Latest Updates
-
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.!
Mahavir Jayanti 2020 : మోక్షాన్ని పొందిన మహవీరుని సూత్రాల గురించి తెలుసుకోండి...
మహవీరుడు క్రీస్తు పూర్వం 599లో జన్మించాడని నమ్ముతున్నారు. ఇంకా కొందరు క్రీస్తు పూర్వం 615లో జన్మించాడని భావిస్తున్నారు. అయితే ఇందులో దేనికీ స్పష్టమైన ఆధారాలు లేవు.
మహవీరుని గురించి మన దేశంలో చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఈయన గురించి జైనులకు మాత్రం బాగా తెలుసు. జైన గ్రంథాల ప్రకారం మహవీరుడు బీహార్ రాజధాని పాట్నాకు సమీపంలోని కుండలపూర్ లో ఛైత్ర మాసంలో 13వ రోజు జన్మించాడు.

ఆ సమయంలో బీహార్ రాష్ట్రానికి రాజధానిగా వైశాలి ఉండేది. సిద్ధార్థ రాజు మరియు వైశాలి రాణి త్రిషాల వారి శిశువుకు 'వర్థమాన' అని పేరు పెట్టారు. అయితే మరికొందరు జైనులు మాత్రం మహవీరుడు క్రీస్తు పూర్వం 599లో జన్మించాడని నమ్ముతున్నారు. ఇంకా కొందరు క్రీస్తు పూర్వం 615లో జన్మించాడని భావిస్తున్నారు. అయితే ఇందులో దేనికీ స్పష్టమైన ఆధారాలు లేవు.

శ్వేతాంబర్ శాఖ ప్రకారం..
వర్థమాన మహవీర్ కథ కాలానుగుణంగా మార్పులు చెందుతూ వచ్చింది. శ్వేతాంబర్ శాఖ ప్రకారం మహావీర్ తల్లికి 14 రకాల కలలు ఉన్నాయి. ఇవన్నీ అతని కుమారుడు వర్థమాన్ రాజు లేదా సన్యాసి అవుతాడనే చెబుతుండేవట. జ్యోతిష్యులు తన తెగలోని సన్యాసిని తీర్థంకరుడు అని పిలుస్తారు.

సత్యాన్వేషణ కోసం..
తన రాజ్యాన్ని 30 సంవత్సరాల పాటు పరిపాలించిన మహవీరుడు అకస్మాత్తుగా తన సింహాసనాన్ని మరియు కుటుంబాన్ని విడిచిపెట్టి సత్యాన్వేషణ కోసం స్వయంగా బయలుదేరాడు. మహవీరుడు ఆ సమయంలోనే అందరికీ అహింస మార్గాన్ని నేర్పించి, అందరినీ సమానంగా చడాలని, ఎవరినీ ధిక్కారించి మాట్లాడకూడదని మార్గనిర్దేశం చేసేవారట. ఆ మహావీరుని విలక్షణమైన వ్యూహాలు మరియు సూక్ష్మ ఇంద్రియాలు అతడిని సూపర్ హీరోగా మార్చడానికి దారితీశాయి. అయితే అనేక జైన గ్రంథాల ప్రకారం, మహావీరుడు 72 సంవత్సరాల వయసులో జ్ఞానోదయం పొందాడు. జైన సాహిత్యంలో దీనిని 'మోక్షం' అంటారు.

ప్రపంచానికి సందేశం..
జైన మతం యొక్క 24వ తీర్థంకరుడు అయిన మహవీరుడు ప్రపంచానికి నిత్యం అహింస మరియు సత్యం యొక్క సందేశాన్ని ఇచ్చేవారు. సంపన్నమైన మరియు రాజ కుటుంబంలో జన్మించినప్పటికీ, వర్థమాన్ మహవీరు అన్ని సుఖాలను మరియు సంపదలను త్యాగం చేయడం ద్వారా చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సత్యం, అహింస మరియు ప్రేమ మార్గాన్ని చూపించాడు.

మహవీర్ జయంతి రోజున..
మహవీరుని జయంతి సందర్భంగా జైన మతానికి చెందిన వారు వివిధ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఈరోజున జైన సమాజానికి చెందిన వారందరూ మహవీర్ విగ్రహాన్ని స్వచ్ఛమైన నీరు మరియు సుగంధ నూనెతో కడుగుతారు. ఈ చర్య స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. వాస్తవానికి ప్రతిరోజూ మహవీరుని విగ్రహాన్ని శుభ్రం చేస్తారు. అలాగే మహవీరుని ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. దీని ద్వారా మహవీరుని సందేశాన్ని అందరికీ తెలియజేయడానికి ప్రయత్నిస్తారు.

మహవీరుని సూత్రాలు..
మహవీరుడు మోక్షాన్ని పొందిన తర్వాత కొన్ని సూత్రాల గురించి వివరించాడు. ఆ సూత్రాలను తాను కూడా ఆచరించాడు. అతను వెళ్లిన తర్వాత తన అనుచరులు మహవీరుని సూత్రాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆ సూత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి సూత్రం : అహింస
ఈ సిద్ధాంతం ప్రకారం, పరిస్థితి ఎలా ఉన్నా, జైనులు ఎప్పుడూ హింసకు దూరంగా ఉండాలి. వారు ఎప్పుడూ ఎవ్వరిని బాధపెట్టడం గురించి కూడా ఎవరూ ఆలోచించకూడదు.

రెండో సూత్రం - నిజం
మహవీరుడు అనే అతను మనిషి. అతను సత్యాన్ని నిజమైన మూలకంగా భావిస్తారు. సత్యం యొక్క నీడలో నివసించే తెలివైన వ్యక్తి అతని మరణాన్ని కూడా తేలికగా పొందుతాడు. అందుకనే మనిషి ఎప్పుడూ నిజమే మాట్లాడాలి.

మూడు, నాలుగు సూత్రాలలో..
ఈ సిద్ధాంతం ప్రకారం జైనుల స్వచ్ఛత యొక్క సద్గుణాలను తెలియజేస్తుంది. దీని ప్రకారం, వారు ఎటువంటి శృంగార చర్యలలో పాల్గొనరు. తమ దగ్గర ఉన్న వాటిలో ఎంతో కొంత పేదలకు ధానధర్మాలు చేయాలని మహవీరుడు చెప్పారట. ఈ సూత్రాలను అనుసరించే వారి స్పృహను రేకెత్తిస్తుంది.



Click it and Unblock the Notifications
