Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
వినాయకుని గురించి తెలుసుకోవలసిన ఆసక్తికర నిజాలు
వినాయకుని గురించి తెలుసుకోవలసిన ఆసక్తికర నిజాలు
వినాయకుడు అంటేనే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది. వినాయకుడు, తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించుటయే కాకుండా, సరైన మార్గంలో పయనించుటకు మార్గ నిర్దేశo చేయగలడని భక్తుల ప్రఘాడ విశ్వాసం.
మనందరికీ తెలుసు, పార్వతీ దేవి ఇష్ట పూర్వకంగా సున్ని పిండితో చేసుకున్న ప్రతిమ నుండి వినాయకుడు ఉద్భవించాడని. అలా పార్వతీ పరమేశ్వరుల పుత్రుడయ్యాడు వినాయకుడు. కానీ అనేకమందికి తెలీని వినాయకుని గురించిన ఆసక్తికరమైన అంశాలను ఈ వ్యాసం లో తెలుసుకుందాం.


అపరిపూర్ణ అవతారం నుండి పరిపూర్ణంగా ...
స్నానమాచరించడానికి వెళ్ళిన పార్వతికి, ద్వారం వద్ద కాపలా కాస్తున్న వినాయకుడు, వచ్చిన పరమేశ్వరుని తండ్రి అని గుర్తెరుగక, గృహ ప్రవేశమునకు నిరాకరించాడు. అనేక మార్లు బ్రతిమిలాడినా ఫలితం లేని పక్షాన కోపోద్రిక్తుడైన పరమశివుడు, ఆగ్రహావేశoతో అడ్డుకున్నది కొడుకన్న విషయాన్ని గ్రహింపక త్రిశూలంతో తలను నరికి మూడవ కంటితో భస్మం చేశాడు.
స్నానమాచరించి బయటకు వచ్చిన పార్వతికి విగతజీవుడై కనిపించిన వినాయకుని చూసి భాధతో విలపిoపగా, చేసిన తప్పుని తెలుసుకున్న పరమశివుడు, తిరిగి ఆ బాలునకు జీవితాన్ని ప్రసాదిoచాలని సంకల్పించాడు. తద్వారా ఉత్తర దిక్కున తలను వాల్చి పడుకున్న వారి తలను నరికి తీసుకుని రావలసిందిగా తన అనుచరులకు పురమాయించగా, శివుని ఆత్మలింగాన్ని మింగి భంగపడిన గజేంద్రుని తలను తీసుకుని వచ్చారు. ఆ తలను వినాయకునికి సరిపోయేలా అమర్చిన శివుడు, పార్వతి దేవి కళ్ళకు మాత్రం మామూలు మనిషిగా కనిపించే వరాన్ని ప్రసాదించాడు. ఇలా అసంపూర్ణతతో కూడిన ముఖాన్ని కలిగి ఉన్న వినాయకుడు, తన భక్తుల విషయంలో అన్నిటా కష్టాలను తొలగించి సంపూర్ణతను కలిగి ఉండేలా చూసుకునే విధంగా శివుని నుండి వరాన్ని పొందాడు.

మహాభారతాన్ని వినాయకుడు ఎలా రాసాడో తెలుసా.. !
నిజానికి వేద వ్యాసుడు చెప్తుండగా, వినాయకుడు మహాభారతాన్ని రాసాడని భక్తుల నమ్మకం. కానీ వినాయకుడు ఒక నిబంధన మీద మాత్రమే, భారతాన్ని రాయడానికి ఒప్పుకున్నాడు. ఒకసారి కలము పట్టి రచనకు పూనుకున్నాక, మహా భారతం పూర్తయ్యే వరకు ఆపను, ఆవిధముగా మీరు ఎటువంటి అంతరాయము లేకుండా చెప్పవలసి ఉంటుంది అని. దానికి వ్యాసుడు బదులుగా నేను చెప్పిన ప్రతి విషయాన్ని అర్ధం చేసుకున్న పిదపనే రాయవలసి ఉంటుందని సూచించాడు.

వినాయకుని ప్రతిమ ఇండోనేషియా కరెన్సీ నోట్ల మీద ?
నిజం, వినాయకుని ప్రతిమను 20,000 రూపయా (భారత దేశం కరెన్సీ రూపీ లా, ఇండోనేషియాలో రూపయా) నోటు మీద ముద్రించింది. ఇండోనేషియాలో సుమారుగా 4 మిలియన్ల హిందువులు ఉన్నారని అంచనా.

బుద్దిజం లో కూడా వినాయకుని పూజిస్తారా?
బుద్దుని మరణం తర్వాత బుద్దిజం రెండు రకాలుగా విడిపోయింది, ఒకటి హీన యానం అయితే, మరొకటి మహాయానం. హీనయానం ప్రకారం బుద్దుడు ఒక మామూలు మనిషి అయితే, మహాయానం లో బుద్దుడు దేవునిగా కీర్తింపబడుతాడు. ఈ మహాయానం లోని భౌద్ధులు బుద్దుడి విగ్రహాన్నే కాకుండా గణేశుని కూడా పూజిస్తారు.

వినాయకుని కుటుంబం :
వినాయకుని ఇద్దరు భార్యలుగా సిద్ది, బుద్ది ఉన్నారని నమ్మకం. బుద్దిని, రిధి గా కూడా కొందరు పిలుస్తారు. ఇక్కడ బుద్ది శ్రేయస్సుని సూచిస్తే, సిద్ది విజయాన్ని సూచిస్తుంది. వినాయకునికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. శుభ , లభ అని. ఇక్కడ రిధి సంతానమైన శుభుడు మంచికి, పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచిoచబడితే, సిద్ది కుమారుడైన లభుడు , లాభానికి చిహ్నంగా ఉంటారు.
అందుచేతనే ఒక్క వినాయకుని పూజిస్తే అన్నిటా విజయములు సొంతమవుతాయని భక్తుల ప్రఘాడ విశ్వాసముగా ఉంది. తద్వారా ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా, మొదట వినాయకుని పూజ చేయడం హిందువుల ఆనవాయితీగా ఉంది, తద్వారా ఎటువంటి ఆటంకములూ లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం.

వినాయకునికి ఒక దంతం విరిగి ఉంటుంది :
ఎప్పుడైనా వినాయకుని ప్రతిమను గమనించారా, ఒక దంతం విరిగి ఉంటుంది. ఒకప్పుడు మన పెద్దవారు మనకు కథలుగా చెప్పడం వలన, అనేకమందికి ఈ విషయాల గురించిన అవగాహన ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారి కొన్ని కథలు తెలియకుండానే పోతున్నాయి అన్నది నిజం.
ఒకసారి వినాయకుడు, ద్వారం వద్ద కాపలా కాస్తున్న సమయాన, శివుని దర్శనానికి పరశురాముడు అచటకు వచ్చాడు. పరశురాముడు మహావిష్ణువు అంశ కూడా. మరియు ముక్కోపి. కానీ, వినాయకుడు పార్వతీపరమేశ్వరులకు అంతరాయం కలిగించకూడదన్న నెపముతో పరశురాముని లోనికి పంపలేదు. కోపానికి గురైన పరశురాముడు, ఆగ్రహంతో తన ఆయుధమైన గొడ్డలిని విసరగా, ఆ గొడ్డలి శివునిచే ప్రసాదింపబడినది కావడం వలన, యుద్దానికి దిగకుండా, ఆయుధాన్ని అంగీకరించాడు. ఆ గొడ్డలి దంతాన్ని విరిచేసింది.
మరో కథ ఆధారంగా లోక క౦ఠకుని గా పరిణమించిన మూషికుని సంహరించేందుకు తానే స్వయంగా దంతాన్ని విరిచి మూషికుడిపై అస్త్రంలా ప్రయోగించాడు, ఆ సమయాన మూషికుని భార్య పార్వతీ దేవి శరణు కోరగా తన చేతి గాజుని దంతానికి అడ్డుగా నిలిపి మూషికుని కాపాడింది. తప్పు తెలుసుకున్న మూషికుడు అప్పటి నుండి గణేశుని సేవకై అంకితమైపోయాడు.

ఎలుక వినాయకుని వాహనంగా ఎలా ?
అన్నదమ్ములైన వినాయకుడు మరియు కార్తికేయులలో అగ్ర పూజ(ఆది పూజ) అర్హత గురించిన ప్రశ్న తలెత్తింది. విశ్వాన్ని చుట్టి ఎవరు ముందుగా వస్తే వారికి ఆది పూజ అర్హత ప్రసాదింపబడుతుంది అని నారదుడు నివేదించగా, కార్తికేయుడు తన వాహనం అయిన నెమలిని అధిరోహించి విశ్వ పర్యటనకు పూనుకున్నాడు. ఇది కార్తికేయునికి చాలా సున్నితమైన అంశము. కానీ, వినాయకునికి ఎటువంటి వాహనమూ లేదు. కార్తికేయుని గెలవడానికి. ఆ సమయంలో నారద మునీంద్రుల సలహా మేరకు, తల్లిదండ్రులే విశ్వమని గ్రహించిన వినాయకుడు వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగాడు. తద్వారా కార్తికేయుడు ఎక్కడికెళ్ళినా అక్కడ వినాయకుడు కనిపిస్తూ వచ్చాడు. క్రమంగా ఓటమిని అంగీకరించిన కార్తికేయుడు, వినాయకుడే అగ్ర పూజకు అర్హుడని ఒప్పుకున్నాడు. అప్పటి నుండి ఆది పూజ వినాయకునికి చేయడం హిందూ మతంలో సాంప్రదాయంగా మారింది. ఇలా వాహనం లేక ఇబ్బందులకు గురైన వినాయకుడు, మూషికాసురుని గెలిచిన తర్వాత తన వాహనం ఎలుకగా మారేలా వరాన్ని ప్రసాదించాడు. మూషికాసురుని భార్య ఛత్రము (గొడుగు) గా మారి వినాయకునికి తన వంతు సేవలను అందించినది. అందుచేతనే వినాయక చవితి నాడు, ఛత్రమును ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు.

గజాననుడిగా పిలుస్తారు ఎందుకు .. ?
గజము అనగా ఏనుగు, ఆనన అనగా తల. ఏనుగు ముఖాన్ని తలగా కలిగి ఉన్న స్వరూపుడు కాబట్టి గజాననుడిగా కూడా పిలవబడుతాడు.
మరో కథనం ప్రకారం, గ అనగా గతి, జ అనే పదం జన్మ(పుట్టుక) నుండి వచ్చినది. అనగా ఈ ప్రపంచంలో ఏ అంశమైనా గణేశుని వలెనే జరుగుతుంది, మరియు చివరికి అతని కడకే చేరుతాయి అని. చావు పుట్టుకలకు మూలాధారమని అర్ధం.

మరి గణపతి అని ఎందుకు పిలుస్తారు?
వినాయకునికి గణపతి అని మరొక పేరు కూడా ఉంది. గణ అనగా అంశము. గణాలకు అధిపతి కావున గణపతిగా కీర్తిని గడించాడు. ఈ విశ్వంలో ఉన్న అన్ని అంశాలు 5 గణాలుగా విభజింపబడినవి. ఎటువంటి అంశం అయినా వాటి వాటి గణాలకు నిర్దేశించబడి ఉంటాయి. ఈ గణాలు వినాయకుని నుండే జనిస్తాయి.
అంతే కాకుండా పార్వతి దేవి నివాసాన్ని కాపు కాచే వారిని కూడా గణాలుగా పరిగణించబడుతుంది. ఈ ద్వార పాలకులు శివునితో కలిసి యుద్దానికి వెళ్ళిన సమయాన, వినాయకుడు ద్వార పాలకునిగా ఉన్న కారణాన కూడా గణపతి అనే పేరు నిలిచిపోయిందని అనేక కథల సారాంశం.



Click it and Unblock the Notifications











