Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
Tirumala: తిరుమల వెళ్లే వారికి భారీ శుభవార్త..స్వామి దర్శనం టైంలో బిగ్ ఛేంజ్!
కోట్లాదిమంది భక్తులకు తిరుమల(Tirumala) అంటే కేవలం పుణ్యక్షేత్ర ప్రదేశమే కాదు ఓ ఎమోషన్ కూడా. హిందువులు,ముస్లింలు, క్రిస్టియన్లు ఇలా మతాలకు అతీతంగా భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే ఆ ఏడుకొండలవాడిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోట్లాదిమంది పరితపిస్తుంటారు. అయితే తిరుమల వెళ్లిన తర్వాత అక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే గంటలపాటు నిరీక్షణ తప్పదు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో దర్శనానికి 30 గంటలు పైగా సయయం పడుతుంది. దీంతో చాలామంది భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో తిరుమల వెళ్లేవారికి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) గుడ్ న్యూస్ చెప్పింది . ఇకపై స్వామి వారి దర్శనానికి గంటలసేపు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త దర్శన విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది. సామి దర్శనం కోరుకునే భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి నిరంతరం అనేక సంస్కరణలు చేపడుతున్న టీటీడీ..ఇందులో భాగంగా వలం గంట సమయంలోనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ఏర్పాట్లును చేస్తోంది.

భక్తులు ఒక్క గంటలో శ్రావారి దర్శనం చేసుకునేలా ఏఐ దర్శన విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు బీఆర్ నాయుడు అన్నారు. ఇందుకోసం తిరుపతి దేవస్థానం బెంగళూరులోని ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం తిరుమలలో దర్శనానికి వచ్చే భక్తుల ముఖాలను అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ద్వారా స్కాన్ చేసి దర్శనానికి సమయం కేటాయిస్తారు. ఇందుకోసం తిరుపతి విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్, అలిబ్రి సహా 20 ముఖ్యమైన ప్రదేశాల్లో ఫేస్ స్కానింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
తిరుపతికి వచ్చే భక్తులకు ఈ టెక్నాలజీతో ముఖాన్ని స్కాన్ చేసి వారికి దర్శన సమయం కల్పిస్తారు. ప్రత్యేక దర్శనానికి గంట ముందుగా ఆలయానికి వస్తే మరో గంటలోపు దర్శనం చేసుకోవచ్చని నూతన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. దర్శనం కోసం దళారులకు డబ్బులు చెల్లించి భక్తులు మోసపోకుండా ఉండేందుకు, వారికి గౌరవప్రదమైన అనుభూతిని కలిగించేందుకు ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డెమోలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 6 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.



Click it and Unblock the Notifications
