ వస్తువులను పైకి తన వెంట తీసుకొని వెళ్లలేడు. కేవలం తాను చేసిన పాప పుణ్యాలు మాత్రమే తన వెంట తీసుకొని వెళ్తాడు. జీవితంలో ఎవరైనా పాపాలకంటే పుణ్యాలు ఎక్కువగా చేసి వుంటే అతనికి మృత్యువు సమయంలో ఏ కష్టాలూ వుండవు. అప్పుడు అతని ప్రాణం చాలా సులభంగా ఏ కష్టాలూ లేకుండా పోతుంది.
ఎవరైతే జీవితంలో పుణ్యాలకంటే పాపాలు ఎక్కువగా చేస్తారో వారి చావు కూడా అంతే భయానకంగా వుంటుంది. అలాంటి వారు మృత్యు సమయంలో చాలా బాధను అనుభవించాల్సి వుంటుంది. యమదూతలు అతని పై చాలా దయనియంగా ప్రవర్తిస్తారు. యమపాశంలో ఆత్మను బంధించి యమలోకానికి తీసుకొని వెళ్తారు. యమలోకానికి వెళ్తున్న సమయంలో వారు చాలా బాధను అనుభవించాల్సి వుంటుంది. ఇవన్నీ జరిగినా కూడా యమదూతలకు ఆ పాపిపైన ఎలాంటి జాలి కూడా వుండదు. వాళ్లు ఆ పాపిని ఇంకా బాగా హింసిస్తారు.

హిందూ శాస్త్రం ప్రకారం సంసారంలో ఆత్మకి స్థానం వుండదు. ఆత్మ ఎప్పుడూ చావదు. అది చేసిన కర్మలను బట్టి ఆత్మ మళ్లీ మళ్లీ రూపం దాల్చుకుంటుంది. ఆత్మ శరీరంతో జన్మించిన తరువాత ఈ భూలోకంలో ఎన్నో భౌతిక సుఖాలకు అలవాటు పడుతుంది. చనిపోయిన తరువాత కూడా ఇష్టాన్ని ఆత్మ ఎప్పటికీ మరిచిపోదు. హిందూ శాస్త్రం ప్రకారం మనిషి భౌతిక సుఖాలను త్యాగం చేయకుండా సంసారంలో వుంటాడో అప్పటి వరకు వేరు వేరు యోనిల ద్వారా జన్మిస్తూనే వుంటాడు.
యోహం ఎక్కువగా వుంటే చనిపోయిన తరువాత కూడా ఈ భూలోకంలోనే తిరుగుతూ వుంటాడు. బలవన్మరణం, లేదంటే ప్రమాదాల్లో చనిపోయినవారు ప్రేతాత్మలై ఇక్కడే తిరుగుతుంటారు.
గరుడపురాణం ప్రకారం చనిపోయిన వారి కొన్ని వస్తువులను ఎట్టిపరిస్థితిలో ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆ వస్తువుల్లో చనిపోయిన వ్యక్తి యొక్క శక్తి వుంటుంది. మోహం ఎక్కువగా వుంటే గనుక చనిపోయిన తరువాత కూడా ఆ వస్తువుల్లోనే ఆ వ్యక్తి వుంటాడు. ఎవరైతే ఆ వస్తువులను ఉపయోగిస్తారో వారు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల చనిపోయిన వారి వస్తువులను ఎట్టి పరిస్థితిలో వాడకూడదు.కావాలంటే ఆ వస్తువులను ఘ్నాపకార్ధం ఇంట్లో భద్రపరుచుకోవచ్చు. లేదా ఆ వస్తువులను గంగానదిలో కలిపివేయాలి. కానీ తెలియకుండా కూడా ఆ వస్తువులను అస్సలు వాడకూడదు.
చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతించాలంటే ఆ వస్తువలను బయట ఎవ్వరికైనా దానం చేయాలి. ఇలా చేయకూడదని గరుడపురాణంలో శ్రీమహావిష్ణువు హెచ్చరించాడు. అవి గనుక ఉపయోగించడం మొదలుపెడితే వాటిపైన మోహంతో వారి ఆత్మ ఈ భూమిపైన తిరుగుతూనే వుంటుంది. ఇక ఆ ఆత్మకి ఎప్పుడూ మోక్షం లభించదు. దీంతో ఆత్మకు వేరే శరీరం కూడా ప్రాప్తించదు.
గమనిక : పైన ఇచ్చిన వివరాలన్నీ ప్రముఖ పండితులు, జ్యోతిష్యుల నుంచి సేకరించినవి. వీటిని మేము ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించము.



Click it and Unblock the Notifications
