Latest Updates
-
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.!
మహా శివరాత్రి 2021 : మీ విషెస్ తో భోళా శంకరుడి ఆశీర్వాదాలను పంపండి...
మహా శివరాత్రి అంటే మనందరికీ టక్కున గుర్తుకు వచ్చేది జాగరణ, ఉపవాసం. 2024 సంవత్సరంలో మార్చి 08వ తేదీన మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈ పర్వదినాన శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, కోటప్ప కొండ, అమరావతిలోని అమరేశ్వర స్వామితో ఆలయాలతో పాటు శివుని ఆలయాలన్నీ భక్తులతో నిండిపోతాయి.

ప్రతి ఒక్కరూ ఆ రోజంతా శివ నామస్మరణ చేస్తారు. అలాగే ఆ రోజంతా జాగరణ చేసి, ఎంతో భక్తి, శ్రద్ధలతో శివుని పూజలు చేస్తారు. కొందరు భక్తులు మహా శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం చేస్తారు. మరికొందరు శివ లింగానికి లింగాష్టకం, శివ పంచాక్షరి, దీపారాధన చేసి, రుద్రాభిషేకం, జలాభిషేకం వంటివి చేస్తారు. ఇలా చేస్తే తమ పాపాలన్నీ పోతాయని, తమకు ఎంతో పుణ్యం వస్తుందని చాలా మంది హిందువులు నమ్ముతారు. మరికొద్ది రోజుల్లో మహా శివరాత్రి పండుగ సందర్భంగా మీ బంధు మిత్రులతో శివునికి సంబంధించిన అద్భుతమైన కోట్స్, సందేశాలు, వాట్సాప్ స్టేటస్ లను అందరి కంటే ముందే షేర్ చేసుకోండి...

టాప్ - 10
శివుని అనంత గుణాలలో త్రినేత్రత్వం ఒకటి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేవి శివుని మూడు కళ్లు. అలా మూడింటిని కలిగి ఉండటం అనేది శివుని ప్రత్యేకత. అంతటి సర్వశక్తిమంతుడైన శివుని ఆశీస్సులు మీకు.. మీ కుటుంబ సభ్యులకు నిత్యం ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ మహా శివరాత్రి

టాప్ -09
‘‘ఓ జంగమా.. ఓ లింగమా.. పక్కనే పార్వతమ్మా.. తలపై గంగమ్మ.. మెడలో సర్పమా.. బూడిద దేహమా.. సిగలో చందమామ.. స్రుష్టినే స్రుష్టించగల దైవమా.. మాఘ మాసంలో మళ్లీ పుట్టిన పరమాత్మ యొక్క ఆశీస్సులతో మీరు ప్రతి విషయంలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ... మీకు మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

టాప్ -08
హర హర మహదేవ శంబో శంకర.. ఇహపరముల నేలే జయ జగదీశ్వర.. కోరిన వారి కోరికలన్నీ తీర్చేటి ఈశ్వరుడి చల్లని దీవెనలు ఎల్లవేళలా మీకు అందాలని కోరుకుంటూ మీకు మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

టాప్-07
‘‘ ఓం మహా ప్రాణ దీపం శివం శివం.. మహోంకార రూపం... శివం శివం..
మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం..
మహా కాంతి బీజం.. మహా దివ్య తేజం.. భవాని సమేతం భజే మంజునాథం‘‘ స్వామి ఆశీస్సులు మీకు మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు...

టాప్-06
ఈ శివ రాత్రి పండుగ శివుడు మరియు పార్వతీదేవి పెళ్లి రోజును సూచిస్తుంది.. ఈ మహా శివ రాత్రి మీ బంధుమిత్రులందరికీ ఎంతో సంతోషం తీసుకురావాలని కోరుకుంటూ హ్యాపీ మహా శివరాత్రి 2020.

టాప్-05
‘‘శివుని గొప్ప రాత్రి‘‘ శివుని పేరు జపించడం ద్వారా శివ రాత్రి అంతా గడపండి. ఆ దేవ దేవుని ఆశీర్వాదం పొందండి. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

టాప్ -04
శివుడు మహా తపస్వి. లోక క్షేమం కోసం చేసే తపస్సు అది. ఏ మంచి పని అయినా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలని, దేనికీ చలించరాదని ఈ శివతత్వం బోధిస్తోంది. ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.

టాప్ -03
‘శివ‘ శబ్దం మంగళాత్మకం. అందుకే ‘శివుడు‘ అనే పేరు ఎన్నో శుభాల్ని సూచిస్తుంది. శుభాలన్నీ గుణాలే! అనేకమైన గుణాలకు నిలువెత్తు నిదర్శనం మహా శివుడు. అందుకే ఆయనను లోకమంతా ఆరాధిస్తుంది. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

టాప్ -02
శివుడు తన సగ భాగాన్ని భార్య పార్వతీ దేవికి ఇచ్చి అర్ధనారేశ్వరుడిగా మారిపోయాడు. ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్థాంగాన్ని సమర్పించి ప్రేమ పంచాలన్నదే ఇందులోని భావం.. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకంక్షలు

టాప్-01
శివుడికి నంది వాహనుడు. ‘నంది‘ అంటే ఆనందింపజేసేది. వాహనం ఆనందాన్ని కలిగించాలని, జీవన యాత్రను సుఖవంతం చేయాలని సూచిస్తోంది ఆ నంది. మీ జీవితం కూడా అలాగే ఆనందమయంగా గడవాని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ మహా శివరాత్రి...



Click it and Unblock the Notifications
